chief minister narendra modi
-
మోదీపై పుస్తకం రాయాలనుంది: ఉమ
భోపాల్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పుస్తకం రాయాలని ఉందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి తెలిపారు. మోదీ వ్యక్తిత్వం, దేశంలోని ప్రతి సమస్యపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆదివారమిక్కడ విలేకర్లతో అన్నారు. తాను కేంద్ర మంత్రి కాకముందు మోదీ గురించి పూర్తిగా తెలియదన్నారు. కానీ ఇప్పుడు తరచుగా మోదీతో మాట్లాడ డం వల్ల ఆయన విజ్ఞానం, సమస్యలపై ఉన్న లోతైన అవగాహన తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. మోదీ అభివృద్ధి ఎజెండాకు కాంగ్రెస్ పార్టీ సమస్యగా మారిందని ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో ఉమ.. మోదీని పొగుడుతూ మొత్తం 23 సార్లు ఆయన పేరు పలకగా, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. -
కెనడా పర్యటన చరిత్రాత్మకం
హిందూత్వం ఒక మతం కాదు.. జీవన విధానం వాంకోవర్‌లో మోదీ వ్యాఖ్యలు; ముగిసిన మూడుదేశాల టూర్ వాంకోవర్/న్యూఢిల్లీ: కెనడాలో తన పర్యటన చరిత్రాత్మకమైనదని భారత ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ఈ పర్యటనతో ద్వెపాక్షిక సహకారంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ‘ఒక పర్యటన ప్రాముఖ్యత అది ఎంతకాలం సాగిందనేదానిపై కాకుండా అది సాధించిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటన చరిత్రాత్మకం. 42 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కెనడా పర్యటనకు వచ్చినందుకు కాదు.. 42 ఏళ్ల తరువాత ఇరుదేశాల మధ్య నెలకొన్న దూరం ఒక్క క్షణంలో మాయమైనందుకు ఈ పర్యటన చరిత్రాత్మకం’ అని పేర్కొరు. భారత్ బయల్దేరే ముందు శుక్రవారం కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ తన గౌరవార్ధం ఇచ్చిన విందులో మోదీ పాల్గొన్నారు. కొన్నాళ్లుగా సరిగాలేని రెండు దేశాల సంబంధాలు మళ్లీ సరైన గాడిలో పడినందువల్ల తన పర్యటన విజయవంతమైందని భావిస్తున్నానన్నారు. ‘ఇరుదేశాల మధ్య ఇన్నాళ్లూ ఉన్న అడ్డుగోడ ఇప్పుడు సత్సంబంధాల వారధిలా మారింది’ అని అన్నారు. కీలకమైన రెండు ఒప్పందాలను.. ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక పరిరక్షక ఒప్పందం, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం త్వరలోనే కొలిక్కి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో కలసిరావడం వల్ల కెనడా కూడా ప్రయోజనం పొందుతుందని తెలిపారు. స్వామి వివేకానంద 1893లో సర్వమత సమ్మేళనంలో పాల్గొనేందుకు షికాగో వెళ్తూ మార్గమధ్యంలో వాంకోవర్‌లో ఆగిన విషయాన్ని ఇరువురు గుర్తుచేసుకున్నారు. దేవాలయాల సందర్శన: అంతకుముందు హార్పర్తో కలసి మోదీ వాంకోవర్‌లోని గురుద్వారాను, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. హిందూత్వం మతం కాదని, అది ఒక జీవన విధానమని మోదీ వ్యాఖ్యానించారు. ‘హిందూ ధర్మానికి భారత సుప్రీంకోర్టు అద్భుత నిర్వచనాన్ని ఇచ్చింది. హిందూత్వం మతం కాదని జీవన విధానమని స్పష్టం చేసింది’ అన్నారు. భారత స్వాతంత్య్ర పోరులో భగత్‌సింగ్ సహా సిక్కుల పాత్రను ప్రస్తావించారు. ముగిసిన పర్యటన: ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో ప్రధాని మోదీ 9 రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసిం ది. పెట్టుబడులు, మేక్ ఇన్ ఇండియాకు ప్రచారం, పలు ద్వైపాక్షిక అంశాల్లో సహకారం.. ప్రధాన లక్ష్యాలుగా మోదీ పర్యటన సాగింది. ఫ్రాన్స్‌తో రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, జర్మనీలో మేక్ ఇన్ ఇండియాకు లభించిన మద్దతు, యురేనియం సరఫరాకు కెనడా అంగీకారం.. మోదీ పర్యటనలో కీలక విజయాలుగా పేర్కొనవచ్చు. పీఎంవి.. ఆరెస్సెస్ ప్రచారక్వి కాదు: కాంగ్రెస్ విదేశాల్లో మోదీ వ్యతిరేక ప్రచారాన్ని తామూ ప్రారంభిస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. కెనడాలో యూపీఏ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘ఆరెస్సెస్ ప్రచారక్‌లా కాకుండా ప్రధానిలా వ్యవహరించండ’ని సలహా ఇచ్చింది. ‘ఈ సారి మోదీ విదేశాలకు వెళ్లి ఇలాగే వ్యవహరిస్తే.. మా తరఫున ఒకరు వెళ్లి వెంటనే తగిన జవాబిస్తారు’ అని పార్టీ నేత ఆనంద్ శర్మ చెప్పారు. ‘గతంలో అనుమతి లభించకపోవడంతో పర్యటించలేని దేశాలనన్నింటికీ ఇప్పుడు వెళ్తున్నారేమో’ అంటూ మోదీపై సీపీఎం నేత సీతారాం ఏచూరి చురకలేశారు. శక్తిమంతులైన నేతల సారథ్యంలో భారత్, చైనా న్యూయార్క్: శక్తిమంతులైన నేతల సారథ్యంలో భారత్, చైనాలు దూసుకువెళ్తున్నాయని ‘టైమ్’ మేగజీన్ పేర్కొంది. స్ఫూర్తిదాయక నాయకత్వంతో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చరిత్రలో తమ ముద్ర వేసేందుకు తహతహలాడుతున్నారని తాజా సంచికలోని కథనంలో వ్యాఖ్యానించింది. ‘మోదీకి ముందు మన్మోహన్ వెళ్లారు’ న్యూఢిల్లీ: గత 42 ఏళ్లలో కెనడాలో పర్యటించిన తొలి భారత ప్రధానిని తానేనని మోదీ చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధాని హోదాలో 2010 జూన్ 26 నుంచి 28 వరకు కెనడాలో మన్మోహన్సింగ్ అధికారిక పర్యటన జరిపారని గుర్తు చేసింది. కెనడా ప్రధాని హార్పర్ ఆహ్వానంపై మన్మోహన్ కెనడాలో పర్యటించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ తెలిపారు. -
బిల్లులో సవరణలకు సిద్ధం!
సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం న్యూఢిల్లీ: స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో భూసేకరణ బిల్లులో రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ పలు మార్పులకు అవకాశముందని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. భూయజమానుల్లో 70% మంది ఆమోదంతో పాటు భూసేకరణలో సామాజిక ప్రభావ అంచనాను తప్పనిసరి చేయాలన్న రైతుల డిమాండ్‌పై ప్రభుత్వం మంగళవారం విసృ్తతంగా చర్చించింది. రైతుల ఆందోళనలకు సంబంధించిన అంశాలను బిల్లులో చేర్చే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు మంత్రులు ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ‘ఈ బిల్లు విషయంలో వెనక్కుపోయే ప్రసక్తి లేదు కానీ రైతు ప్రయోజనాలకు సంబంధించిన సూచనలను స్వాగతిద్దాం’ అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ బిల్లు రైతులకు మేలు చేసేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన డిమాండ్లు, సలహాల ఆధారంగానే ఈ చట్టంలో సవరణలు పొందుపరిచామని మోదీ పార్టీ ఎంపీలతో అన్నారు. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన కోరారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సవరించాల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు, రైతు సంఘాల నాయకులతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు కొనసాగిస్తున్నారు. -
రక్షణ దిగుమతులకు స్వస్తి చెబుదాం
ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రధాని మోదీ భారత్ అతిపెద్ద దిగుమతిదారు అనే పేరు పోవాలి ఇక్కడ ఉత్పత్తిచేసేందుకు విదేశీ కంపెనీలు ముందుకురావాలి బెంగళూరు: రక్షణ రంగంలో దిగుమతులకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ రంగంలో తమ ప్రభుత్వం స్వయంవృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతం సైనిక పరికరాలను దేశంలోనే తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. విదేశీ కంపెనీలు కేవలం పరికరాలు అమ్మేందుకే పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వాములుగా మారాలని, భారత్‌లో తయారీకి ముందుకు రావాలని సూచించారు. బుధవారం బెంగళూరులో 10వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘రక్షణ పరికరాల దిగుమతుల్లో భారత్ నంబర్ వన్ అన్న పేరు చెరిగిపోవాలి. అందుకు వచ్చే ఐదేళ్లలో 70 శాతం పరికరాలు దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతున్నాం. ఇది సాకారమైతే 1.20 లక్షల నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించవచ్చు. రక్షణ రం గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాం. అవసరమైతే దీన్ని ఇంకా పెంచుతాం’’ అని చెప్పారు. పరిశోధన, అభివృద్ధి విభాగాలకు పెద్దపీట క్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీటవేస్తోందని మోదీ తెలిపారు. రక్షణ వస్తువుల అభివృద్ధికి సంబంధించి ‘ప్రోటోటైప్’ తయారీకి అవసరమైన నిధుల్లో 80 శాతం వరకు ప్రభుత్వమే అందించేలా నూతన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నామన్నారు. కొత్తగా ‘సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానంతో విదేశీ కంపెనీలు మన దేశంలో వస్తు ఉత్పత్తికి ఆసక్తి కనబరుస్తున్నాయని మోదీ తెలిపారు. ఆకట్టుకున్న ప్రదర్శన: ‘ఏరో ఇండియా-2015’లో దేశ, విదేశాలకు చెందిన దాదాపు 650 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ నెల 22 వరకు సాగే ప్రదర్శనలో కోట్లాది రూపాయల విలువ చేసే వ్యాపార ఒప్పందాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. వివిధ దేశాల అత్యాధునిక విమానాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ధ్రువ్, రుద్ర హెలికాప్టర్ల పనితీరును అడిగి తెలుసుకునేందుకు విదేశీ ప్రతినిధులు ఆసక్తి చూపారు. -
అన్నింటా విఫలం
మోదీ ది యూ టర్న్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చని కేంద్రం ఊసేలేని నల్లధనం వెలికితీత దిగ్విజయ్ సింగ్ బెంగళూరు: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వాన్ని యూ టర్న్ ప్రభుత్వంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అభివర్ణించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్థానాలను నెరవేర్చే విషయంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.3లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని చెప్పిన మోదీ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ఆధార్’ను నరేంద్రమోదీనే స్వయంగా విమర్శించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఆ ‘ఆధార్’ బీజేపీ గొప్పతనమేనని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారరన్నారు. అంతేకాకుండ కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌తో ముడి పెడుతున్నారని విమర్శించారు. ఇలా ప్రతి విషయంలోనూ ఎన్డీఏ ప్రభుత్వ తమ వాఖ్యలను, సిద్ధాంతాల పట్ల యూ టర్న్ తీసుకుంటోందన్నారు. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ ముద్రించిన పుస్తకాన్ని త్వరలోనే ప్రజలకు పంచబోతున్నామని తెలిపారు. మధ్యతరగతి అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ వైపుగా ఇప్పటివరకూ చేపట్టిన చర్యులు ఏంటని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా పెట్రోలు, డీజల్ ధరలు తగ్గుతున్నా ఆమేరకు దేశంలో ఇంధన ధరలు తగ్గించకోవడం సరికాదన్నారు. దీని వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్ ఆద్మీ పార్టీను బీజేపీ-బీ టీంగా అభివర్ణించారు. అసలు ఆ పార్టీకు ఒక రాజకీయ సిద్దాంతమే లేదని విమర్శించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ఒక రోజులోపే కిరణ్బేడీను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం వల్ల ఆ పార్టీ పటిష్టత కోసం మొదటి నుంచి కృషి చేసిన హర్షవర్థన్ వంటి నాయకులకు అన్యాయం జరిగిందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మాట నిలబెట్టుకుందాం..
ఉగ్రవాదాన్ని కట్టడి చేద్దాం.. సార్క్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు 166 మందిని బలిగొన్న ముంబై మారణహోమాన్ని మర్చిపోలేం సమష్టి పోరుతోనే శాంతియుత దక్షిణాసియా సాకారమవుతుంది దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉందని వ్యాఖ్య సార్క్ 18వ సమావేశాలు ప్రారంభం.. కఠ్మాండు: ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని, సీమాంతర నేరాలను కట్టడి చేస్తామని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనేందుకు కృషి చేయాలని సార్క్ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ భద్రత, ప్రజల జీవితాలకు సంబంధించి అవగాహన, సున్నితంగా స్పందించేతత్వం ఉంటే దేశాల మధ్య స్నేహం, సహకారం పెంపొందుతాయని... ఇది అంతిమంగా శాంతికి, సుస్థిరతకు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో బుధవారం సార్క్ 18వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల తొలిరోజున ప్రధాని మోదీ దాదాపు దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఇందులో ప్రధానంగా ఉగ్రవాద అంశంతో పాటు సార్క్ దేశాల మధ్య సహకారం, వీసాల సరళీకరణ, వాణిజ్యం తదితర అంశాలపై ప్రసంగించారు. 2008లో ముంబైలో 166 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడి జరిగి బుధవారం నాటికి ఆరేళ్లయిన సందర్భంగా మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ఆ భయంకర మారణ హోమాన్ని భారత ప్రజలు మరిచిపోలేరని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని, సీమాంతర నేరాలకు పాల్పడడాన్ని నిర్మూలిస్తామని చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి సార్క్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచి ఇరుగుపొరుగు ఉండాలనే అన్ని దేశాల కోరిక అని... భద్రత, ప్రజల జీవితాలకు సంబంధించి స్పందించేతత్వం ఉంటే దేశాల మధ్య స్నేహం, సహకారం పెంపొందుతాయని మోదీ పేర్కొన్నారు. సమీకృత దృష్టితో, ఉమ్మడి చర్యలతో అందరూ కృషి చేస్తే.. శాంతియుత, సౌభాగ్యమైన దక్షిణాసియా సాకారమవుతుందన్నారు. ఐదేళ్ల వాణిజ్య వీసా..: సార్క్ దేశాలతో వాణిజ్యం, వ్యాపార సంబంధాలు పెంపొందడం కోసం వారికి మూడు నుంచి ఐదేళ్ల బిజినెస్ వీసా అందజేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దీనిని ‘సార్క్ బిజినెస్ ట్రావెలర్ కార్డు’ ద్వారా మరింత సులభం చేయవచ్చని ఆయన ప్రతిపాదించారు. సార్క్ దేశాల మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో... ఈ దేశాల మధ్య జరుగుతున్నది కేవలం 5 శాతమేనని, దీనిని పెంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాల్లో మౌలిక వసతుల కొరత పెద్ద సమస్య అని.. అందువల్ల భారత్‌లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ‘‘అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యం, ఘనమైన వారసత్వం ఉన్న ప్రాంతం దక్షిణాసియా. అభివృద్ధి సాధించాలనే తపన, యువత మన బలం. ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.. ’’ అని మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణాసియా ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వైద్యం కోసం భారత్ వచ్చేవారికి.. వెంటనే వీసా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. కాగా, మోదీ బుధవారం అఫ్ఘానిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారి మధ్య వాణిజ్యపరమైన అంశాలు, రక్షణ సహకారంపై చర్చలు జరిగాయి. అఫ్ఘాన్‌తో సంబంధాలు పరిపుష్టం చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి మోదీ హామీఇచ్చారు. ‘సార్క్’ ఒప్పందాలకు పాక్ చెక్ సార్క్ దేశాల అనుసంధానతకు సంబంధించిన ఒప్పందాలను బుధవారం పాకిస్తాన్ అడ్డుకుంది. ఆ ఒప్పందాల అమలుకు దేశీయంగా తాము సిద్ధంగా లేమని పేర్కొంటూ వాటిపై సంతకాలు చేసేందుకు నిరాకరించింది. సార్క్ దేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత పెరగడం, సభ్య దేశాల మధ్య వస్తు రవాణా సులభతరం కావడం.. మొదలైనవి లక్ష్యాలుగా రూపొందించిన ఆ ఒప్పందాలను పాక్ అడ్డుకోవడంపై భారత్, శ్రీ లంకలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే, పాక్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమాచారం. -
చాయ్‌వాలాపై నమ్మకముంచండి: మోదీ
చైబాసా: జార్ఖండ్‌కు రాజకీయ అస్థిరత నుంచి విముక్తి కల్పించేందుకుగాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జార్ఖండ్‌లోని చైబాసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘జార్ఖండ్ రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతుండడంతో ప్రజలు పేదరికంలో కూరుకుపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఈ చాయ్‌వాలా మీద నమ్మకం ఉంచండి. బీజేపీకి మెజారిటీ అందించండి. జార్ఖండ్‌ను కూడా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలా అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా’’ అని అన్నారు. 60 ఏళ్లుగా గత ప్రభుత్వాలు పేదలను తప్పుదారి పట్టించాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాశ్మీర్‌కు వరదసాయం ఏదీ?: రాహుల్ పూంఛ్: కేంద్రంలో సర్కార్‌ను బడా పారిశ్రామిక వేత్తలే నడుపుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పూంఛ్ ఎన్నికల సభలో విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియాలో ఆదానీ గ్రూపునకు భారీ రుణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,వరదలతో దెబ్బతిన్న జమ్ము కశ్మీర్‌కు రూ. వెయ్యికోట్లు ఇచ్చే హామీ అలాగే మిగిలిపోయిందన్నారు. -
నకిలీ వీడియోపై ఫైర్ : అమితాబ్ బచ్చన్
నటుడిగా ఫైర్ ఉన్న పాత్రలు బోల్డన్ని చేసి, ‘యాంగ్రీ మాన్’ ఇమేజ్ తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ ఇప్పుడు నిజంగానే ఫైర్ అవుతున్నారు. ఈ ‘బిగ్ బి’ ఆగ్రహానికి కారణం అంతర్జాలంలో హల్చల్ చేస్తున్న ఓ నకిలీ వీడియో. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా చూడాలని ఉందనే అభిప్రాయాన్ని అమితాబ్ వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దాదాపు ఐదేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారట. ఆ ప్రచార సభలో మాట్లాడిన మాటలను, వేరే విధంగా మలిచి ఈ నకిలీ వీడియోను విడుదల చేసారట. ఇది చిన్న విషయం కాదని, ఈ తప్పు చేసిన వ్యక్తిని వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా చూసుకుంటానని అమితాబ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విషయంలో అమితాబ్‌కి మోడీ కూడా సపోర్ట్ చేస్తూ, ‘ఇలా చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు. కాగా, యూ ట్యూబ్‌లో వీరవిహారం చేస్తున్న ఈ నకిలీ వీడియోను సృష్టించింది ఉత్పల్ జీవ్జ్రనీ అనే వ్యక్తి అట. ఈ విషయం గురించి ఉత్పల్ ఓ ప్రకటనలో చెబుతూ -‘‘ఇలా జరిగినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నా. నేను గుజరాతీ సినిమాలకు సంగీతదర్శకుడిగా చేస్తుంటాను. నేనా వీడియోను తయారు చేయలేదు. కనీసం ఎడిటింగ్ కూడా చేయలేదు. ‘వాట్సప్’ ద్వారా నా మొబైల్ ఫోన్‌కి ఈ వీడియో వచ్చింది. నేను మోడీ అభిమానిని. అమితాబ్ బచ్చన్ అంటే ఎనలేని గౌరవం. అందుకని ఆ వీడియోను అప్లోడ్ చేశాను. కానీ నకిలీ వీడియో అని ఆలస్యంగా తెలిసింది. వెంటనే తీసేస్తానని మాటిస్తున్నా’’ అని పేర్కొన్నారు.