Chidambaram temple
-
‘చిదంబర’ రహస్యం
►నటరాజస్వామి స్వయంగా రాసిన తాళపత్రాలపై చర్చ ►పుదుచ్చేరి మఠం నుంచి స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి పట్టు ►విచారణ జరిపిస్తామని దేవాదాయ మంత్రి సేవూరు రాజేంద్రన్ వెల్లడి చెన్నై: దేవుడు ఉన్నాడు అంటారు ఎందరో, లేడు అంటారు మరికొందరు. ఉంటే బాగుండేదని బాధపడుతుంటారు కొంతమంది. అయితే ప్రస్తుత చర్చనీయాంశంగా మారిన విషయం వీటన్నింటి కంటే ఒక అడుగు మించింది. చిదంబరం నటరాజస్వామి స్వయంగా రాసినట్లుగా భావిస్తున్న తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయి, పుదుచ్చేరి పీఠంలో ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజమేనా, స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా అనే అంశాలు చిదంబర రహస్యంగా మారాయి. చిదంబరం నటరాజస్వామి ఆలయానికి మనిషి రూపంలో దేవదేవుడే వచ్చి తాళపత్రాలలో తిరువాచక గీతాలను రాసి ఆలయానికి అప్పగించారని భక్తుల విశ్వాసం. ఈ తాళపత్రాలు ప్రస్తుతం పుదుచ్చేరిలోని అంబలత్తాడి మఠంలో ఉన్నట్లు సమాచారం. ఆ తాళపత్రాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో కొత్త చర్చ బయలుదేరింది. ఈ చర్చను లేవనెత్తింది వేరెవరో కాదు తమిళనాడు ప్రభుత్వ దేవదాయ, ధర్మాదాయశాఖ మాజీ మంత్రి వీవీ స్వామినాథన్. నటరాజ పెరుమాళ్ స్వయంగా రాసిన ఆ తాళపత్రాలు చిదంబరం ఆలయ సొత్తు కావడంతో దానిని స్వాధీనం చేసుకోవాలంటూ ఆలయ నిర్వాహకులకు, కడలూరు జిల్లా కలెక్టర్, దేవదాయశాఖ, విగ్రహాల అక్రమరవాణా నిరోధక శాఖ, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు స్వామినాథన్ ఇటీవల లేఖ రాశారు. ఈ ఉత్తరంపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్ కిరణ్‌బేడీ పోలీస్‌శాఖను ఆదేశించారు. పురాణం ఏమీ చెబుతోందంటే.. శివ క్షేత్రాలను దర్శించుకుంటూ చిదంబరం నటరాజస్వామి ఆలయానికి వచ్చిన మాణిక్యవాచకర్ అనే మహాభక్తుడు అక్కడి శివుడిని దర్శించుకున్న తరువాత అదే ఊరిలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ నివాసానికి ఒక వృద్ధుడు వచ్చి శివపెరుమాళ్ ఆజ్ఞతో తాను ఇక్కడికి చేరుకున్నానని పరిచయం చేసుకుని మాణిక్యవాసగర్ భక్తిని మెచ్చుకున్నాడు. వృద్ధుని కోర్కె మేరకు శివపెరుమాళ్ గురించి మాణిక్యవాసగర్ భక్తి పాటలు ఆలపించాడు. ఆయన ఆలపించిన 400 గీతాలను వృద్ధుడు తాటాకు పత్రాలపై రాసి తనతోపాటు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఆలయాన్ని తెరిచిన అర్చకుడు అక్కడి మెట్లపై ఉన్న తాళపత్రాలను చూసి ఊరిపెద్దలకు సమాచారం ఇచ్చాడు. ఆ తాళపత్రాల్లో తిరువాసగ శ్లోకాలు, తిరుక్కోవయార్ రచించిన 400 శ్లోకాలు కూడా చోటుచేసుకున్నాయి. ఊరిపెద్దలంతా కలిసి తిరువాచగర్ను ఆలయానికి పిలిపించగా తాళపత్రాల్లోని పాటలను ఆలపించాడు. నా గీతాల్లోని భావాలకు మూలకర్త నట రాజస్వామినే అని చెబుతూ స్వామి వారిలో మాణిక్యవాచగర్ ఐక్యమైపోయాడు. నటరాజర్ స్వయంగా రాసినట్లు భావిస్తున్న సదరు తాళపత్రాలు ప్రస్తుతం పుదుచ్చేరి అంబలతావడి మఠం స్వాధీనంలో ఉన్నట్లు సమాచారం. మాణిక్యవాచగర్ పాడుతుండగా సాక్షాత్తు నటరాజస్వామినే తాళపత్రాల్లో రాశాడని మాజీ మంత్రి స్వామినాథన్ అంటున్నారు. చిదంబరంలోని ఆరుముగనావలర్ స్కూల్లో ఈ తాళపత్రాలను ప్రదర్శనగా ఉంచినపుడు తాను చూసి ఉన్నానని చెప్పారు. ఈ తాళపత్రాలను తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్వాధీ నం చేసుకుని తగిన భద్రతతో భక్తుల సందర్శనకు ఉంచాలని ఆయన కో రారు. అంబలత్తాడి మఠంలో నట రాజ స్వామి పాదాలకు సమీపంలో సుమారు ఒకటిన్నర అడుగు వెడల్పు, ఒక అడుగు ఎత్తు ఉన్న వెండి పీట ఉంది. ఈ పీటలోనే తాళపత్రాలు ఉన్నట్లుగా అంబలత్తాడి మఠం 33వ మఠాధిపతి కనకసభాపతి స్వామి చెబుతున్నారు. పూర్తిగా సీల్ వేసినట్లుగా ఉన్న పీటను ఏ కారణం చేత కూడా విప్పిచూడడం, పరిశోధన చేయడమో కూడదని తమ పూర్వీకులు సూచించినట్లు స్వామి తెలి పారు. మాస శివరాత్రి రోజుల్లో రాత్రి 11 గంటల సమయంలో వెండి పీటను కేవలం ఒక గంటపాటు భక్తుల సందర్శనార్థం ఉంచుతున్నామని స్వామి చెప్పారు. 