మనీలా : దూకుడు మీదున్న చైనాకు ముకుతాడు వేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ ఊహించని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చుట్టూ ఉండే.. 10 ఆసియాన్‌దేశాధి నేతలను 2018 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావాలని ఆహ్వానించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో చేసే సైనిక, విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలను ప్రత్యేకంగా తిలకించాలని ఆసియాన్ నేతలను మోదీ ప్రత్యేకంగా కోరారు.
మనీలాలో జరిగిన 15న ఆసియా సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆసియాన్ దేశాల శాంతియుత అభివృద్ధికి, ప్రాంతీయ రక్షణకు, నిబంధనల ఆధారంగా పనిచేసేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 25న న్యూఢిల్లీలో జరిగే ఆసియాన్ ప్రత్యేక సదస్సులో మన బంధం మరింత ధృఢపడాలని మోదీ ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారతదేశ 69వ గణతంత్ర దినోత్సవాలకు 125 కోట్ల భారతీయులు ఆసియాన్ అధినేతలకు స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంచేయాలని మోదీ పిలుపునిచ్చారు. అసియాన్ అధినేతలంతా రిపబ్లిక్ డే ఉత్సవాలకు రానున్న నేపథ్యంలో భారీగా ద్వైపాక్షిక, మిలటరీ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.
2015 రిపబ్లిక్ డే ఉత్సవాలకు అప్పటి అమెరకా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రాన్ష అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండో, 2017లో యూఏఈ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జియాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2018ల గణతంత్ర దినోత్సవాలకు ఆసియాన్ దేశాలైన ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, వియాత్నాం దేశాధినేతలు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment