Chicago University
-
ఏడేళ్లలో 48కోట్ల మంది చనిపోతారా?
ఢిల్లీ : ప్రసుత్తం మనం జీవిస్తున్న ఆధునిక జీవనంలో కాలుష్యం అనేది ఈ భూమండలం మీద ఎంత ప్రభావం చూసిస్తుందో మనందరికి తెలిసిందే. కాలుష్యం అనేది రకరకాలుగా ఉన్నా ప్రభావం చూసిస్తున్నది మాత్రం సగటు జీవరాశి మీదే అన్న సంగతి చెప్పనవసనం లేదు. ఈ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఏకంగా ప్రపంచదేశాలన్ని ఒక్క తాటి మీదకు వచ్చి వేడెక్కిన భూగోళాన్ని 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గించాలని ప్యారిస్ వాతావరణ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలుష్యానికి మచ్చుతునక.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్ ప్రాంతం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా యునివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఎపిక్) చేపట్టిన కాలుష్యం ప్రభావం సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 225 దేశాలలో కాలుష్య ప్రమాణాలను 2.5 పర్టికులేట్ మాటర్లో పరిగణలోకి తీసుకొని సర్వే చేపట్టారు. ఈ జాబితాలో అత్యంత కాలుష్య ప్రభావ దేశంగా భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో నేపాల్ దేశం ఉన్నట్లు సర్వే పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన పరిధి మేరకు కాలుష్యాన్ని నియంత్రించడంలో భారతదేశం విఫలమైందని సర్వేలో బహిర్గతమైంది. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 48 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 40శాతం మంది ప్రజలకు వారి ఆయుష్‌లో ఏడేళ్లు తగ్గిందని పేర్కొంది. 2013-17 శాంపిల్ సర్వే ప్రకారం భారతదేశం ఆయుర్దాయం 67 ఏళ్ల నుంచి 69 ఏళ్లకు పెరిగినా కాలుష్య ప్రభావంతో అది ఏడేళ్లకు తగ్గి 60 నుంచి 62 ఏళ్ల దగ్గర ఆగిపోయింది. ముఖ్యంగా ఇండో- గాంగటిక్ ప్రాంతంలో ఉన్న పంజాబ్, చంఢీఘర్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఈ రాష్ట్రాల్లో విపరీత కాలుష్య ప్రభావం వల్ల అక్కడి ప్రజల ఆయుర్దాయం 62 ఏళ్లుగా ఉందని పేర్కొంది. అయితే ఇదంతా కేవలం 18 ఏళ్లలోనే జరిగినట్లు ఎపిక్ తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. 1998కి ముందు ఇంత కాలుష్యం లేదని, 1998-2016 వరకు 72 శాతం మేర కాలుష్యం పెరిగిందని తమ అధ్యయనంలో నివేదించింది. తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం పైన పేర్కొన్న ఏడు రాష్ట్రాల్లోని కాలుష్య ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే 1998-2016 మధ్య కాలంలో మిగతా అన్నిదేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన (10మైగ్రా.మీటర్ క్యూబ్) ప్రమాణాలు పాటిస్తే కొంతమేర ప్రభావం తగ్గి భారతదేశంలో 4.3 సంవత్సరాల ఆయుశ్శు పెరిగే అవకాశం ఉందని తన రిపోర్ట్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కాలుష్యాన్ని అరికట్టేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ఇండియా ప్రోగ్రామ్(ఎన్‌క్యాప్) పేరుతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల వచ్చే ఐదేళ్లలో 20-30 శాతం మేర కాలుష్యాన్ని తగ్గించే పనిగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్‌ను కచ్చితంగా అమలు చేస్తే సగటు భారతీయుడు ఆయురార్ధం 1.3, ప్రభావితమైన ఏడు రాష్ట్రాల్లో 2ఏళ్లకు పెరుగుతుందని నివేదికలో వెల్లడించింది. -
కాలుష్యం తగ్గిద్దాం.. మరింత కాలం జీవిద్దాం!
