తెలుగు సినిమాకు విస్త్రత ఆదరణ
తెలుగు సినిమాకు విస్త్రత ఆదరణ
Published Sun, Nov 20 2016 10:31 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
చింతలపూడి : తెలుగు సినీ పరిశ్రమకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు రెండు కళ్లు లాంటివాళ్లని ప్రముఖ హాస్య సినీ నటులు రఘుబాబు, కృష్ణ భగవాన్ అన్నారు. చింతలపూడిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వీరు విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. గతంతో పోల్చుకుంటే తెలుగు సినీ పరిశ్రమ విస్తృత్రి బాగా పెరిగిందన్నారు. ఇతర భాషల ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారన్నారు.
ప్రశ్న : రాష్ట్రం విడిపోయాక సినిమాల పరంగా ఇబ్బందులేమైనా ఎదుర్కొన్నారా?
రఘుబాబు : పెద్దగా తేడా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ఆదరణలో ఎలాంటి మార్పు రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ పచ్చగా ఉంటేనే పరిశ్రమను నమ్ముకున్న వాళ్లు ఆనందంగా ఉంటారు.
కృష్ణ భగవాన్ : రెండు రాష్ట్రాల ప్రేక్షక దేవుళ్లు మా సినిమాలను ఆదరిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కడున్నా అభివృద్ధి చెందాలన్నదే నా అభిమతం.
ప్రశ్న : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు? ప్రస్తుతం ఏఏ సినిమాల్లో నటిస్తున్నారు?
రఘుబాబు : ఇప్పటి వరకు 300 సినిమాల్లో నటించాను. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నాను.
కృష్ణ భగవాన్ : 300 సినిమాలకు పైగా నటించాను. నేను లోకల్, వైశాఖం , జగన్మోహిని చిత్రాల్లో నటిస్తున్నాను.
ప్రశ్న : సినీ పరిశ్రమలో మీరు సాధించాల్సింది ఏమైనా ఉందా?
రఘుబాబు : నాకు దర్శకత్వం చేయాలంటే చాలా ఇష్టం. అయితే అవకాశం రావాలి కదా.
కృష్ణ భగవాన్ : తెలుగులో మంచి కమెడియన్ గా రాణించి పేరు తెచ్చుకోవడం ఒక్కటే నాకున్న లక్ష్యం.
Advertisement