Chettinad Cement
-
వైఎస్సార్సీపీ నేతపై ‘చెట్టినాడ్’ సెక్యూరిటీ దాడి
దాచేపల్లి (గురజాల): సిమెంట్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకుడు కర్పూరపు వెంకటకోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమ వద్ద బుధవారం జరిగింది. బాధితుడు వెంకటకోటయ్య, స్థానికుల కథనం ప్రకారం.. చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న తమకు యాజమాన్యం జీతాలు చెల్లించడంలేదని, లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు కార్మికులు పెదగార్లపాడు వైఎస్సార్సీపీ నేత వెంకటకోటయ్యతో చెప్పుకున్నారు. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు వెంకటకోటయ్య, అతని కుమారుడు శ్రీనివాసరావు బుధవారం పరిశ్రమ ప్రధానగేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న టీడీపీ నాయకుడిని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేయకుండా, విజిటర్స్ రిజిస్టర్లో సంతకం చేయించకుండా లోపలికి పంపించారు. వెంకటకోటయ్యను మాత్రం సంతకం చేసి సెల్‌ఫోన్ తమకు అప్పగించిన తరువాతే లోపలికి వెళ్లాలని చెప్పారు. టీడీపీ నాయకుడిని పంపించి తననెందుకు పంపించరని అడుగుతున్న వెంకటకోటయ్యపై సెక్యూరిటీ సిబ్బంది, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారి శివశంకర్ దుర్భాషలాడుతూ పిడిగుద్దులు, లాఠీకర్రలతో దాడికి తెగబడ్డారు. వెంకటకోటయ్య స్పృహతప్పి పడిపోయాడు. వెంకటకోటయ్య కుమారుడు శ్రీనివాసరావుపై కూడా సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పరిశ్రమ వద్దకు చేరుకుని వెంకటకోటయ్యపై దాడిచేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని వెంకటకోటయ్యపై దాడికి పాల్పడిన శివశంకర్‌తో పాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వెంకటకోటయ్య, శ్రీనివాసరావును పిడుగురాళ్లలోని వేట్ వైద్యశాలకు తరలించారు. -
లాక్డౌన్: చెట్టినాడ్ సిమెంట్స్ నిర్వాకం!
సాక్షి, తిరుపతి: తమిళనాడుకు చెట్టినాడ్ సిమెంట్ సంస్థ లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కింది. కరోనా రెడ్‌జోన్‌గా ఉన్న రేణిగుంటలో ఆంక్షల్ని పట్టించుకోకుండా గూడ్స్ రైళ్ల ద్వారా భారీగా సిమెంట్ దిగుమతి చేసుకుంది. దాంతోపాటు భౌతికదూరం పాటించకుండానే హమాలీలతో యాజమాన్యం సిమెంట్ అన్లోడ్ చేయిస్తోంది. దాదాపు 20 వేల టన్నుల సిమెంట్ తమిళనాడు నుంచి రేణిగుంటకు వచ్చినట్టు తెలుస్తోంది. చెట్టినాడ్ సిమెంట్ సంస్థ నిర్వాకంపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: ఏపీలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు) ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 722కు చేరింది. వారిలో 92 మంది కోలుకున్నారు. 20 మంది మృతి చెందారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 610గా ఉంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53కు చేరగా.. వారిలో నలుగురు కోలుకున్నారు. ఏపీ వ్యాప్తంగా తాజాగా నమోదైన 75 కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 25 కేసులు నమోదవడం గమనార్హం. (చదవండి: ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం) -
తిరుపతిలో చెట్టినాడు సిమెంట్ కంపెనీ నిర్వాకం
-
ఉద్యోగం కోసం టవరెక్కి హల్చల్
తాండూరు రూరల్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉన్న చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో ఓ భూ నిర్వాసితుడు హల్చల్ చేశాడు. తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామానికి చెందిన ఎరుకలి రాజు శుక్రవారం చెట్టినాడు ఫ్యాక్టరీలో ఉన్న ఓ టవర్ ఎక్కాడు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు రాజుకు సంబంధించిన పొలంను అమ్మాడు. ఆ సమయంలో ఆయనకు ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలు తర్వాత ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో శుక్రవారం అతడు ఫ్యాక్టరీలో ఉన్న టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తే తప్పా టవర్ దిగనని చెప్పారు. దీంతో కంపనీ ప్రతినిధులు ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో టవర్ దిగారు. అనంతరం తాండూరు జెడ్పీటీసీ రవిగౌడ్ కంపనీకి చేరుకుని భూ నిర్వాసితుడితో మాట్లాడారు. అనంతరం అతడికి ఉద్యోగం కల్పించాలని కోరారు. -
చెట్టినాడ్ చేతికి అంజనీ సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్‌ను తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ సిమెంట్ కొనుగోలు చేసింది. ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. సుమారు రూ.100 కోట్లకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లకు చెందిన 61.62% వాటాను చెట్టినాడ్‌కు విక్రయించడానికి మంగళవారం సమావేశమైన అంజనీ సిమెంట్స్ బోర్డు ఆమోదం తెలిపింది. మిగిలిన వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఓపెన్ ఆఫర్ ధర రూ.61.75 కాగా, రూ. 10 ముఖ విలువగల 47.89 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ బీఎస్ఈకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం రూ.29.52 కోట్లు కేటాయించింది. కె.వి.విష్ణురాజుకు చెందిన అంజనీ పోర్ట్లాండ్ సిమెం ట్ గత 9 నెలల్లో రూ.202 కోట్ల ఆదాయంపై రూ.5.24 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కంపెనీకి రూ.222 కోట్ల రుణ భారం ఉన్నట్లు తెలుస్తోంది. 1983లో స్థాపించిన అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్‌కి నల్లగొండ జిల్లాలో 1.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల్గిన యూనిట్ ఉంది. ఈ వార్తల నేపథ్యంలో అంజనీ పోర్ట్‌ల్యాండ్ షేరు 4% తగ్గి రూ.55.45 వద్ద ముగిసింది.