- సగటున నాలుగేళ్లు పెరగనున్న భారతీయుల జీవితకాలం - వాయు కాలుష్యంపై డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు పాటిస్తే చాలు - ఎక్కువ లాభపడే నగరం దేశ రాజధాని ఢిల్లీనే - ఢిల్లీలో సుమారు తొమ్మిదేళ్లు పెరగనున్న జీవితకాలం - షికాగో వర్సిటీ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌లో వెల్లడి - వాయు కాలుష్యం కారణంగా దేశంలో మరణాల సంఖ్య - ఆధారం: స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్–2017 సాక్షి, తెలంగాణ డెస్క్ : వాయు కాలుష్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం తగ్గించినట్లయితే భారతీయుల జీవితకాలం సగటున మరో నాలుగేళ్లు పెరుగుతుందట. ఇటీవల విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్(ఏక్యూఎల్‌ఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను రూపొందించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలను భారత్ పాటించినట్లయితే ఎక్కువగా ప్రయోజనం పొందే నగరం దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీనే అట. ఇక్కడ ప్రజల జీవితకాలం సుమారు 9 సంవత్సరాలు పెరగనుందట. ఆ తర్వాత ఆగ్రాలో 8.1 సంవత్సరాలు.. బరేలీలో 7.8 సంవత్సరాలు జీవితకాలం పెరిగే అవకాశం ఉందట. వాయు కాలుష్యానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వో లేదా జాతీయ ప్రమాణాలను అమలు చేస్తే ప్రజల జీవితకాలం ఎంత పెరుగుతుందనేది ఈ ఇండెక్స్ ద్వారా అంచనా వేసింది ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధేశించిన ప్రకారం పీఎం 2.5ను నియంత్రించగలిగితే భారతీయుల జీవిత కాలం సగటున 1.35 సంవత్సరాలు పెరుగుతుందని ఏక్యూఎల్‌ఐ అంచనా వేసింది. కాగా, 2015 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారతీయుల సగటు జీవితకాలం 68.35 సంవత్సరాలు. పీఎం 2.5అంటే..? గాలిలో కలసిపోయి తలవెంట్రుక కంటే 30 రెట్లు చిన్నగా లేదా 2.5 మైక్రాన్ల సైజులో ఉండే నలుసు పదార్థమే పర్టిక్యూలేట్ మ్యాటర్–పీఎం 2.5. దీనిని పీల్చడం వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం గాలిలో పీఎం 2.5ను వార్షికంగా అనుమతించే స్థాయి ప్రతి క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రో గ్రాములు. అదే భారతదేశ జాతీయ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ ప్రకారం పీఎం 2.5ను అనుమతించేది 40 మైక్రో గ్రాములే. ఢిల్లీలో పీఎం 2.5 ఒక క్యూబిక్ మీటర్‌కు 98 మైక్రో గ్రాములు ఉందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో పీఎం 2.5 స్థాయి జాతీయ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ కంటే రెంట్టింపు.. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు పది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఢిల్లీలో పీఎం 2.5ను డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం నియంత్రించగలిగితే అక్కడి ప్రజల జీవితకాలం సుమారు 9 సంవత్సరాలు పెరుగుతుంది. అదే జాతీయ ప్రమాణాల ప్రకారం నియంత్రించడగలిగితే సుమారు 6 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ ఇంత తక్కువగా ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందువల్లే డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలను పాటించాలని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ గ్రీన్‌స్టోన్ చెపుతున్నారు. -
మళ్లీ అధ్యాపకుడిగా.. అద్భుతం: రాజన్
షికాగో వర్సిటీలో చేరటంపై వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల అనంతరం షికాగో యూనివర్సిటీలో అధ్యాపక విధుల్లో చేరిన రఘురామ్ రాజన్... తాను వెనక్కి తిరిగి రావడం, షికాగోలో బైక్ రైడింగ్ చేయడం గొప్పగా ఉందన్నారు. ‘‘బైక్‌ను బయటకు తీసి తీరం వెంట రహదారిపై దాన్ని నడపడం నా జీవితంలో గొప్ప అనుభూతి. కోరుకున్నంత కాలం నేను ఈ పనిచేయగలనని భావిస్తున్నాను’’ అన్నారాయన. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మీడియా బృందానికి ఆయన ఇంటర్వూ్య ఇచ్చారు. బూత్ స్కూల్ పాతికేళ్ల పాటు తనకు ఇల్లులా ఉందన్నారు. దాన్ని ఓ అద్భుతమైన స్కూల్‌గా అభివర్ణించారు. ‘‘ఇదో గొప్ప నగరం. గొప్ప సహచరులున్నారు. ఇక్కడికొచ్చిన ప్రతిసారీ ఇది విభిన్నంగా కనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. అధ్యాపక వృత్తిలోకి తిరిగొచ్చాక దేనికోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘వాస్తవిక ప్రపంచంలో ఉద్యోగ విధుల్లో ఉన్న వారికి కనీసం ఆలోచించేంత తీరిక కూడా దొరకదు. అదే ఇబ్బంది. ఇపుడు అధ్యాపక రంగంలో ఉన్నాను. కావాలంటే నాలుగు రోజులు ఓ గదిలో గడిపేయగలను. కూర్చుని పేపర్ వంక చూస్తూ బయటకు రానంటున్న ఆలోచనలతో పోరాడొచ్చు’’ అంటూ ప్రస్తుత వృత్తిలో ఉన్న వెసులుబాటును రాజన్ చెప్పుకొచ్చారు. పరిశోధనల గురించి చెబుతూ... దాన్నెప్పుడూ వదిలిపెట్టేది లేదని, ఆర్బీఐలో ఉన్నప్పుడు కూడా తాను కొన్ని పేపర్లను ప్రచురించానని తెలియజేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతూ వచ్చే 30 ఏళ్ల కాలానికి అదో పరిశోధనాంశంగా మారిందని చెప్పారు. ప్రస్తుతం రఘురామ్ రాజన్ యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1991లోనే ఆయన బూత్ స్కూల్లో ప్రొఫెసర్‌గా చేరగా... మధ్యలో 2003 నుంచి 2006 వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలో చీఫ్ ఎకనమిస్ట్, రీసెర్చ్ డైరెక్టర్‌గా, 2013 నుంచి 2016 వరకు మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. -
రాజన్‌కు షికాగో యూనివర్సిటీ ఆహ్వానం
వాషింగ్టన్: విద్యా బోధనకు తిరిగి రావాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను ప్రతిష్ఠాత్మక షికాగో యూనివర్సిటీ ఆహ్వానించింది. ఆయనకు ఉన్న అపార అనుభవం యూనివర్సిటీకి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని వర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ సునీల్ కుమార్ చెప్పారు. సెప్టెంబర్ 4న తన మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకోనున్న రాజన్, ఆ తరవాత విద్యాబోధన వైపు వెళతానని చెప్పారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్‌కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష అవగాహన ఉంది. ఈయన 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించారు. -
బాబుకు చికాగో వర్సిటీ గౌరవ డాక్టరేట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏపీ అభివృద్ధికి కృషిచేస్తున్నందుకు ఈ డాక్టరేట్ ప్రకటించినట్లు యూనివర్సీటీ స్పష్టం తెలిపింది. చంద్రబాబు దార్శనీయకత, ప్రతిభసామర్థ్యాలు గొప్పవని ఈ సందర్భంగా వర్సిటీ కొనియాడింది. 1867 ఏర్పాటైన చికాగో వర్సిటీ ఒక విదేశీ నేతకు డాక్టరేట్ ప్రకటించింది. -
వారిలో విభిన్న ఆలోచనలు..
మనిషి సంఘజీవి. అతిని చుట్టూ రకరకాల అనుబంధాల తీగలను పెనవేసుకొని సమాజంలో మనుగడ సాగిస్తుంటాడు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇది విభిన్నంగా ఉంటుంది. కుటుంబంతో పాటు ఎలాంటి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి వారిపై అమెరికాలోని చికాగో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు మానసిక శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు జరిపి ఒంటరి వారి ఆలోచనలు సంఘజీవులతో పోల్చినప్పుడు చాలా విభిన్నంగా ఉంటాయని నిర్ధారించారు. ఈ పరిశోధనలో ఒంటరిగా జీవించడానికి అలవాటు పడిన వారి మెదడు పనితీరు చాలా విభిన్నంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా సమాజంలో తమకు ఎదురయ్యే ఆపదల పట్ల చాలా అప్రమత్తంగా ఉండేలా వారి మెదడు ట్యూన్ చేయబడి ఉంటుందని తెలిపారు. ఒంటరివారి ఆలోచనలు 'స్వీయ రక్షణ' అనే అంశానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు గుర్తించారు. నిజంగానే తమకు ఏ విధమైన హాని లేకపోయినప్పటికీ స్వీయ రక్షణకు ఒంటరి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కుటుంబాలతో గడిపే వారు ఇవ్వరని నిర్థారించారు. పరిశోధనలో భాగంగా 'బిలాంగ్', 'పార్టీ', 'ఎలోన్', 'జాయ్' అనే పదాలను విన్పించినప్పుడు మిగతావారితో పోల్చితే ఒంటరివారిలో విపరీతమైన ప్రతిస్పందనలు గమనించినట్లు గుర్తించారు. అయితే ఈ స్పందనలు వారికి తెలియకుండానే అసంకల్పితంగా వెలిబుచ్చారని తెలిపారు. సమాజంపై గల ప్రతికూల ఆలోచనల ఫలితంగానే వారి మెదడు ఇలా ట్యూన్ చేయబడుతుందని అందుకే ఇలాంటి స్సందనలు గమనించినట్లు శాస్త్రవేత్తలు కార్టెక్స్ జర్నల్‌లో తమ ఫలితాలను ప్రచురించారు. పరిశోధనలో తేలిన మరో విషయం ఏమిటంటే.. ఒంటరితనం అనేది మనసులో తాము వేరు చేయబడ్డామని ఏర్పరుచుకునే ఒక భావన. కొందరు ఎంతో మంది స్నేహితులు, బంధువులను కలిగి ఉన్నప్పటికీ తాము ఒంటరివారిమనే భావనలోనే ఉంటారని తెలిపారు. -
టీయూ ను సందర్శించిన చికాగో బృందం
తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్): నిజామాబాద్ డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ప్రెసిడెంట్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి సోమవారం సందర్శించారు. టీయూ వీసీ పార్ధసారధితో సమావేశమైన వారు అనంతరం, యూనివర్సిటీలో కలియ తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.