Best Chicken Recipes: How To Prepare Pallipalayam Chicken Fry Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Chicken Fry Recipe: పల్లిపలయం చికెన్‌ ఫ్రై టేస్టీటేస్టీగా..

Published Mon, Jun 19 2023 11:15 AM | Last Updated on Mon, Jun 19 2023 12:18 PM

Simple And Tasty Chicken Fry Recipe - Sakshi

పల్లి పలయం చికెన్‌ ఫ్రై తయారీకి కావాల్సినవి

  • చికెన్‌ ముక్కలు – అరకేజీ
  • సాంబారు ఉల్లిపాయలు (చిన్నవి) – పది
  • వెల్లుల్లి రెబ్బలు – పది
  • నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు
  • ఎండుమిర్చి – 12
  • పసుపు – టీస్పూను
  • ఉప్పు – రుచికి సరిపడా
  • పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి)
  • కరివేపాకు – ఐదు రెమ్మలు
  • కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను


తయారీ విధానం ఇలా..

  • చికెన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి తొక్కతీసి ముక్కలుగా తరిగి పేస్టుచేసి పక్కనపెట్టుకోవాలి.
  • స్టవ్‌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి. కాగిన నూనెలో ఎండుమిర్చిని చిన్నముక్కలుగా చేసి వేయాలి.
  • మిర్చి వేగాక, ఉల్లి, వెల్లుల్లి పేస్టుని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు చికెన్, పసుపు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పువేసి తిప్పాలి.
  • ఐదు నిమిషాల తరువాత కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. మూతపెట్టి సన్నని మంట మీద చికెన్‌లో వచ్చిన నీరంతా ఇగిరి పోయే వరకు ఉడికించాలి.
  • దాదాపు అరగంట తరువాత చికెన్‌ ముక్కలు చక్కగా వేడివేడిగా వేగుతాయి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేస్తే పల్లిపలయం చికెన్‌ ఫ్రై రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement