చికెన్‌కు...ప్రేమతో..!
‘ఎగిరే పావురమా’లో ‘ఆహా ఏమి రుచి’ పాట వినగానే వంకాయ గుర్తొచ్చి నోరూరిపోతుంది. అలాంటి వంటకాల పాటల బాణీలో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఇప్పుడు చికెన్ పాటకు కాలు కదపనున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలోని ‘భజరంగీ భాయ్‌జాన్’ కోసం చికెన్ మీద పాటను రికార్డ్ చేయనున్నారు. అందుకే ఒరిజినల్ శబ్దాలను రికార్డ్ చేయాలన్న ఉద్దేశంతో స్విస్‌కు చెందిన ఇద్దరు స్వరకర్తలను సంప్రతించారట ఈ చిత్ర సంగీత దర్శకుడు ప్రీతమ్. సల్మాన్‌కు చికెన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పాటలో ఆయన తన ప్రతిభకు ప్రేమను జత చేసి ఉంటారని చెప్పనక్కరలేదు.