Child Mortality Report
-
బిడ్డ జాగ్రత్త!.. గడిచిన 6 నెలల్లో 5,167 చిన్నారులు మృతి
తల్లిదండ్రులకు ప్రాణమైన పసిపిల్లల జీవితం గాలిలో దీపమైంది. గర్భిణికి సరైన పోషకాహారం అందక బిడ్డ తక్కువ బరువుతో జన్మించడం, దాని వల్ల పలు రకాల జబ్బులు సోకడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవ సేవల లోపం ఇలా ఎన్నో కారణాలు పసిగుడ్లకు శాపంగా మారాయి. తమ బిడ్డ పూర్తి జీవితం ఆస్వాదించాలన్న కన్నవారి ఆశ ఊయలలోనే కొడిగడుతోంది. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు శిశువులు, బాలల మరణాల సంఖ్య ఏటా 10 వేల వరకూ ఉంటోంది. సాక్షి, బెంగళూరు: కోవిడ్ మహమ్మారి అనంతరం రాష్ట్రంలో పిల్లల మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో 5 వేలమందికి పైగా బాలలు మృత్యువాత పడ్డారు. ఆరోగ్యశాఖ సమాచార వ్యవస్థలో ఉన్న అంశాలు ఈ విపత్తుకు అద్దం పడుతున్నాయి. గత ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబరు 30 వరకు ఐదేళ్ల లోపు వయసు కలిగిన 5,167 పిల్లలు పలు కారణాలతో కన్నుమూశారు. ఇందులో 3,648 మంది ఒక నెలలోపు పసికూనలు. ఆవేదన కలిగించే మరణాలు ►ఐదేళ్లలోపు బాలలు ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం 2020–21లో 9,120 మంది, 2021–22 లో 9,050 మంది మరణించారు. ►2019–20లో 11,504 మంది, 2018–19లో 11,781 మంది ఊపిరి వదిలారు. ► 2017–18లో 13,635 మంది కన్నుమూశారు. చదవండి: షాకింగ్! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది ఇవి కొన్ని కారణాలే ►కోవిడ్ మహమ్మారి సమయంలో పిల్లల మరణాలు తగ్గినప్పటికీ ఆ తరువాత పెరిగాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి పడిపోవడం, అపౌష్టికత పెరగడం కారణం కావచ్చు. ►కోవిడ్ విస్తరించాక ఆస్పత్రుల్లో గర్భిణులకు, బాలింతలకు వైద్యసేవలు అందడం ఆలస్యమైంది. ►ఘోషా ఆస్పత్రులను కూడా కరోనా వైద్యాలయాలుగా మార్చడం, వైద్యసిబ్బంది కరోనా చికిత్సల్లో నిమగ్నం కావడం తెలిసిందే. ►అంగన్వాడీ కేంద్రాలు మూతపడి గుడ్లు, పౌష్టిక ఆహారం అందకపోవడంతో పేదవర్గాల తల్లీపిల్లల్లో రక్తహీనత, అపౌష్టికత, అతిసారం వంటివి ప్రబలాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. చదవండి: ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం ప్రతి 1000 మందిలో 21 మంది... ► 2020 సర్వే ప్రకారం కర్ణాటకలో ప్రతి వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లల్లో 21 మంది పిల్లలు మరణిస్తున్నారు. ఈ సంఖ్య కేరళలో 8 మంది, తమిళనాడులో 13 మందిగా ఉంది. ►శిశు మరణాల్లో దక్షిణ భారత రాష్ట్రాల సగటు.... జాతీయ సరాసరి అయిన 32 కంటే తక్కువగానే ఉంది. ►రాష్ట్రంలో ప్రతి 1000 మంది ఏడాది వయసులోపు శిశువుల్లో 19 మంది మరణిస్తే అది జాతీయ సగటు 28గా ఉంటోంది. నవజాత శిశు మృతులు 14 ఉంటే జాతీయ సరాసరి 20గా ఉంది. వైద్యారోగ్య శాఖ నివారణ చర్యలు ఈ నేపథ్యంలో పిల్లల మరణాల అడ్డుకట్టకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు రూపొందించింది. పిల్లలు మృతికి కారణం ఏమిటి? అనే సమాచారం సేకరించి నివారణ చర్యలకు నడుం బిగించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 41 నవజాత శిశువుల ప్రత్యేక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలను, సేవలను ముమ్మరం చేసింది. పిల్లలు మృతుల నియంత్రణకు ప్రసూతి అనంతరం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బసవ రాజదబాడి తెలిపారు. -
దేశంలో తగ్గిన నవజాత శిశు మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: నవజాత శిశు, బాలల మరణాల నివారణలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్–2020ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. 2014తో పోలిస్తే శిశు మరణాల రేటు (ఐఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్), ఐదేళ్లలోపు వారి మరణాల రేటు(యూఎంఆర్)లో బాగా తగ్గాయని తెలిపింది. ‘‘నవజాత శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యిమందికి 22 కాగా, 2020 నాటికి 20కి తగ్గింది. మరణాల వార్షిక తగ్గుదల రేటు 9.1%. ఇది పట్టణ ప్రాంతాల్లో 12%, గ్రామీణ ప్రాంతాల్లో 23%. ఐదేళ్ల కంటే తక్కువ వయసు బాలల మరణాలు 2019లో ప్రతి వెయ్యికి 35 కాగా 2020కి 32కి తగ్గాయి. వీటిని 2030 నాటికి 25కు తగ్గించాలన్న లక్ష్యాన్ని తెలంగాణ సహా 11 రాష్ట్రాలు ఇప్పటికే చేరుకున్నాయి’’ అని నివేదిక తెలిపింది. ఈ తరహా మరణాల తగ్గింపులో కేరళ (8), తమిళనాడు (13), ఢిల్లీ (14)ముందు వరుసలో ఉండగా తెలంగాణలో ప్రతి వెయ్యి మందికి 23 మరణాలు ఉన్నాయని వెల్లడించింది. శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యి మందికిు 30 ఉండగా, 2020 నాటికి అది 28కి తగ్గిందని తెలిపింది. -
అమ్మను రక్షిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: మాతృత్వపు మరణాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గాయి. 2015–17 మధ్య భారతదేశంలో సంభవించిన మాతా మరణాల నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో బాలింతల మరణాలు తగ్గాయి. మరణాల తగ్గుదలలో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో అత్యంత తక్కు వగా కేరళలో ప్రతీ లక్ష మందిలో 42 మంది, మహారాష్ట్రలో 55, తమిళనాడులో 63, ఆంధ్రప్రదేశ్‌లో 74, తెలంగాణ, జార్ఖండ్‌లలో 76 మంది చొప్పున బాలింతలు మరణిస్తున్నారు. 2014–16 మధ్య తెలంగాణలో ప్రతీ లక్ష మందిలో 81 మంది బాలింతలు మరణించేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 76కు తగ్గింది. జాతీయ స్థాయిలో మాతా మరణాల రేటు 122 ఉండగా, దేశంలో అత్యధికంగా అస్సాంలో 229గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మరణాల రేటు 216గా ఉంది. మూడు దశల్లో జరిగే మరణాలే లెక్క.. మాతా మరణాలను మూడు దశల్లో లెక్కిస్తారు. 15 నుంచి 49 ఏళ్లలోపు గర్భిణులను లెక్కలోకి తీసుకుంటారు. గర్భిణీగా ఉన్నప్పుడు సరైన ఆరోగ్య రక్షణ లేకపోవడం వల్ల సంభవించే మరణాలు, ప్రసవ సమయంలో సంభవించే మరణాలు, ఆ తర్వాత నెల లోపు జరిగే మరణాలను మాతా మరణాలుగా పరిగణిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మాతా మరణాలను ప్రతీ లక్ష మందిలో ఎంతమంది బాలింతలు చనిపోయారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. ప్రస్తుతం దేశంలో మాతా మరణాల రేటు దక్షిణ భారతదేశంలోనే గణనీయంగా తగ్గడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రమే అత్యధికంగా 97 మరణాలు సంభవిస్తున్నాయి. జార్ఖండ్‌లోనైతే 2014–16 మధ్య మాతా మరణాల రేటు 165 ఉంటే, ఈసారి ఏకంగా 76కు తగ్గడం విశేషం. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే గతానికంటే సగానికిపైగా మరణాలు తగ్గాయి. విచిత్రమేంటంటే మధ్యప్రదేశ్‌లో గతంలో మాతృత్వపు మరణాల రేటు 173 ఉంటే, ఈసారి 188కు పెరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో గతంలో మరణాల రేటు 201 ఉంటే, ఈసారి 216కు పెరిగింది. ప్రసవ కేంద్రాల బలోపేతమే కారణం రాష్ట్రంలో ప్రభు త్వ ఆసుపత్రుల్లో ప్రస వ కేంద్రాలను బలోపేతం చేయడం వల్లే మాతృత్వపు మరణా లు తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రభు త్వం ప్రసవ కేంద్రాలపై దృష్టి సారించిందని, వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించిందని చెబుతున్నా రు. దాదాపు 300 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల (పీహెచ్సీ)ను 24 గంటల ఆసుపత్రులుగా మార్చడం మా తృత్వపు మరణాలు తగ్గడానికి కారణమని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. సర్కారు నిర్ణయాల వల్లే: ఈటల రాజేందర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయి. వైద్య, ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి, అంగన్వాడీల్లో గర్భిణులకు సరైన పోషకాహారం అందించడం, ఎప్పటికప్పుడు చెకప్‌లు చేయడం వంటి చర్యలతో మాతా మరణాల రేటు తగ్గుదలలో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచాం. కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక చర్యలతో సాధ్యమైంది. కేసీఆర్ కిట్ వచ్చాక పరిస్థితి ఇంకా మెరుగుపడింది. -
ప్రపంచంలో పిల్లల మరణాలు తగ్గాయి
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా గడచిన కొన్ని దశాబ్దాలుగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయి. 2000 సంవత్సరంలో సంభవించిన పిల్లల మరణాలతో పోలిస్తే 2015 సంవత్సరంలో సంభవించిన పిల్లల మరణాలు 40 లక్షలు తక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలిందని ‘ది లాన్సెట్’ వైద్య పత్రిక వెల్లడించింది. 1990 నాటి నుంచి 2015 నాటి వరకు పరిశీలిస్తే ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు 53 శాతం తగ్గాయి. ఇంతమాత్రానికే సంతోష పడాల్సిన అవసరం లేదని, 2000 సంవత్సరం నాటికి మూడింతలు తగ్గించాలనే ప్రపంచ లక్ష్యం నెరవేరనే లేదని వైద్య పత్రిక వ్యాఖ్యానించింది. అయితే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఈ పిల్లల మరణాలు తగ్గడం ఆనందదాయకమని పేర్కొంది. డయేరియా, మలేరియా, మీజిల్స్తోనే కాకుండా ప్రసవం సందర్భంగా కూడా పిల్లలు ఎక్కువగా మరణించేవారు. ఈ పిల్లల మరణాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని కూడా నివేదిక పేర్కొంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల మంది పిల్లలు మరణించారు. వారిలో 27లక్షల మంది పురిట్లోనే చనిపోయారు. మొత్తం పిల్లల మరణాల్లో 60 శాతం మరణాలు ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా, చైనా, అంగోలా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, టాంజానియా దేశాల్లో సంభవించాయి. వీటిలో కొన్ని దేశాల్లో పిల్లల జననాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆయా దేశాల్లో మతులు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రతి వెయ్యి మంది పిల్లల్లో వంద మందికి పైగా పిల్లలు అంగోలా, చాద్, మాలి, నైజీరియా, సియెర్రా లియోన్, సోమాలియా దేశాల్లో ఎక్కువగా మరణిస్తున్నారు.