Chicken Recipes
-
పల్లిపలయం చికెన్ ఫ్రై టేస్టీటేస్టీగా..
పల్లి పలయం చికెన్ ఫ్రై తయారీకి కావాల్సినవి చికెన్ ముక్కలు – అరకేజీ సాంబారు ఉల్లిపాయలు (చిన్నవి) – పది వెల్లుల్లి రెబ్బలు – పది నూనె – రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 12 పసుపు – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి) కరివేపాకు – ఐదు రెమ్మలు కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను తయారీ విధానం ఇలా.. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి తొక్కతీసి ముక్కలుగా తరిగి పేస్టుచేసి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి. కాగిన నూనెలో ఎండుమిర్చిని చిన్నముక్కలుగా చేసి వేయాలి. మిర్చి వేగాక, ఉల్లి, వెల్లుల్లి పేస్టుని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు చికెన్, పసుపు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పువేసి తిప్పాలి. ఐదు నిమిషాల తరువాత కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. మూతపెట్టి సన్నని మంట మీద చికెన్‌లో వచ్చిన నీరంతా ఇగిరి పోయే వరకు ఉడికించాలి. దాదాపు అరగంట తరువాత చికెన్ ముక్కలు చక్కగా వేడివేడిగా వేగుతాయి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేస్తే పల్లిపలయం చికెన్ ఫ్రై రెడీ. -
Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ తయారీ ఇలా!
చికెన్ స్ట్రిప్స్ ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి! చికెన్ స్ట్రిప్స్ తయారీకి కావలసినవి: ►స్కిన్, బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్ – కేజీ (పొడవాటి ముక్కలుగా తరగాలి) ►చీజ్ తురుము – కప్పు ►బ్రెడ్ ముక్కల పొడి – కప్పు ►కొత్తిమీర తరుగు – పావు కప్పు ►మైదా – కప్పు ►మిరియాల పొడి – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►గుడ్లు – మూడు ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. చికెన్ స్ట్రిప్స్ తయారీ విధానం ►ఒక గిన్నెలో చీజ్, బ్రెడ్ ముక్కల పొడి, కొత్తిమీర తరుగు వేసి చక్కగా కలిపి పెట్టుకోవాలి. ►మరో గిన్నెలో గుడ్లను పగులగొట్టి సొనను బీట్ చేసి పెట్టుకోవాలి. ►మరో గిన్నె తీసుకుని మిరియాలపొడి, మైదా, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి పెట్టుకోవాలి. ►ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్‌ను ముందుగా గుడ్లసొనలో ముంచాలి. ►తరువాత మైదా మిశ్రమంలో ముంచాలి. మైదాలో ముంచి మరోసారి గుడ్లసొనలో ముంచాలి. ►చివరిగా చీజ్ మిశ్రమంలో ముంచి డీప్‌ఫ్రై చేయాలి. ►రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రైచేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Fish Pakodi Recipe: నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా.. ఇంట్లో ఇలా ఫిష్ పకోడి చేసుకోండి! Sweet Potato Cutlet Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్లెట్.. -
Honey Chicken: హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి
మనం నిత్యం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ రకరకాల రుచికరమైన వంటలను తయారు చేసుకొని అరగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చికెన్ అంటే చాలు లొట్టలేసుకుని లాగించేస్తారు. ఈ రోజుల్లో చిన్న నుంచి పెద్ద వరకు చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. అలాంటి వారి కోసమే హనీ చికెన్ తయారీతో మీ ముందుకు వచ్చాము. ఈ చక్కని వెరైటీ రిసిపిని ఊహించుకుంటేనే నోరూరుతుంది కదా? అయితే వెంటనే మీరు కూడా తయారు చేసుకోవాలిసిందే.... హనీ చికెన్ కావాల్సిన పదార్థాలు.. 1. కొన్నిబొన్లెస్ చికెన్ ముక్కలు 2. అవసరాన్ని బట్టి ఉప్పు 3. తేనె తగినంత 4. వెన్న కావలసినంత 5.తగినంత నిమ్మ రసం 6. సోయా సాస్ తగినంత ఇప్పుడు తయారీ విధానం... ముందుగా చికెన్ ను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత స్టౌవ్ మీద ఒక దళసరి పాన్ని పెట్టుకోని నూనె వేసుకోవాలి. నూనె తగినంత వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను వేసి 4-5 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీడియం మంట మీద ఇంకో పాన్ని తీసుకోండి. దానిలో కొద్దిగా వెన్న, తేనె వేసుకోవాలి. వెన్న అనేది పూర్తిగా కరిగిన తరువాత మంటను ఆపేయండి. ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నిమ్మ రసం, ఉప్పు తగినంత వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తరువాత ఈ తేనె మిశ్రమం లో ఫ్రై చేసిన చికిన్ ముక్కలను వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. అవసరం బట్టి షెజ్వాన్ సాస్ కూడా ఊపయోగించ వచ్చు. ఆ తరువాత స్టౌ మీద నుంచి కూరను దింపేయాలి. అంతే వేడి వేడిగా హనీ చికెన్ రెడీ. చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ -
కోడి పకోడి.. నోరూరించేలా!
నిన్నమొన్నటి దాకా ఎండలు మండిపోయాయి. దాంతో వేపుడు కూరలు, కరకరలాడించే శ్నాక్స్ను దూరం పెట్టిన వాళ్లకు కూడా ఇప్పుడు ముసురు పట్టిన వాతావరణానికి సుయ్యి సుయ్యిమని చేసుకు తినే రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు తినాలనిపిస్తుంది. ఇంకెందుకాలస్యం... ముసురుకు మూకుడు పెట్టండి మరి! కోడి పకోడి కావలసినవి: బోన్‌లెస్ చికెన్ ముక్కలు–కేజి, శనగపిండి–150 గ్రాములు, బియ్యంపిండి–ఐదు టేబుల్ స్పూన్లు, కారం– టీస్పూను, ఎరుపురంగు ఫుడ్ కలర్ – చిటికడు, గరం మసాల– టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, అల్లం – అంగుళం ముక్క, నిమ్మకాయ– ఒకటి, నువ్వుల నూనె– డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు– రుచికి తగినంత. తయారీ: ► ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కను పేస్టులా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో పచ్చిమిర్చి, అల్లంపేస్టు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పువేసి ముక్కలకు పట్టేలా కలుపుకొని గంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి. ► శనగపిండి, బియ్యంపిండి, కారం, ఫుడ్ కలర్, గరం మసాల, మ్యారినేట్ చేసిపెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పువేయాలి. ► స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి. సలసల కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసి సన్నని మంటమీద వేగనివ్వాలి. ► ముక్కలు ఎర్రగా క్రిస్పీగా మారితే చికెన్ పకోడి రెడీ అయినట్లే. వీకెండ్స్‌లో ఈవినింగ్ స్నాక్స్‌గా ఈ కోడిపకోడి ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ పాప్‌కార్న్ కావలసినవి: బోన్ లెస్ చికెన్ ముక్కలు– కేజి; ఆయిల్: డీప్‌ఫ్రైకి సరిపడా , ఉప్పు: రుచికి సరిపడా. మ్యారినేషన్ కోసం... టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ పసుపు, టీస్పూను మిరియాలపొడి, వెల్లుల్లి తరుగు: రెండు టేబుల్ స్పూన్లు: నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు మసాలా కోటింగ్... వంద గ్రాముల బ్రెడ్ ముక్కల పొడి, టీస్పూను కారం, టీ స్పూను పసుపు, టీ స్పూను జీలకర్ర పొడి, టీస్పూను ధనియాలపొడి, టీస్పూను మిరియాల పొడి, రెండు గుడ్ల తెల్లసొన. తయారీ: ∙ చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలు, టేబుల్ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఒక గంటపాటు మ్యారినేట్ చేయాలి. ► మసాలా కోటింగ్ కోసం తీసుకున్న పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ► డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాగాక...మ్యారినేట్ అయిన చికెన్ ముక్కలను ఒక్కోటి తీసుకుని ముందుగా గుడ్ల తెల్ల సొనలో ముంచి తరువాత మసాలా కోటింగ్ మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేసి వేయించాలి. ► ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చికెన్ పాప్‌కార్న్ రెడీ అయినట్లే. వేడివేడిగా మీకిష్టమైన సాస్‌తో కలిపి తింటే చికెన్ పాప్‌కార్న్ రుచి అద్భుతంగా ఉంటుంది. క్రిస్పి బేక్డ్ చికెన్ స్ట్రిప్స్ కావలసినవి: చికెన్ స్ట్రిప్స్ – పావు కేజి, గుడ్లు– రెండు, బ్రెడ్ తరుగు – కప్పు, మైదా – అరకప్పు, బటర్ – టేబుల్‌స్పూన్, ధనియాల పొడి – టీస్పూను, జీలకర్ర పొడి– అర టీస్పూను, గరం మసాల – అరటీస్పూన్, కారం – టీస్పూను, కొత్తిమీర, పుదీనా తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తయారీ: బ్రెడ్‌ముక్కల తరుగును ఒక గిన్నెలో తీసుకుని దానిలో బటర్, పుదీనా, కొత్తిమీర తరుగు, మైదా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గుడ్ల సొనను మరోగిన్నెలో గిలకొట్టి పెట్టుకోవాలి. ► చికెన్స్ట్రిప్లను ఒకగిన్నెలో వేసి జీలకర్ర పొడి, గరం మసాల, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి చికెన్‌కు పట్టేలా బాగా కలపాలి. ► చికెన్స్ట్రిప్స్ను బ్రెడ్ ముక్కల తరుగు కలిపిన మిశ్రమంలో ముంచి తరువాత గుడ్ల సొనలో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ► డీప్ ఫ్రై అయిన చికెన్స్ట్రిప్లను పదినిమిషాలు చల్లారనిచ్చి, తరువాత అవెన్‌లో ఏడు నిమిషాలు ఉంచి తీస్తే, ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ స్ట్రిప్స్ రెడీ అయినట్లే. -
భయం లేదు... లాగించేదాం
కంటోన్మెంట్/శాలిబండ : ‘బర్డ్ ఫ్లూ భయం లేదు.. ఎప్పటిలాగే చికెన్ వంటకాల్ని లాగించేయండి’ అంటూ చికెన్ ప్రియులకు పిలుపునిస్తున్నారు..‘వెన్‌కాబ్’ జనరల్ మేనేజర్ బాలసుబ్రమణ్యం. అంతేకాదు తమ సంస్థ ఆధ్వర్యంలో చికెన్ వంటకాల్ని వండి మరీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్‌లోని సిక్రోడ్లో ‘గోల్డెన్ చికెన్ మార్కెట్’ ఆవరణలో మంగళవారం సాయంత్రం చికెన్ వంటకాల ఉచిత పంపిణీ చేపట్టారు. చికెన్ పకోడీ, చికెన్ 65, లాలీపాప్, డ్రమ్‌స్టిక్స్... ఇలా ఐదారు రకాల చికెన్ వంటకాల్ని ప్రజలకు ఉచితంగా అందజేశారు. నిర్భయంగా చికెన్ వంటకాల్ని తినాల్సిందిగా ప్రజలకు సూచించారు. ప్రజల్లో అవగాహన కోసమే... బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ విక్రయాలు అమాంతం పడిపోయాయని, ప్రస్తుతం ‘ఫ్లూ’ ప్రమాదం లేకున్నా చికెన్ అమ్మకాలు పెరగడం లేదన్నారు. ప్రజల్లో అపోహలు తొలగించి గతంలో మాదిరిగానే చికెన్‌ను ఆదరించేలా చేయడం కోసమే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్థానిక నాయకులు శ్రీనివాస్, గోల్డెన్ చికెన్ మార్కెట్ ఎండీ అన్వర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా బహదూర్‌పురా ఫతేదర్వాజా వద్ద స్నేహ ఫ్రెష్ చికెన్ కంపెనీ చైర్మన్ రాంరెడ్డి ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహించారు. శాలిబండ డివిజన్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్, ఈ కార్యక్రమంలో పాతబస్తీలోని ఫౌల్ట్రీ యజమానులు, చౌక్ చికెన్ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు బషీర్, చికెన్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు.