
బీజింగ్: భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో ఆమె పర్యటన వల్ల శాంతికి విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. బలగాల సన్నద్ధతను తెల్సుకునేందుకు ఆ రాష్ట్రంలోని అంజా జిల్లాలోని సైనికస్థావరాలను ఆదివారం నిర్మల సందర్శించారు. ఈ విషయమై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునింగ్ మీడియాతో మాట్లాడుతూ..‘అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత రక్షణ మంత్రి పర్యటిస్తున్నారు అంటే అక్కడ చైనా స్థానమేంటో మీరు స్పష్టంగా తెల్సుకోవాలి. భారత్–చైనాల మధ్య తూర్పు సరిహద్దు వివాదాస్పద ప్రాంతంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment