in chintalapudi
-
100 పడకల ఆసుపత్రికి నిధుల్లేవ్
చింతలపూడి : చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో రూ.78.15 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భననాలను మాజీ మంత్రి పీతల సుజాతతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కాగితాలపైనే 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందన్నారు. తమ ప్రభుత్వం వద్ద డబ్బు లేదని ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరుస్తామని సమాధానం చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం చింతలపూడి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ఎనస్తీషియన్, పిడియాట్రిక్ వైద్యులను నియమించాలని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సుజాత మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ తో పాటు, గైనకాలజిస్ట్‌ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కె.కోటేశ్వరి, జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, సర్పంచ్ ఎస్.వరలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ టి.కుటుంబరావు పాల్గొన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు కామవరపుకోట : అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కామవరపుకోటలో రూ.68.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీటీసీ సభ్యుడు జి.సుధీర్‌బాబు, మండల పరిషత్ అధ్యక్షురాలు మద్దిపోటి సుబ్బలక్ష్మి, సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.260 కోట్లు
చింతలపూడి : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం రూ.260 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానంలో శుక్రవారం ఖేలో ఇండియా నియోజకవర్గస్థాయి పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులతో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, మొగల్తూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రెండోదశలో జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ ఏడాది ఉత్తమ పీఈటీగా ఎంపికైన కలరాయనగూడెం జెడ్పీ హైస్కూల్ పీఈటీ ఎండీ యూసుఫ్‌ను మంత్రి సభలో సత్కరించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఏ అజీజ్, సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, వైస్ ఎంపీపీ గుత్తా వెంకులు, తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ పాల్గొన్నారు. -
తెలుగు సినిమాకు విస్త్రత ఆదరణ
చింతలపూడి : తెలుగు సినీ పరిశ్రమకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు రెండు కళ్లు లాంటివాళ్లని ప్రముఖ హాస్య సినీ నటులు రఘుబాబు, కృష్ణ భగవాన్ అన్నారు. చింతలపూడిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వీరు విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. గతంతో పోల్చుకుంటే తెలుగు సినీ పరిశ్రమ విస్తృత్రి బాగా పెరిగిందన్నారు. ఇతర భాషల ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారన్నారు. ప్రశ్న : రాష్ట్రం విడిపోయాక సినిమాల పరంగా ఇబ్బందులేమైనా ఎదుర్కొన్నారా? రఘుబాబు : పెద్దగా తేడా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ఆదరణలో ఎలాంటి మార్పు రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ పచ్చగా ఉంటేనే పరిశ్రమను నమ్ముకున్న వాళ్లు ఆనందంగా ఉంటారు. కృష్ణ భగవాన్ : రెండు రాష్ట్రాల ప్రేక్షక దేవుళ్లు మా సినిమాలను ఆదరిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కడున్నా అభివృద్ధి చెందాలన్నదే నా అభిమతం. ప్రశ్న : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు? ప్రస్తుతం ఏఏ సినిమాల్లో నటిస్తున్నారు? రఘుబాబు : ఇప్పటి వరకు 300 సినిమాల్లో నటించాను. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నాను. కృష్ణ భగవాన్ : 300 సినిమాలకు పైగా నటించాను. నేను లోకల్, వైశాఖం , జగన్మోహిని చిత్రాల్లో నటిస్తున్నాను. ప్రశ్న : సినీ పరిశ్రమలో మీరు సాధించాల్సింది ఏమైనా ఉందా? రఘుబాబు : నాకు దర్శకత్వం చేయాలంటే చాలా ఇష్టం. అయితే అవకాశం రావాలి కదా. కృష్ణ భగవాన్ : తెలుగులో మంచి కమెడియన్ గా రాణించి పేరు తెచ్చుకోవడం ఒక్కటే నాకున్న లక్ష్యం. -
అక్రమంగా తరలిస్తున్న రేష న్ బియ్యం పట్టివేత
చింతలపూడి : అక్రమంగా లారీలో తరలిస్తున్న రేష న్ బియ్యాన్ని చింతలపూడి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. స్థానిక గురుభట్లగూడెం రోడ్డు సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 16 టీటీ 5947 నంబర్ గల లారీలో 14.5 టన్నుల రేష న్ బియ్యం ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ బియ్యం స్థానిక వ్యాపారి ఎం.ఉమామహేశ్వరరావుకు చెందినవిగా విచారణలో తెలిసినట్లు ఎస్ఐ సైదా నాయక్ వివరించారు. శివాపురం గ్రామం నుంచి తూర్పు గోదావరిజిల్లా కాకినాడకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్టు వెల్లడించారు. బియ్యంతో సహా లారీని స్వాధీనం చేసుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో గత వారం రోజుల్లో మూడుసార్లు అక్రమ రేష న్ బియ్యం పట్టుబడటం విశేషం. అధికారులు వరుస దాడులు జరుపుతున్నా.. వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి రోజూ ఏదో దారిలో రేషన్స బియ్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రేష న్ షాపుల్లో తనిఖీలు ఉండ్రాజవరం (తణుకు టౌ న్) : ఉండ్రాజవరంలోని 2వ నంబర్ రేష న్ షాపుపై విజిలె న్స అధికారులు దాడి చేశారు. అధికంగా ఉన్న సరుకులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం విజిలె న్స తహసీల్దార్ శైలజ ఆధ్వర్యంలో విజిలెన్స బృందం రేషన్ షాపును తనిఖీ చేసి రికార్డుల కంటే అధికంగా ఉన్న 400 కిలోల బియ్యాన్ని, 158 లీటర్ల కిరోసిన్, నాలుగు కిలోల పంచాదారను స్వాధీనం చేసుకున్నట్లు మండల సివిల్ సప్లయ్స్ అధికారి .ప్రసాదరావు తెలిపారు. తనిఖీలలో విజిలెన్స సిబ్బంది జయప్రసాద్, వీఆర్వో ఐ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.