350 ఏళ్ల కిత్రం జరిగిన కర్ణాటక యుద్ధం సమయంలో చిదంబరం మఠంలోని నటరాజస్వామి విగ్రహం, తాళపత్రాలు వస్తువులను పుదుచ్చేరి మఠంలో భద్రపరిచినట్లు స్థలపురాణంలో పేర్కొన్నారు. పుదుచ్చేరి మఠంలోని తాళపత్రాలు మాణిక్యవాసగర్ కాలం నాటివేనని అక్కడి అర్చకులు అంగీకరిస్తున్నారు. ఈ తాళపత్రాల నకళ్లు మయిలాడుదురై, చిదంబరం ఆలయాల్లో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. తాళపత్రాల వ్యవహారంపై చిదంబరం ఆలయ దీక్షితులు ఉమానా«థ్ మాట్లాడుతూ నటరాజస్వామి స్వయంగా రాసినట్టు చెపుతున్న తాళపత్రాలు తమ ఆలయానికి చెంది నవి అని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవు, అందుకే ఆలయ నిర్వాహకులు వాటిని స్వాధీనం చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని అన్నారు. విచారణ జరిపిస్తాం తాళపత్రాల విషయం ఇటీవల తన దృష్టికి వచ్చిందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖా మంత్రి సేవూరు రామచంద్రన్ ఇటీవల మీడియాతో అన్నారు. తాళపత్రాలు నటరాజస్వామి ఆలయానికి చెందినవి అనే వాదనపై అధికారుల పూర్తిస్తాయి విచారణ జరిపిస్తానని అన్నారు. విచారణపై నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు....సేవూరు రామచంద్రన్ -
‘చిదంబర’ రహస్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘ఆ పార్టీ చేసిన ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకించడమే సిద్ధాంతం’ అనే రాజకీయసూక్తిని అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలూ అవకాశం చిక్కినపుడల్లా అమలుచేస్తూనే ఉంటాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయ నిర్వహణపై సర్వహక్కులు వంశపారంపర్య దీక్షితులదేనంటూ సుప్రీం కోర్టు తీర్పు, కేసు వ్యవహారంలో అధికారపార్టీ వైఖరి ఆయా పార్టీల సిద్ధాంతాన్ని మరోమారు గుర్తుచేసింది. ఆలయంలో అనాదిగా దేవారం భక్తిగీతాలు పాడే కడలూరు జిల్లా కుముడిమూలై గ్రామానికి చెందిన శివనడియార్ ఆరుముగస్వామి(90)కి ఆలయ ప్రధాన అర్చకులకు మధ్య రేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో అప్పటి డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుని ట్రస్టీలను ఏర్పాటుచేసి దేవాదాయ కమిషనర్‌ను నియమించిం ది. ప్రభుత్వ జోక్యం సరికాదంటూ వంశపారంపర్య ప్రధాన అర్చకులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో అర్చకులు సుప్రీంకోర్టుకెళ్లారు. ఈ పోరాట దశలోనే డీఎం కే స్థానంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. డీఎంకే హయాం నుంచి నడుస్తున్న కేసు కావడంతో అన్నాడీఎంకే పెద్దగా ఆసక్తిచూపలేదు. ఈ క్రమంలో ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చేసుకోరాదంటూ సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టం చేశారు. ప్రజాకోర్టులో తేల్చుకుంటాం: చిదంబరం ఆల యంపై ప్రజాకోర్టులో తేల్చుకుంటామని మాన వ హక్కుల కేంద్రం (చెన్నై) కన్వీనర్ ఎస్ జిమ్రాజ్ మిల్టన్ తెలిపారు. పలు భాషా సంఘాల ప్రతినిధులతో చెన్నై కొత్త సచివాలయం నుంచి సోమవారం ర్యాలీ చేశారు. అనంతరం పెరియార్ విగ్రహం ముందు ధర్నా చేసి, బీజేపీ అగ్రనేత సుబ్రమణ్యస్వామి చిత్రాలను తగులబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 40 ఎకరాల విస్తీర్ణంలోని ఆలయం, 27 ఎకరాల స్థలం, కొన్ని కోట్లరూపాయల విలువైన ఆలయ ఆభరణాలు అర్చకుల పరమైపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కేసు గెలవాలనే దిశగా సీఎం జయలలిత ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని, పైగా దీక్షితులకు అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. కరుణ ఖండన: చిదంబరం కేసు సమయంలో సీఎంగా ఉండిన డీఎంకే అధినేత కరుణానిధి ఘాటుగా స్పందించారు. 1987లో ఎంజీఆర్ సీఎంగా, ఆర్ఎం వీరప్పన్ దేవాదాయ మం త్రిగా ఉన్నపుడే ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీ నం చేసుకుందన్నారు. దీక్షితులు ఆరోజుల్లోనే కోర్టుకెళ్లారని చెప్పారు. ప్రభుత్వ చర్య సమర్థనీయమంటూ 2009లో హైకోర్టు తీర్పు చెప్పిం దని గుర్తు చేశారు. ప్రధాన అర్చకులు లేదా వారి పూర్వీకులు ఆలయాన్ని నిర్మించలేదని తాము రుజువుచేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం చొరవ చేసుకోనందునే సుప్రీం తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దీక్షితులకు అనుకూలంగా వచ్చిందని ఆయన ఆరోపించారు. -
‘చిదంబరం’ దీక్షితులదే!
చె న్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం తగదని పేర్కొంటూ వంశపారపర్య దీక్షితులకే నిర్వహణా బాధ్యతను అప్పగిస్తూ సోమవారం సుప్రీం కోర్టు సోమవారం తీర్పుచెప్పింది. దీంతో సుమారు 15 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కడలూరు జిల్లా కుముడిమూలై గ్రామానికి చెందిన శివనడియార్ ఆరుముగస్వామి (90)కి చిదంబరం ఆలయంలో దేవారం(సంప్రదాయ భక్తిగీతాలు) పాడటం అలవాటు. దేవారం పాడేందుకు వెళ్లిన ఆర్ముగంపై 2000లో ప్రధాన అర్చకులు దాడిచేసి తరిమేశారు. ఆరుముగానికి జరిగిన అవమానంపై తమిళ భాషాభిమానులు, పీఎంకే పార్టీ నాయకులు కలిసి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. పోరాటాలు సాగించి ప్రభుత్వానికి విజ్ఞప్తులు సమర్పించారు. 2008లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఆలయంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి ఆరుముగం చేత దేవారం పాడించింది. ప్రభుత్వ చర్యకు తీవ్రమనస్థాపంతో అర్చకులు నిరసనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆలయాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుని నిర్వహణ బాధ్యతను ట్రస్టీలకు అప్పగించి కమిషనర్‌ను నియమించింది. ఆలయాన్ని ప్రభుత్వ స్వాధీనం నుంచి తప్పించాలని కోరుతూ వంశపారంపర్య ప్రధాన అర్చకులు, దీక్షితులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఇంతలో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వంపోయి అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో ప్రభుత్వ తరపున న్యాయవాది నియమితులు కాలేదు. ప్రభుత్వం అర్చకులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే సీనియర్ న్యాయవాదిని నియమించాలని, అర్చకులకు అనుగుణంగా వ్యవహరించరాదని ఆరుముగస్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయవాదిని నియమించకుంటే ప్రాణాలు పోయేంతవరకు ఆలయంలో దేవారం పాడుతానని గత ఏడాది నవంబరు 2వ తేదీన ఆయన హెచ్చరించారు. కేసు వ్యవహారం ఉద్రిక్తంగా మారడంతో విచారణను వేగవంతం చేసిన సుప్రీం కోర్టు సోమవారం తీర్పుచెప్పింది. ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చేసుకోరాదంటూ న్యాయమూర్తులు పీఎస్ సవుఖాన్, ఎస్ఏ పాప్టేలు స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన వెంకటేశదీక్షిత్ తదితరులు బాణాసంచా కాల్చి భక్తులకు మిఠారుులు పంచిపెట్టారు. ప్రభుత్వం గట్టిగా తనవాదనను వినిపించనందునే కేసు ఓడిపోయామని ఆరుముగ స్వామితోపాటు తమిళ భాషాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.