china objection
-
వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఇటీవల సాగించిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల డ్రాగన్ దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశ నాయకులు అరుణాచల్‌లో పర్యటించడాన్ని తాము కచి్చతంగా, గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పింది. అరుణాచల్ రాష్ట్రాన్ని తాము ఇండియాలో భాగంగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అది దక్షిణ టిబెట్‌లో ఒక భాగమని పేర్కొంది. వెంకయ్య నాయుడు ఈ నెల 9న అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, హింసకు తెరపడి, శాంతి నెలకొంటోందని చెప్పారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఏకపక్షంగా, బలవంతంగా, చట్టవిరుద్దంగా ఇండియాలో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని, అక్కడ భారత నేతలు పర్యటిస్తే వ్యతిరేకిస్తామని తేలి్చచెప్పారు. చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినేలా, సరిహద్దు వివాదాలు పెరిగిపోయేలా వ్యవహరించవద్దని భారత్‌కు హితవు పలికారు. అరుణాచల్ మా దేశంలో అంతర్భాగం: భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో వెంకయ్య నాయుడు పర్యటించడం పట్ల చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా అభ్యంతరాలను తిరస్కరించింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తేలి్చచెప్పారు. భారత్ నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థంపర్థం లేని పని అని కొట్టిపారేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. -
చైనాతో మరో తగవు
కిబితు(అరుణాచల్ ప్రదేశ్): భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో మరోసారి ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. గతేడాది డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగగా.. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లోని అసఫిలా ప్రాంతంలో భారత బలగాల పహారాపై చైనా అభ్యంతరంతో విభేదాలు ఏర్పడ్డాయి. సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద వ్యూహాత్మకంగా సున్నిత ప్రాంతమైన అసఫిలా వెంట భారత్ ఆక్రమణలకు పాల్పడిందని ఆరోపిస్తూ గత నెల్లో చైనా తన అభ్యంతరాన్ని తెలియచేసింది. అయితే ఈ ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ‘మార్చి 15న జరిగిన ‘బోర్డర్ పర్సనల్ మీటింగ్’(బీపీఎం)లో ఈ అంశాన్ని చైనా లేవనెత్తగా.. భారత ఆర్మీ వాటిని తిరస్కరించింది. అరుణాచల్‌లోని ఎగువ సుబాన్సిరి ప్రాంతం భారత భూభాగమని, అక్కడ నిరంతరం పహారా కొనసాగుతుందని మన అధికారులు చైనాకు స్పష్టం చేశారు’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. బలగాల పహారాను ఆక్రమణలుగా పేర్కొంటూ చైనా వాడిన పదజాలంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. డోక్లాం వివాదాం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఎల్ఏసీ వెంట భారత్ యుద్ధ సన్నాహక కసరత్తుల్ని పెంచిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. -
అక్కడికెలా వెళతారు..?
బీజింగ్ : ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై డ్రాగన్ తన వక్రబుద్ధి చాటుకుంది. మోదీ పర్యటించిన ప్రాంతం దక్షిణ టిబెట్‌లో భాగమంటూ మండిపడింది. భారత్ తీరుపై దౌత్యపరమైన నిరసన చేపడతామని పేర్కొంది. చైనా-భారత్ సరిహద్దు వ్యవహారంలో చైనా వైఖరి సుస్పష్టమని, దీనిలో ఎలాంటి మార్పు లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షాంగ్ అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా ఎప్పుడూ గుర్తించలేదని..వివాదాస్పద ప్రాంతంలో భారత నేత పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని షాంగ్ చెప్పినట్టు చైనా అధికార వార్తాసంస్థ తెలిపింది. సరిహద్దు వివాదాలను సంప్రదింపులు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సరిహద్దు సమస్య ఉత్పన్నమయ్యేలా ఎలాంటి వివాదాలకు భారత్ తావివ్వరాదని చైనా కోరుతోందన్నారు. -
సీతారామన్ ‘పర్యటన’పై చైనా అభ్యంతరం
బీజింగ్: భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో ఆమె పర్యటన వల్ల శాంతికి విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. బలగాల సన్నద్ధతను తెల్సుకునేందుకు ఆ రాష్ట్రంలోని అంజా జిల్లాలోని సైనికస్థావరాలను ఆదివారం నిర్మల సందర్శించారు. ఈ విషయమై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునింగ్ మీడియాతో మాట్లాడుతూ..‘అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత రక్షణ మంత్రి పర్యటిస్తున్నారు అంటే అక్కడ చైనా స్థానమేంటో మీరు స్పష్టంగా తెల్సుకోవాలి. భారత్–చైనాల మధ్య తూర్పు సరిహద్దు వివాదాస్పద ప్రాంతంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
చైనాకు తూచ్.. భారత్‌కే అమెరికా మద్దతు!
చైనాను తోసిరాజని.. భారతదేశానికి అమెరికా అండగా నిలిచింది. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్ వద్దని ఎంత మొత్తుకుంటున్నా.. భారతదేశం మాత్రం అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో చేరడం ఖాయమని అమెరికా బల్లగుద్ది చెబుతోంది. ఎన్ఎస్జీలో భారత్ చేరడాన్ని చైనా వ్యతిరేకించిన కొద్ది గంటల్లోనే భారతదేశానికి మద్దతుగా అమెరికా ముందుకొచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లోనే చెప్పిన విషయాన్ని అమెరికా హోంశాఖ ప్రతినిధి జాన్ కిర్బీ గుర్తుచేశారు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ నిబంధనలను భారతదేశం పాటిస్తోందని, అందువల్ల అణు సరఫరాదారుల బృందంలో చేరడానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని కిర్బీ అన్నారు. చైనా, పాకిస్థాన్ మాత్రం భారత సభ్యత్వం విషయంలో ముందునుంచే వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. భారతదేశంతో తమకున్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని అనవసరంగా పాకిస్థాన్‌ను వాడుకోవడం చైనాకు తగదని కూడా అమెరికా భావిస్తున్నట్లు ఇటీవల అమెరికా మీడియా తెలిపింది. 48 దేశాలతో కూడిన ఎన్ఎస్జీ బృందాన్ని విస్తరించాలంటే ఎన్పీటీ మీద సంతకం చేయడం ముఖ్యమని చైనా వాదిస్తోంది. అయితే.. భారత్‌ను పాకిస్థాన్ లాంటి దేశంతో పోల్చడం సరికాదని, లిబియా లాంటి దుష్టదేశాలకు పాకిస్థాన్ అణు టెక్నాలజీని అమ్ముతోందని అమెరికా చెబుతోంది. పాకిస్థాన్ అణు పితామహుడు డాక్టర్ ఎ.క్యు. ఖాన్ కూడా అంతర్జాతీయంగా అణు వ్యాపారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. అణ్వస్త్రాలు లేని దేశంగా తాము ఉంటామంటూ సంతకం చేయాల్సిన ఎన్పీటీలో తాము చేరే ప్రసక్తి లేదని భారతదేశం ఎప్పుడో తన విధానాన్ని స్పష్టం చేసింది. దేశ భద్రత దృష్ట్యా అవి తప్పనిసరని చెబుతోంది. పైపెచ్చు, ఆ ఒప్పందం చాలా వివక్షాపూరితంగా ఉందని కూడా భారత్ వాదిస్తోంది.