చైబాసా: జార్ఖండ్‌కు రాజకీయ అస్థిరత నుంచి విముక్తి కల్పించేందుకుగాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జార్ఖండ్‌లోని చైబాసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘జార్ఖండ్ రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతుండడంతో ప్రజలు పేదరికంలో కూరుకుపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఈ చాయ్‌వాలా మీద నమ్మకం ఉంచండి. బీజేపీకి మెజారిటీ అందించండి. జార్ఖండ్‌ను కూడా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలా అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా’’ అని అన్నారు. 60 ఏళ్లుగా గత ప్రభుత్వాలు పేదలను తప్పుదారి పట్టించాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
కాశ్మీర్‌కు వరదసాయం ఏదీ?: రాహుల్
పూంఛ్: కేంద్రంలో సర్కార్‌ను బడా పారిశ్రామిక వేత్తలే నడుపుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పూంఛ్ ఎన్నికల సభలో విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియాలో ఆదానీ గ్రూపునకు భారీ రుణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,వరదలతో దెబ్బతిన్న జమ్ము కశ్మీర్‌కు రూ. వెయ్యికోట్లు ఇచ్చే హామీ అలాగే మిగిలిపోయిందన్నారు.
చాయ్‌వాలాపై నమ్మకముంచండి: మోదీ
Published Wed, Nov 26 2014 12:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement