'కొత్త సీఎం ప్రమాణం చేశారు'
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజధాని ఈటానగర్ లో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నబాంగ్ టుకీపై శనివారం అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఓ గంట ముందు నాటకీయ పరిణామాల మధ్య ఆయన ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ లీడర్ పదవికి రాజీనామా చేశారు.
టూకీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ లో రెబల్స్ గా మారిన 30 మంది ఎమ్మెల్యేలలో ఖండూ కూడా ఒకరు. వారి సపోర్టుతో గవర్నర్ కు లేఖను సమర్పించిన ఖండూ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమయ్యార. కాగా, అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠం మార్పు వెనుక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చక్రం తిప్పినట్లు సమాచారం. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 45 మెజారిటీ స్థానాలను గెలుపొందింది.