అక్రమంగా తరలిస్తున్న రేష న్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేష న్ బియ్యం పట్టివేత
Published Fri, Nov 4 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
చింతలపూడి : అక్రమంగా లారీలో తరలిస్తున్న రేష న్ బియ్యాన్ని చింతలపూడి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. స్థానిక గురుభట్లగూడెం రోడ్డు సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 16 టీటీ 5947 నంబర్ గల లారీలో 14.5 టన్నుల రేష న్ బియ్యం ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ బియ్యం స్థానిక వ్యాపారి ఎం.ఉమామహేశ్వరరావుకు చెందినవిగా విచారణలో తెలిసినట్లు ఎస్‌ఐ సైదా నాయక్ వివరించారు. శివాపురం గ్రామం నుంచి తూర్పు గోదావరిజిల్లా కాకినాడకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్టు వెల్లడించారు. బియ్యంతో సహా లారీని స్వాధీనం చేసుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో గత వారం రోజుల్లో మూడుసార్లు అక్రమ రేష న్ బియ్యం పట్టుబడటం విశేషం. అధికారులు వరుస దాడులు జరుపుతున్నా.. వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి రోజూ ఏదో దారిలో రేషన్‌స బియ్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రేష న్ షాపుల్లో తనిఖీలు
ఉండ్రాజవరం (తణుకు టౌ న్) : ఉండ్రాజవరంలోని 2వ నంబర్ రేష న్ షాపుపై విజిలె న్‌స అధికారులు దాడి చేశారు. అధికంగా ఉన్న సరుకులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం విజిలె న్‌స తహసీల్దార్ శైలజ ఆధ్వర్యంలో విజిలెన్‌స బృందం రేషన్ షాపును తనిఖీ చేసి రికార్డుల కంటే అధికంగా ఉన్న 400 కిలోల బియ్యాన్ని, 158 లీటర్ల కిరోసిన్, నాలుగు కిలోల పంచాదారను స్వాధీనం చేసుకున్నట్లు మండల సివిల్ సప్లయ్స్ అధికారి .ప్రసాదరావు తెలిపారు. తనిఖీలలో విజిలెన్‌స సిబ్బంది జయప్రసాద్, వీఆర్‌వో ఐ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement