cheruku sudhakar goud
-
కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్... కాకపుట్టిస్తున్న మునుగోడు రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన రాకను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చెరుకు సుధాకర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాకపుట్టిస్తున్న మునుగోడు రాజకీయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసే విషయంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. చలమల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్లో ఒకరిని ప్రకటించే యోచనలో ఉంది. ఇవాళ జరిగే మునుగోడు సమావేశంలో అభ్యర్థిని అధికారంగా ప్రకటించే అవకాశముంది. చదవండి: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం -
కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్.. మునుగోడు కోసమేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి, పీడీ యాక్టు కింద జైలు జీవితం గడిపిన ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన చెరుకు సుధాకర్.. గురువారం జాతీయ నేతలతో నాలుగు గంటలకుపైగా కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, తానూ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని చెరుకు సుధాకర్ నిర్ణయానికి వచ్చినట్టు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. మునుగోడు కోసమే! చెరుకు సుధాకర్ గౌడ్‌ను కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే చేర్చుకుంటుందన్న చర్చ మొదలైంది. నిజానికి ఆయన కాంగ్రెస్‌లో చేరడంపై గతంలోనూ చర్చలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో.. బలహీన వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న మునుగోడులో సామాజిక అస్త్రం కింద చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంచుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు నియోకవర్గంలో గౌడ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. లక్షకుపైగా ఇతర బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి. ఆ రెండు వర్గాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోందని అంటున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక దృక్పథం ఉన్న నేతగా చెరుకు సుధాకర్‌కు గుర్తింపు ఉంది. ఇది కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న చెరుకు సుధాకర్.. నేరుగా చండూరులో జరిగే కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ స్థాయి సమావేశానికి వెళ్లనుండటం గమనార్హం. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక వస్తే బరిలో దింపేందుకు పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్ నేత, చెలిమల కృష్ణారెడ్డి పేర్లను కూడా కాంగ్రెస్ పరిశీలిస్తోంది. చదవండి: పావులు కదుపుతున్న హస్తం నేతలు.. రేవంత్‌పై ఢిల్లీ పెద్దలు సీరియస్! -
బీసీలకు 65 శాతం టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 శాతం అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటిపార్టీసహా 22 బీసీ సంఘాలు, 64 బీసీ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మంగళవా రం అఖిల పక్షాలు, బీసీ సంఘాల సమావేశంలో ఎల్.రమణ(టీడీపీ), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), దిలీప్‌కుమార్(టీజేఎస్), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటిపార్టీ), రాజేందర్ (ఎంఐఎం) ప్రసంగించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో బీసీలకు 65శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్, కాంగ్రెస్ భరతం పడతామని హెచ్చరించారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గంలో 60 నుంచి 70 శాతం బీసీ జనాభా ఉందని, బీసీలకు టికెట్లు ఇస్తే వారే గెలుపుగుర్రాలని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇప్పటికే బీసీ బిల్లుకు మద్దతుగా ప్రధానమంత్రికి లేఖ రాశామన్నారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ తమ పార్టీ ఇప్పటికే బీసీలకు 50 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించినట్టుగా గుర్తుచేశారు. బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో బీసీలకు కేటాయించిన బడ్జెట్లో 50 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలకు అన్యా యం చేస్తున్నాయని, ఇది సరైన విధానం కాదని విమర్శించారు. టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ మాట్లాడుతూ పార్టీ పదవుల్లో తమ పార్టీ ఇప్పటికే బీసీలకు 50శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, గొరిగే మల్లేశ్, నీల వెంకటేశ్, రమ్య, వేముల రామకృష్ణ, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ’తో ఉద్యోగావకాశాలు
సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆజాద్‌మైదాన్‌లో ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ దీక్షలో పాల్గొన్న తెలంగాణవాదులను సుధాకర్ గౌడ్ కలిశారు. అక్కడ చేపడుతున్న ధర్నా, దీక్షలో పాల్గొన్న వారితో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం మట్లాడుతూ ముంబై నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మన తెలంగాణ ప్రజ లకే దక్కిందని కొనియాడారు. తెలంగాణలో ఉద్యో గావకాశాలు లేకపోవడంవల్ల వలసలు పెరిగాయ ని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అవి తగ్గిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి చెందుతుందని, అప్పట్లో భార త రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. అంతకుముందు దీక్ష ప్రాంగణానికి చేరుకున్న సుధాకర్‌కు తెలంగాణవాదులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ పాటల తో హోరెత్తించారు. కార్యక్రమం లో బోరివలికి చెందిన గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు తోకల రాములు, కె.శంకర్, తెలంగాణ ఐక్య ప్రజాఫ్రంట్ నాయకులు అక్కనపెల్లి శ్రీనివాస్, నాగిల్ల వెంకన్న, తెలంగాణ బెస్త సంఘం అధ్యక్షు డు ఎన్.మల్లేశ్ బెస్త, ఆర్.లక్ష్మణ్ బెస్త పాల్గొన్నారు.