child falling
-
మాల్లో విషాదం: తండ్రి చేతుల్లోంచి జారిపడి..
కుటుంబంతో సరదాగా గడుపుదామని షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆ కుటుంబానికి శోకం మిగిలింది. తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాదిన్నర బిడ్డ కన్నుమూసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎస్కులేటర్ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు. ఆ టైంలో ఆ వ్యక్తి ఐదేళ్ల కొడుకు ముందుకు వెళ్తుండడంతో.. నిలువరించేందుకు ఆ తండ్రి యత్నించాడు. ఈ లోపు చేతిలో ఉన్న బిడ్డ జారి కింద పడిపోయాడు. మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. మాల్ సీసీటీవీ కెమెరాల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపర్చొచ్చు.. సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/aGlW7oZUAk — Anurag Tyagi (@TheAnuragTyagi) March 20, 2024 -
4వ అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారి..
ప్రాణం పోయే పరిస్థితుల్లో నుంచి బయటపడితే ఏమంటాం.. అద్భుతమే జరిగింది. భూమ్మీద నూకలు బాకీ ఉన్నాయి అంటాం. చిన్న పిల్లల విషయంలోనైతే చిరంజీవి అంటాం. ముంబైకి చెందిన అధర్వాను ఇప్పుడందరూ చిరంజీవి అని పిలుచుకుంటున్నారు. పిల్లాడికి తిరిగి జీవితాన్ని ప్రసాదించిన ఆ చెట్టును సంజీవని అంటున్నారు. సాక్షి, ముంబై : నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డ 14 నెలల అధర్వా బర్కాడే అలియాస్ శ్రీ అనే బాలుడికి ఓ చెట్టు పునర్జన్మనిచ్చింది. చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేలా చేసింది. వివరాలు.. అధర్వా అలియాస్ శ్రీ కుటుంబం గోవంధిలోని దేవాశి రోడ్డులో గల గోపికృష్ణన్ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. గురువారం ఉదయం శ్రీ నానమ్మ ఫ్రెంచ్ కిటీకీ తెరచి బట్టలు ఆరబెట్టింది.కానీ, హడావుడిలో గడియ సరిగా పెట్టలేదు. కొత్త భవనం కావడంతో దానికి గ్రిల్స్ బిగించలేదు. అదే గదిలో ఆడుకుంటున్న శ్రీ కిటికీ వద్దకు చేరుకున్నాడు. రక్షణగా ఉన్న రెండు ఫీట్ల ఎత్తున్న తేలికపాటి చెక్కను తొలగించడంతో ఆ ఫ్రెంచ్ కిటికీ నుంచి నుంచి కిందపడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. పరుగు పరుగున కిందకి చేరుకున్నారు. అయితే, శ్రీ కుటుంబం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను ఆనుకుని ఓ చెట్టు ఉండడంతో.. పిల్లాడు నేరుగా కిందపడలేదు. ఆ చెట్టు కొమ్మలపై పడి నేలను చేరడంతో తీవ్ర గాయాలు కాలేదు. తమ కుమారుడికి ఏమైందోనని తల్లిదండ్రులు అజిత్, జ్యోతి వచ్చి భోరున విలపించారు. బాలుడు స్పృహలోనే ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శ్రీకి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. పెదవి, కాలికి గాయాలయ్యాయని తెలిపారు. చెట్టుపై పడడంతోనే పిల్లాడికి పెద్దగా గాయాలు కాలేదని అన్నారు. కాగా, బాలుడి తండ్రి చెట్ల పెంపకానికి వినియోగించే ఎరువులు, మట్టి, పేడ వ్యాపారం చేస్తుండడం విశేషం. పిల్లాడి ప్రాణాలు కాపాడిన ఆ చెట్టుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. -
బోరుబావిలో పడిన చిన్నారి శాన్వి మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా శాలాగౌరారం మండలం వల్లాల గ్రామంలో బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి శాన్వి ప్రాణాలు కోల్పోయింది. శాన్విని ప్రాణాలతో బయటికి తీసేందుకు 13 గంటలుగా సాగిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున బోరుబావి నుంచి బయటికి తీసిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినంట్లు వైద్యులు ధృవీకరించారు. అసలు ఏం జరిగిందంటే... మృతనిమ్మతోటలో బావి పూడిక తీసేందుకు వెళ్లిన శాన్వి తల్లిదండ్రులు చిన్నారిని తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ శాన్వి తల్లిదండ్రులు తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న బోరు బావిలో పడింది. కొన్ని నిమిషాల తర్వాత శాన్వి ఎక్కడుందని తల్లి అడగగా తనకు తెలియదని చిన్నారి తండ్రి చెప్పాడు. వారు చిన్నారి కోసం వెతకగా సుమారు 20 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయినట్లు గుర్తించారు. వారి నుంచి సమాచారం అందుకున్న ఫైర్, రెవిన్యూ సిబ్బంది గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బావి దగ్గరికి త్వరగానే చేరుకుని పనులు ప్రారంభించారు. బోరు బావిలో నీళ్లు పడకపోవడంతో మూత మూయకుండా అలాగే వదిలేయడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆర్డీవో వెంకటాచారి చెప్పారు. బండరాయి యమపాశమైంది.... చిన్నారి శాన్విని బోరు బావి నుంచి బయటకు తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేసి దాదాపు 18 అడుగుల లోతు వరకు బావికి సమాంతరంగా తవ్వారు. అయితే, దురదృష్టం ఆ తల్లిదండ్రులను వెంటాడింది. 108 ద్వారా శాన్వీకి ఆక్సిజన్ సరాఫరా చేస్తున్నాం.. మరో రెండు అడుగులు తవ్వి శాన్విని బయటకు తీసి ప్రాణాలతో రక్షిస్తామని అధికారులు చెప్పారు. కేవలం గంట సమయంలోనే 18 అడుగుల తవ్వేశారు. ఇక్కడే అధికారులకు పెను సవాలు ఎదురైంది. ఓ పెద్ద బండరాయి అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డ్రిల్లర్ లను తెప్పించి మళ్లీ తవ్వడం ప్రారంభించగా దాదాపు 10 గంటల తర్వాత కూడా శాన్విని బయటకు తీయలేకపోయారు. ఆ పెద్ద బండరాయి చిన్నారి పాలిట శాపమై ప్రాణాల్ని బలి తీసుకుంది. తెల్లవారు జామున మూడు గంటలకు చిన్నారిని బయటకు తీసి నకిరేకల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శాన్వి ప్రాణాలతో లేదని డాక్టర్లు నిర్ధారించారని ఆర్డీవో వివరించారు. చిన్నారి ఇక లేదన్న వార్త విన్న ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.