శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1.01 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తుడు శుక్రవారం రూ. 1,01,116ను విరాళంగా అందించారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మాటూరి రంగనాథ్ స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం విరాళాన్ని శ్రీ అమ్మా కనస్ట్రక్షన్స్ పేరున చెక్కు రూపంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావుకు అందశారు. ఈవో విరాళం బాండ్ అందించిన దాతను అభినందించారు.