Chief guests
-
గణతంత్ర దినోత్సవం; అలా ఇది నాలుగోసారి!
లాస్ట్ మినిట్‌లో ‘అయామ్ సారీ’ అనేశారు బోరిస్ జాన్సన్. బ్రిటన్ ప్రధాని ఆయన. ముందనుకున్నట్లుగా నేటి మన గణతంత్ర దినోత్సవానికి జాన్సన్ రావడం లేదు. వచ్చే పరిస్థితి లేదు. బ్రిటన్‌లో కరోనా ‘రెండో రూపం’ దాల్చింది. అందుకే సెంట్రల్ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్న వాళ్ల ప్రధాని పాలనా భవనం ఇండియాకు ‘సారీ’ నోట్ పంపించింది. డిసెంబర్లోనే ఆయన కు ఆహ్వానం పంపాం. ఓకే కూడా అన్నారు. జనవరి కంతా సీన్ మారి పోయింది. 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే అతిథి లేకుండా మన రిపబ్లిక్ పరేడ్ జరగబోవడం. ఇంకో అతిథిని పిలవొచ్చు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. ఈరోజు జరుగుతున్నది 72 వ గణతంత్ర దినోత్సవం. ఇండియా ఆవిర్భవించాక ఇంతవరకు మూడుసార్లు మాత్రమే ముఖ్య అతిథి లేకుండా రిపబ్లిక్ డే జరిగింది. నేటి పరేడ్ కూడా పూర్తిగా ఇక మన ఇంటి కార్యక్రమం. మనలో మన మాట... అతిథి లేకపోతేనేం! ఈ కార్యక్రమాన్ని నేరుగా సందర్శించే వారు, టీవీలలో వీక్షించే వారు అందరూ అతిథులే ఈసారికి! రిపబ్లిక్ పరేడ్‌లో ప్రధాని ఇందిరాగాంధీ (1967) అతిథి లేని రిపబ్లిక్ ‘డే’లు మూడంటే మూడేసార్లు 1952లో, 1953లో, 1966లో అతిథి లేకుండా మన రిపబ్లిక్ డే పరేడ్లు జరిగాయి. 1966లో అతిథి లేకపోవడమూ, రాకపోవడమూ కాదు. రాజకీయంగా మనం కొంచెం అస్థిమితంగా ఉన్నాం. ఇండో–పాక్ యుద్ధాన్ని ముగింపునకు తెచ్చేందుకు శాంతి ఒప్పందం విషయమై రష్యాలోని తాష్కెంట్‌కు వెళ్లిన అప్పటి మన ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి ఒప్పందంపై సంతకాలు అయిన రెండో రోజే 1966 జనవరి 11న హటాత్తుగా మరణించారు. ప్రధాని లేకుండా ఒక్క రోజైనా దేశం ఉండకూడదు. అదే రోజు గుల్జారీలాల్ నందా దేశ ప్రధాని అయ్యారు. జనవరి 24 వరకు ప్రధానిగా ఉన్నారు. జనవరి 24న ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇక రిపబ్లిక్ డేకి ఉత్సవాలకు ఉన్న సమయం 48 గంటలు. అతిథిని పిలవలేకపోయాం. ఆ ముందు కూడా 1952, 1953 లలో ఎవర్నీ ఆహ్వానించలేదు. అందుకు ప్రత్యేక కారణం అంటూ లేదు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో) అసలు అతిథి ఎందుకు? ఇది మరీ బాగుంది. అతిథి వస్తే ఆ కళే వేరుగా ఉండదా! మన మిలటరీని చూపించుకోవచ్చు. మన ప్రజల్ని, మన సంప్రదాయాల్ని, మనం ఇచ్చే గౌరవ మర్యాదల్ని అతిథికి చూపించవచ్చు. ఇవన్నీ పైపైన. రాజనీతి వ్యూహాలు కొన్ని ఉంటాయి. బ్రిటన్ ప్రధానినే ఈసారి ఎందుకు ఆహ్వానించామంటారు? కారణం ఉంది. బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుంచి అధికారికంగా బయటికి వచ్చేసి ఉంది. ఇండియా ఆర్.సి.ఇ.పి. (రీజనల్ కాంప్రెహె న్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్) లోకి వెళ్లేందుకు సంశయిస్తోంది. ఆర్.సి.ఇ.పి. మీద ఇప్పటికే ఆసియాదేశాలు చాలావరకు సంతకాలు చేసేశాయి. బ్రిటన్‌కి, ఇండియాకు గ్రూప్‌లో ఒకరిగా ఉండటం ఇష్టం లేదు. అందుకే బ్రిటన్ బయటికి వచ్చేస్తే, ఇండియా లోపలికి వెళ్లడం లేదు. ఈ సమయంలో లండన్, ఢిల్లీ ఒకటిగా ఉంటే.. వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఏ ప్రయోజనాలైతే కలిసి సాధిస్తామని ఆ గ్రూపులు అంటున్నాయో వాటినే ఈ రెండు దేశాలూ కలిసి వేరుగా సాధించుకోవచ్చు. అందుకు ఒక సోపానం గౌరవ ఆతిథ్యం కూడా. తొలి అతిథి సుకర్నోతో ప్రధాని నెహ్రూ తొలి అతిథి సుకర్ణో 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చింది. రెండున్నరేళ్లకు 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న తేదీ జనవరి 26. అదే రిపబ్లిక్ డే. అదే గణతంత్ర దినం. ఆ ఏడాది మన గెస్టు.. స్వతంత్ర భారత గణతంత్ర ఉత్సవానికి తొలి ముఖ్య అతిథి.. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో. అప్పుడు మన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. మన తొలి రిపబ్లిక్ డేకి సుకర్ణోను ఆహ్వానించడానికి తగిన కారణమే ఉంది. మనకు 47లో స్వాతంత్య్రం వస్తే, వాళ్లకు 45లో వచ్చింది. ఇంచుమించు అదే సమయంలో ఆసియా, ఆఫ్రికాల్లోని దేశాలు సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి పొందిన తొలినాళ్ల నడకలో ఉన్నాయి. అవన్నీ.. మన ఇండియా సహా.. లోలోపల ఒక స్నేహ వలయంలా ఏర్పడ్డాయి. ఆ స్నేహంతోనే మనం సుకర్ణోను ఆహ్వానించాం. తొలి రిపబ్లిక్ పరేడ్ (1950) తొలి పరేడ్ రాజ్‌పథ్‌లోనే! తొలి రిపబ్లిక్ వేడుకలు (1950) కూడా ఇప్పుడు జరుగుతున్నట్లే రాజ్‌పథ్‌లోనే జరిగాయి. ఆ ఏడాది రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఓపెన్ టాప్ గుర్రాల బగ్గీలో కూర్చొని రాష్ట్రపతి భవన్ నుంచి పరేడ్ గ్రౌడ్స్కి బయల్దేరారు. పరేడ్ ను చూడ్డానికి వచ్చిన వారందరికీ ప్రభుత్వం స్వీట్లు పంచిపెట్టింది. తర్వాతి పరేడ్లు వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఎర్రకోటలో ఒకసారి, ఇర్విన్ స్టేడియంలో ఒకసారి, రామ్‌లీలా మైదానంలో ఒకసారి.. ఇలా. 1955 నుంచి మాత్రం రాజ్‌పథ్‌లోనే రిపబ్లిక్ డేను నిర్వహిస్తున్నారు. -
గణతంత్ర దినోత్సవ అతిథిలు.. వీరే!?
మనీలా : దూకుడు మీదున్న చైనాకు ముకుతాడు వేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ ఊహించని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చుట్టూ ఉండే.. 10 ఆసియాన్దేశాధి నేతలను 2018 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావాలని ఆహ్వానించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో చేసే సైనిక, విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలను ప్రత్యేకంగా తిలకించాలని ఆసియాన్ నేతలను మోదీ ప్రత్యేకంగా కోరారు. మనీలాలో జరిగిన 15న ఆసియా సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆసియాన్ దేశాల శాంతియుత అభివృద్ధికి, ప్రాంతీయ రక్షణకు, నిబంధనల ఆధారంగా పనిచేసేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 25న న్యూఢిల్లీలో జరిగే ఆసియాన్ ప్రత్యేక సదస్సులో మన బంధం మరింత ధృఢపడాలని మోదీ ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారతదేశ 69వ గణతంత్ర దినోత్సవాలకు 125 కోట్ల భారతీయులు ఆసియాన్ అధినేతలకు స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంచేయాలని మోదీ పిలుపునిచ్చారు. అసియాన్ అధినేతలంతా రిపబ్లిక్ డే ఉత్సవాలకు రానున్న నేపథ్యంలో భారీగా ద్వైపాక్షిక, మిలటరీ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. 2015 రిపబ్లిక్ డే ఉత్సవాలకు అప్పటి అమెరకా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రాన్ష అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండో, 2017లో యూఏఈ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జియాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2018ల గణతంత్ర దినోత్సవాలకు ఆసియాన్ దేశాలైన ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, వియాత్నాం దేశాధినేతలు హాజరుకానున్నారు. -
ముఖ్య అతిధులుగా పవన్,మహేష్
-
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన నిర్వహించనున్నారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత రెండోసారి సర్వసభ్య సమావేశం జరగనుంది. గతంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సభ వాడివేడిగా జరిగింది. గతంతో పోల్చితే ప్ర స్తుత పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నా యి. ప్రధానంగా జిల్లాలో వైద్యా, ఆరోగ్య శాఖ పనితీరుతోపాటు తాగునీటి తదితర సౌకర్యాల కల్పన, పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఈజీఎస్, ఐకేపీ శాఖలను ఎజెండాలో అంశాలుగా పొందుపర్చారు. వీటిపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే రాష్ర్ట రోడ్లు భవనాలు, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఆయా శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో అధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నప్పటికీ ముందురోజే మంత్రి హోదాలో జిల్లాలోని పలు సమస్యలపై తుమ్మల వివరణ ఇచ్చారు. వచ్చే పర్యటనలోగా అధికారులు తీరు మార్చుకోవాలని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఈ సర్వసభ్య సమావేశంలో పెద్దగా చర్చజరిపే అవకాశాలు కనిపించడం లేదు. గత సమావేశంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రైతులకు రుణ మాఫీ రూ. లక్ష వరకు వర్తింప జేయాలని, ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ చేయాలని తీర్మానించారు. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉపాధిహామీ పై సమావేశంలో కొంతమేర చర్చజరిగే అవకాశం ఉంది. 30న ప్రత్యేక సమావేశం వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై ఈ నెల 30న జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన జరిగే ప్రత్యేక సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్అండ్బీ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక, విత్తనాభివృద్ధి, మత్స్య, పాడిపరిశ్రమ తదితర శాఖల పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ శాఖల్లో అమలవుతున్న పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపులపై చర్చించనున్నారు.