రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.260 కోట్లు
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.260 కోట్లు
Published Sat, Dec 3 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
చింతలపూడి : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం రూ.260 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానంలో శుక్రవారం ఖేలో ఇండియా నియోజకవర్గస్థాయి పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులతో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, మొగల్తూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రెండోదశలో జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ ఏడాది ఉత్తమ పీఈటీగా ఎంపికైన కలరాయనగూడెం జెడ్పీ హైస్కూల్ పీఈటీ ఎండీ యూసుఫ్‌ను మంత్రి సభలో సత్కరించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఏ అజీజ్, సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, వైస్ ఎంపీపీ గుత్తా వెంకులు, తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ పాల్గొన్నారు.
Advertisement