children doctor
-
చంటి పిల్లల వైద్యుడికి పాజిటివ్..
తూర్పుగోదావరి,పిఠాపురం: చంటి పిల్లల వైద్యుడికి కరోనా సోకినట్టు తేలడంతో పిఠాపురం పరిసర గ్రామాల్లో ఆందోళన రేగింది. పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఇతర గ్రామాల్లోనూ ఆ వైద్యుడికి మంచి పేరుంది. చాలామంది తమ పిల్లలకు ఆయన దగ్గరే వైద్యం చేయిస్తారు. లాక్డౌన్ సమయంలో కూడా ఆయన వందల మంది చంటి పిల్లలకు చికిత్స చేశారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో నాలుగు రోజుల క్రితం కాకినాడలో టెస్టు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు సోమవారం రిపోర్టు వచ్చింది. దీంతో ఆయన హోంఐసోలేషన్‌కు వెళ్లారు. ఇంతవరకు మామూలుగా జరిగే పక్రియే. అయితే కరోనా లక్షణాలు కనిపించి టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్టు వచ్చే వరకూ ఎవరైనా హోం ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ ఈ వైద్యుడు ఆదివారం రాత్రి వరకూ చిన్న పిల్లలకు వైద్యం చేశారు. దీంతో ఆ పిల్లల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ డాక్టర్ చికిత్స అందించిన వారి వివరాల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. -
నా భర్తను చంపేస్తారేమో?!
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరిగిన నిరసనల్లో విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణలపై గత జనవరిలో అదుపులోకి తీసుకున్న పిల్లల వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్ భార్య షబీస్టా ఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జైలులో ఉన్న భర్తను కలిసిన అనంతరం ఆయన భద్రతపై ఆమె అనేక సందేహాలు వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తన భర్త జైలుల్లోపల మానసిక వేధింపులకు గురవుతున్నారని, ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచివుందని పేర్కొన్నారు. జైలుకు తీసుకువచ్చిన ఐదు రోజుల పాటు ఆహారం కూడా ఇవ్వకుండా చాలా అమానవీయంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అంతేకాదు జైలు లోపలే తన భర్తను హత్య చేసే ప్రమాదం వుందని, తన భర్తకు భద్రత కల్పించాని విజ్ఞప్తి చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాగే యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ హోమ్, యూపీ డీజీ( జైలు)కు కూడా తన లేఖను అందించారు. కాగా 2017లో ప్రభుత్వ ఆస్పత్రిలో 60మంది చిన్నారులు ఆక్సిజన్ కొరతతో మృతిచెందిన ఘటనలో అరెస్టయి నిర్దోషిగా బయటపడ్డ డాక్టర్ కఫీల్ ఖాన్‌ను గతేడాది (డిసెంబర్ 12న) అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) లో సీఏఏ పై రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) ప్రయోగించిన అనంతరం మధుర జైలుకు తరలించారు. గత వారం, ఖాన్ మామ నుస్రుల్లా అహ్మద్ వార్సీని రాజ్‌ఘాట్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులుకాల్చి చంపారు. 2018 లో ఖాన్ సోదరుడిపై హత్యా యత్నం జరిగింది. కాని అతను ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. -
ఉడికిపోతున్న జనం భగ్గుమంటున్న ఎండలు
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: ‘‘ఒరేయ్ శ్రీను ఏటిరా ఈ ఎండలు, ఉదయం 9 గంటలకే నెత్తి సుర్రుమంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఎలా ఉం టుందోరా’’ అంటూ మండే ఎండల గురించి జనం చర్చించుకుంటూ వగరుస్తున్నారు. ఓవైపు సెగలుకక్కుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్‌కోతతో అల్లాడిపోతున్నారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లన్నీ ఉదయం తొమ్మిది గంటల తర్వాత నిర్మూనుష్యమవుతున్నాయి. మే,జూన్ నెలలను తలపించే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. వేడి గాలులు కూడా తోడవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, రోగులు, గర్భిణులు, శస్త్రచికిత్సలు చేసుకున్నవారు, బాలింతలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అగ్నిప్రమాదాలకు గురై, చికిత్స పొందతున్న వారిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, రిక్షా కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులు, టోపీలు ధరించకుండా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కూలీలు అయితే 10 గంటలకే పనిముగించేసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పటికే పలువురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. శీతలపానీయాలను ఆశ్రయిస్తున్న జనం: ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. పళ్లరసాలు, కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు, ఫ్రూట్ సలాడ్ వంటి వి తీసుకుంటున్నారు. దీంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైయితే తప్ప బయటకు వెళ్లకూడదు. గొడుగు లేదా టోపీ, కళ్లద్దాలు ధరించి వెళ్లాలి. చర్మవ్యాధిగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు ఎండలోకి వెళ్లరాదు. - బి.వెంకటేష్, పిల్లలు వైద్యుడు, కేంద్రాస్పత్రి 2012 తేదీ గరిష్టం కనిష్టం 15 33 25 16 35 27 17 37 29 18 39 30 19 36 29 2013 15 35 27 16 34 30 17 38 30 18 38 30 19 37 28 2014 15 37 28 16 37 27 17 37 29 18 36 20 19 37 29