తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘దాసరి’
లాలాపేట (హైదరాబాద్‌సిటీ): ప్రముఖ దర్శకులు, నిర్మాత దాసరి నారాయణరావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఆయన సాధించిన ఎన్నో విజయాలకు గాను రికార్డ్స్‌లో ఆయన పేరును నమోదు చేసినట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తెలిపారు.
ఇటీవల జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో నమోదు పత్రాన్ని అందజేశామన్నారు. గురువారం లాలాపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో వెంకటాచారి ఈ మేరకు వెల్లడించారు.