chirla jaggireddy
-
ముద్రగడ ఇంటిపై దాడి హేయమైన చర్య : జగ్గిరెడ్డి
-
తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం: చిర్ల జగ్గిరెడ్డి
-
కలియుగ కుంభకర్ణుడు.. మందు కొట్టి నిద్రపోతున్న చంద్రబాబు.. జగ్గిరెడ్డి కామెంట్స్
-
ఇసుక స్టాక్ పాయింట్లో టిడిపి అక్రమాలను బయటపెట్టిన జగ్గిరెడ్డి
-
ఎన్నికల ఫలితాలపై జగ్గిరెడ్డి రియాక్షన్
-
బీసీ లపై నిజంగా ప్రేమ ఉంటే ఈ ఒక్క పని చెయ్యి
-
సామాజిక సాధికారతకు జై కొట్టిన కొత్తపేట
సాక్షి అమలాపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన సామాజిక సాధికారతకు కొత్తపేట జై కొట్టింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పోటెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలిరావడంతో కొత్తపేట మెయిన్ రోడ్డు జన గోదావరిని తలపించింది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావడం గమనార్హం. ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. యువత మోటార్ సైకిల్ ర్యాలీతో యాత్రను అనుసరించారు. ప్రజలు పూలు జల్లుతూ భారీ గజమాలలతో ఎదురేగి యాత్రకు స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కొత్తపేట సభలో పాల్గొన్నారు. సీఎం జగన్ సామాజిక విప్లవం, సంక్షేమ పాలనను వివరించినప్పుడు సభకు హాజరైన ప్రజలు హర్షధ్వానాలు చేశారు. సామాజిక న్యాయం చేసింది జగన్ ఒక్కరే: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీలకు అతీతంగా పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ సామాజిక న్యాయం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే నని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో వారి వాళ్లకు, ఆయన పార్టీ వాళ్లకు మాత్రమే పని చేయాలని చెప్పారన్నారు. సీఎం జగన్ మాత్రం కులం, మతం, పార్టీలు అని చూడకుండా ప్రతి పేదవాడికీ మేలు చేయాలని చెప్పారని, అదే చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషి నభూతో నభవిష్యతి అని చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీర మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎంపీలు అయ్యారంటే అందుకు జగన్ కారణమన్నారు. ఇది దేశంలోనే ఒక చరిత్ర: మంత్రి చెల్లుబోయిన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సీఎం జగన్ ఈ వర్గాలను అక్కున చేర్చుకున్నారని మంత్రి చెల్లుబోయిన చెప్పారు. చంద్రబాబు పాలనలో వివక్షకు గురైన అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి, సంక్షేమ పథకాల ద్వారా వారి అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అన్నారు. పేదలవైపు ఉన్నది జగన్ ఒక్కరే: శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు రాష్ట్రంలో పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న పోరాటంలో పేదల వైపు ఉన్నది జగన్ ఒక్కరేనని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు చెప్పారు. దళితులు, అణగారిన వర్గాల వారికి ఉన్నత పదవులు అందించి, ఈ వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ చర్యలు చేపట్టారని వివరించారు. జగన్ గెలుపు మన అవసరం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవసరమని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఇంతమంది వెనుకబడిన, దళిత వర్గాల వారం వేదిక మీద ఉన్నామంటే సీఎం జగనే కారణమని అన్నారు. వెనుకబడిన వారిని జగన్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా గుర్తించారని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంతోపాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను సీఎం జగన్ అందిస్తున్నారని, దీని వల్ల వారి భవిష్యత్తు ఉన్నతంగా మారుతోందని వివరించారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సచివాలయ వ్యవస్థ: ఎంపీ మార్గాని భరత్ గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ చెప్పారు. ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు తేవడంలో జగన్ ఒక శక్తిలా పని చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతారో తీసేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా పాజిటివ్
సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్యేకి కరోన సోకింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గిరెడ్డి తెలిపారు. నెగెటివ్ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. -
ఎల్లో మీడియా నా మాటలను వక్రీకరించింది
-
పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) (ఛైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను, అలాగే ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్‌గా రాజన్న దొర, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి చైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డితో పాటు సభ్యులుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నియమించారు. పబ్లిక్ అకౌంట్ కమిటి సభ్యులుగా: 1. పయ్యావుల కేశవ్(చైర్మన్), 2. సంజీవయ్య కిలిబెటి, 3. కోలగట్ల వీరభద్ర స్వామి, 4. మేరుగు నాగార్జున, 5. భూమన కరుణాకర్‌రెడ్డి 6. కరణం ధర్మశ్రీ 7. జోగి రమేష్, 8. కెవి. ఉషశ్రీ చరణ్, 9.కాటసాని రాంభూపాల్ రెడ్డి, 10. బీద రవీచంద్ర, 11. డి. జగదీశ్వరరావు, 12. బాలసుబ్రమణ్యం, ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా: 1. రాజన్న దొర పీడిక(చైర్మన్), 2. అమర్నాథ్ గుడివాడ, 3. రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, 4. కిరణ్ కుమార్ గొర్లె, 5. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, 6. అనిల్ కుమార్ కైలే, 7. మదిశెట్టి వేణుగోపాల్, 8. మండలి గిరిధర రావు, 9. ఆదిరెడ్డి భవాని, 10. దువ్వారపు రామారావు, 11. పరుచూరి అశోక్‌బాబు, 12. వెన్నపూస గోపాల్‌రెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా: 1. చిర్ల జగ్గిరెడ్డి(చైర్మన్) 2. గ్రంధి శ్రీనివాస్, 3. కిలారి వెంకటరోశయ్య, 4. జొన్నలగడ్డ పద్మావతి, 5. అన్నా రాంబాబు, 6. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 7. రవీంద్రనాథ్‌రెడ్డి, 8. చంద్రశేఖర్‌రెడ్డి, 9. వాసుపల్లి గణేష్ కుమార్10. వెంకట సత్యనారాయణ రాజు, 11. గుంజపాటి దీపక్‌రెడ్డి, 12. సోము వీర్రాజు -
వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం
ఆత్రేయపురం: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీకీ అనుకూల పవనాలు వీస్తున్నాయని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఆత్రేయపురం మండలం ర్యాలిలో ఇంటింటా పర్యటించి ప్రజలను ఫ్యాన్ గుర్తుపై తనను, ఎంపీ అభ్యర్థిగా చింతా అనురాధకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ పర్యటనలో జగ్గిరెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. ర్యాలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు పాలన అవినీతిమయమన్నారు. పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఏమాత్రం శ్రద్ధ చూపని చంద్రబాబు ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసి గెలవాలనుకుంటున్నారని ప్రజలు గ్రహించాలన్నారు. డ్వాక్రా గ్రూపుల మహిళలకు 1.92 లక్షలు ఎగ్గొట్టి కేవలం ప్రతి మహిళ ఖాతాలో రూ.10 వేలు దఫదఫాలుగా వేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అలాగే నియోజకవర్గంలో అధికార పార్టీనేతలు గ్రూపులుగా ఏర్పడి అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇతర సంక్షేమ పథకాలు కొల్లగొట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియా నడిపి ప్రజల సొమ్ములు దోచుకున్నారని ఆరోపించారు. గ్రామంలో పీఎస్‌రెడ్డి జయపాల్ స్వగృహం వద్ద దివంగతనేత వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే దళిత వాడలో వైఎస్సార్సీపీ మండల బూత్ కమిటీ మేనేజర్ కప్పల శ్రీధర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, మాజీ సర్పంచ్ పేర్చేర్ల పుల్లంరాజు వర్మ, రూరల్ బ్యాంక్ అధ్యక్షుడు పుల్లంరాజు, వైఎస్సార్సీపీ నాయకులు బోణం సాయిబాబు, మెర్ల వెంకటేశ్వరరావు, ఈలి శ్రీరామచంద్రమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ పార్టీల నుంచి వైఎస్సార్సీపీలో పలువురి చేరిక మండలంలోని ర్యాలిలో సోమవారం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ర్యాలికి చెందిన పసలపూడి వెంకట్, నరుకుల నరసింహమూర్తి, వెలిగేటి దానయ్య, బుడ్డిగ వీరపండు, శ్రీను, దానయ్య, గోవిందు, అయ్య ప్ప, నర్సయ్య, నాగయ్య, రాంబాబుతో పాటు సుమారు 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరిని ఎమ్మె ల్యే చిర్ల జగ్గిరెడ్డి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బండారు స్వగ్రామంలో జగ్గిరెడ్డికి జన నీరాజనం వాడపాలెం (కొత్తపేట): వైఎస్సార్సీపీ నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు స్వగ్రామం వాడపాలెం ప్రజలు నీరాజనాలు పట్టారు. జగ్గిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడపాలెం చేరుకోగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఎదురేగి అఖండ స్వాగతం పలికారు. పూలమాలలతో ముంచెత్తి, బ్రహ్మరథం పట్టారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు గనిశెట్టి చంద్రశేఖర్, గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సాగిన ప్రచారంలో అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. ప్రధాన గ్రామాల్లోని రోడ్లలో ప్రచారరథంపై రోడ్‌షో నిర్వహించగా, పక్క వీధుల్లో కాలినడకన ఇంటింటి ప్రచారం చేసి ప్రజలకు జగ్గిరెడ్డి ముకుళిత హస్తాలతో నమస్కరిçస్తూ ఓట్లను అభ్యర్థించారు. పలు వీధుల్లో మహిళలు ఇళ్లు నుంచి బయటకు వచ్చి మరీ మద్దతు తెలిపారు. ట్రస్ట్ భూములు అమ్ముకోవడమే ప్రజాసేవా? జగ్గిరెడ్డి పేద ప్రజలు, విద్యార్థుల కోసం దాత జంపా వీరభద్రరావు ఇచ్చిన భూములను సెంటు రూ.3, 4 లక్షలకు అమ్ముకోవడమే స్థానిక టీడీపీ నాయకుడు ప్రజా సేవా? అని వైఎస్సార్సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి, టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావును ఉద్దేశించి విమర్శించారు. వాడపాలెం దేవీ సెంటర్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు అధికారానికి దూరం చేసినా, టీడీపీ ప్రభుత్వ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన తండ్రి సోమసుందరరెడ్డి హయాంలో ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. దాత ఇచ్చిన భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచకుండా స్థానిక టీడీపీ నేత కైంకర్యం చేశారని ఆరోపించారు. బిళ్లకుర్రు విద్యుత్ సబ్‌స్టేషన్ షిప్టు ఆపరేటర్ పోస్టులను రూ.5, 7 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ఆఖరి ఏడాది వచ్చిన ఇళ్లు అర్హులకు మంజూరు కాలేదని, ఒకటీ, రెండూ ఇచ్చినా బిల్లులు కూడా ఇవ్వలేదన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో తన వెంట ఉన్న కాపులు ఉద్యమంలోకి వెళితే అడ్డుచెప్పలేదన్నారు. వారిపై టీడీపీ నేతలు కేసులు పెట్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమ ఫలి తంగా ఏర్పడిన కాపు కార్పొరేషన్ ద్వారా ఉద్యమ సమయంలో ఇంట్లో కూర్చు న్న వారికి, ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను విమర్శించిన వారికి రుణాలు వచ్చాయని, కడుపుకాలిన కాపు సోదరులు రుణాలు కోరితే రూ.10, రూ.15 వేలు డిమాండ్ చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జగన్ సీఎం అయ్యాక అర్హులైన కాపులకు, బీసీలకు రూ.వేల కోట్లతో రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటార ని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సం యుక్త కార్యదర్శి జి.డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎం.గం గాధరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, ఆ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ, బి.కృష్ణమూర్తి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎన్.భీమరాజు, పార్టీ నాయకులు మట్టా బాబ్జి, పెదపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక వానపల్లి సాంబశివపేట గ్రామంలో టీడీకి చెందిన పెచ్చెట్టి దుర్గాప్రసాద్, కోరిమిల్లి శ్రీనివాసరావు సహా 25 మంది వైఎస్సార్సీపీ నాయకుడు వనుము నాగేంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి జగ్గిరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా స్వాగతం పలికారు. టీడీపీ కవ్వింపు చర్యలు.. పోలీసుల రంగ ప్రవేశం వాడపాలెంలో వైఎస్సార్సీపీ ప్రచార సమయంలో స్థానిక టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. జగ్గిరెడ్డి ప్రచారంలో, దేవీ సెంటర్లో ప్రసంగం సమయంలో టీడీపీ ప్రచార వాహనాలు అడ్డుగా మళ్లించడం, ఆ ప్రచార వాహనాలను అక్కడే నిలపి ఆ పాటలతో కవ్వింపుకు పాల్పడ్డారు. ఈ సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దాంతో టీడీపీ ప్రచార వాహనాలను అక్కడి నుంచి మళ్లించారు. టీడీపీ యువ నేతలు వైఎస్సార్సీపీలో చేరిక ఆలమూరు: గ్రామంలో పలువురు టీడీపీ యువజన విభాగం నేతలు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన టీడీపీ యాదవ సంఘం విభాగం అధ్యక్షుడు గంగుల ఫణీంద్రయాదవ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా అహ్వానించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం జగన్ ప్రకటించిన నవరత్నాలు, నియోజకవర్గ సమస్యలపై జగ్గిరెడ్డి పోరాడుతున్న తీరు పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు ఎ.జయరామ్, వి.సతీష్ తెలిపారు. వైఎస్సార్సీపీ గెలుపునకు అహర్నిశలు శ్రమిస్తామని వారు హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, మేకా అబ్బు, చల్లా నానాజీ, ఇ.గణేష్, ఎస్కె.షరీఫ్, వనుం సూరిబాబు, ఎస్కే అజీజ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ప్రచారం
-
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నివాసంలో విషాదం..
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తల్లి రాధాదేవి గురువారం మరణించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా రాధాదేవి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాబు మీడియా పిచ్చే ప్రాణాలు తీసింది!
-
బాబు మీడియా పిచ్చే అమాయకుల ప్రాణాలు తీసింది!
పుష్కరాలలో తొక్కిసలాటపై సభలో చర్చ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా పిచ్చితోనే గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. మరణించిన వారి కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం అందలేదని, ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ అంతా ఇంత కాదని సోమవారం ఏపీ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన సమాధానంపై జగ్గిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీవై సోమయాజులు నాయకత్వంలోని కమిటీ విచారణ జరుపుతోందని, త్వరలో నివేదిక వస్తుందని, ఈ పరిస్థితుల్లో సభలో చర్చించలేమని యనమల చెప్పారు. దీనిపై జగ్గిరెడ్డి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ విచారణ కమిటీకి జిల్లా కలెక్టర్ సీసీటీవీ ఫుటేజీ కూడా ఇవ్వలేదన్నారు. వీఐపీలకు కేటాయించిన ఘాట్లలో కాకుండా చంద్రబాబు పుష్కరఘాట్‌కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని చెప్పారు. తొక్కిసలాటకు కారణం చంద్రబాబేనన్నారు. ఘాట్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలున్నా సుమారు 90 వాహనాలు అక్కడకు చేరాయని వివరించారు. ఆ మేరకు ఫోటోలను కూడా సభలో ప్రదర్శించారు. చంద్రబాబు స్నానం చేసే ఘట్టాన్ని చిత్రీకరించడంతో పాటు పుష్కరాలపై డాక్యుమెంటరీ తీసేందుకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను నానా హంగామా చేశారని, ఓ ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై కమిషన్‌ను నియమించినా అటు జిల్లా కలెక్టర్ గానీ ఇటు ఇతర అధికారులు గానీ సహకరించడం లేదని, అటువంటప్పుడు ఈ కమిషన్‌తో ఏమి ప్రయోజనం ఉంటుందని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సార్లు సోమయాజులు కమిషన్ గడువును పొడిగించారని, ఇంకెంత కాలం సాగదీస్తారని నిలదీశారు. చంద్రబాబు మీడియా పిచ్చితో అనర్థం జరిగిందన్నప్పుడు సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య.. చంద్రబాబు తప్పేమీ లేదని, ప్రతిపక్ష సభ్యులు ప్రతి అంశానికీ వక్రభాష్యం చెబుతున్నారన్నారు. దీనిపై మంత్రి యనమల మాట్లాడుతూ తమ లెక్కల ప్రకారం 27 మందే చనిపోయారని, 50 మంది గాయపడ్డారని, అందరికీ ఆర్థిక సాయం అందించామని, ఇంకా ఎవరికైనా రాకుంటే వారి వివరాలను తన దృష్టికి తీసుకువస్తే అందిస్తామన్నారు. -
కన్నీరు తుడిచి..తోడుగ నిలిచి
సాక్షి, కాకినాడ : అన్నదాతల్లో మనోధైర్యం నింపుతూ..ఆపన్నులకు భరోసానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. నేలకొరిగిన పంటపొలాలను మోకాలు లోతు బురదలో దిగి స్వయంగా పరిశీలించారు. నేలనంటిన అరటితోటల్లోకి వెళ్లి రైతుల గోడు విన్నారు. తలతెగిన మొండి కొబ్బరిచెట్లను చూసి రైతన్నల వెతలు విన్నారు. హైదరాబాద్ నుంచి మధురపూడి చేరుకున్న జగన్ రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల మీదుగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వద్దకు వచ్చేసరికి వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. ఏడాదిన్నర తరువాత బెయిల్‌పై బయటకొచ్చాక తొలిసారిగా కోనసీమలో అడుగుపెట్టిన జగన్‌తో పాటు బాధితులను పరామర్శించేందుకు పార్టీ నేతలతో పాటు వేలాదిగా పార్టీ శ్రేణులు జనసైన్యంలా కదిలివచ్చాయి. పుట్టెడు కష్టాల్లోఉన్నప్పటికీ జననేతను చూసేందుకు..తమ గోడు చెప్పుకునేందుకు కోనసీమ వాసులు కూడా అడుగుడుగునా రహదారికి ఇరువైపులా బారులు తీరారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన నియోజకవర్గంలో హెలెన్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని జగన్‌కు వివరించారు. రావులపాలెం నుంచి కొత్తపేట మీదుగా వెలిశెట్టివారిపాలెంకు చేరుకున్న జగన్ నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించి అరటి రైతులతో మాట్లాడారు. రూ.70వేల నుంచి 80వేల వరకు పెట్టుబడులు పెట్టామని.. రూ.30 వేలు శిస్తు చెల్లించాల్సి ఉందని తీరా పంట చేతికందే సమయంలో హెలెన్ విరుచుకుపడడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం* అంటూ అరటి రైతులు గోడు చెప్పుకోగానే జగన్ చలించిపోయారు. ఈ ప్రభుత్వానికి మనసులేదు..మనసున్న వారు పాలకులుగా లేకపోవడం వల్లనే రైతులకీ దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి దారిపొడవునా బాధితులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు..యువకులు బారులు తీరడంతో కోనసీమ పర్యటన ఆద్యంతం సుమారు ఐదుగంటలకు పైగా ఆలస్యంగా కొనసాగింది. ఎక్కడికక్కడ బాధితులు బారులు తీరి కాన్వాయ్‌కు అడ్డపడడంతో ఆయన పర్యటన ముందుకు సాగడం కష్టమైంది. దారిలో నేలనంటిన పొలాలను చూపిస్తూ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే గొల్లబాబూరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌లు కోనసీమలో నూరు శాతం వరిపంట నాశనమైందని..వే లాది కొబ్బరిచెట్లు నేలకొరిగాయని, 10వేలకు పైగా ఎకరాల్లో అరటితోటలు పడిపోయాయని వివరించారు. ముక్కామల, నేదునూరిచినపాలెం, మొసలపల్లి, పాలగుమ్మి, నడిపూడి మీదుగా ఈదరపల్లి వంతెన వరకు కాలువగట్టు... బాధితులతో కిక్కిరిసిపోయింది. అడుగడుగునా వీరు జగన్‌కు ఎదురేగి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ కూడా ఓపిగ్గా బాధితులున్న ప్రతిచోటా ఆగి వారి వెతలు వింటూ సమస్యల పరిష్కారానికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. ఇళ్లు కూలిపోయాయి..కనీసం కేజీ బియ్యం కూడా ఇవ్వలేదు అంటూ ఎన్.చినపాలెం వద్ద లక్ష్మీనరసమ్మ అనే వృద్ధురాలు జగన్ వద్ద వాపోయింది. పాలగుమ్మి, నడిపూడి లాకుల వద్ద వృద్ధులను పలుకరించి ఁతుపాను సాయం అందిందా* అంటూ ఆరా తీయగా వారం రోజులవుతున్నా కనీసం ఎలాంటి సాయం అందలేదని వారు చెప్పారు. మంచిరోజులొస్తాయి.. ధైర్యంగా ఉండండి అమలాపురం మీదుగా ముమ్మిడివరం మండలం చెయ్యేరు అగ్రహారం చేరుకున్న జగన్ నేలకొరిగిన పంటపొలాల్లోకి దిగి పరిశీలించారు. రైతులు వారిస్తున్నా మోకాలు లోతు బురదలోకి దిగి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. నేను మూడు ఎకరాలు కౌలుకు చేశాను..నాకు ఇద్దరు పిల్లలు.. ఇల్లు..వాకిలి చివరకు మా ఆవిడ పుస్తెలతో సహా తాకట్టు పెట్టి సాగు చేశాను.. తీరా పంటచేతికొచ్చే సమయంలో ఇలా జరిగింది..నాకు చావు తప్ప మరోగత్యంతరం లేదంటూ గాలిదేవర పేరయ్యనాయుడు పురుగు మందు డబ్బా చూపిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేయగా, జగన్‌తో సహా అక్కడున్న వారంతా వారించి త్వరలోనే మీ అందరికి మంచిరోజులొస్తాయి ధైర్యంగా ఉండమని చెప్పారు. చెయ్యేరు వద్ద బర్ల చినవ్బైయి తాను మూడెకరాలు సాగు చేశాను. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు కనీసం ఎకరాకు బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు..రాజన్న పోయిన తర్వాత రైతుల బతుకులు అధ్వానంగా తయారయ్యాయంటూ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నీలం తుపాను సాయం అందిందా అని ఆరా తీయగా ఇప్పటి వరకు రాలేదని చెప్పాడు. తుపాను ప్రభావానికి గురైన రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. మీ తరఫున పోరాడతానని రైతులకు భరోసా ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమకారుడి కుటుంబానికి పరామర్శ అనంతరం ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో మృతిచెందిన కాట్రేనికోన మండల వైఎస్సార్ సీపీ సేవాదళ్ కన్వీనర్ గిడ్డి దివాకర్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో దివాకర్ చురుగ్గా పాల్గొన్నాడని, దీక్షలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తుల సాయి జగన్‌కు వివరించారు. తాను కూడా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నానని, మీకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ఆ కుటుంబానికి జగన్ భరోసానిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకే కాట్రేనికోన చేరుకోవాల్సి ఉన్నప్పటికీ రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నప్పటికీ వందలాది మంది బాధితులు, మహిళలు కాట్రేనికోన సెంటర్లో ఆయన రాకకోసం సుమారు ఐదుగంటల పాటు వేచి ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను జగన్‌కు వివరించారు. మత్స్యకారులు పట్టుబట్టడంతో కాట్రేనికోన సెంటర్లో ప్రసంగిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు.. రైతులు.. బాధితులు గోడు చెబుతుంటే గుండె తరుక్కు పోయింది ..ఇలాంటి ప్రభుత్వ పాలనలో నేను ఈ రాష్ర్టంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. కానీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎంకు సిగ్గులేకపోవడం బాధాకర మన్నారు. ఐదురోజులుగా వర్షాలు కురిసినా కనీసం ఏం జరిగిందని అడిగే నాధుడే లేరు.. కనీసం కేజీ బియ్యం కానీ. లీటర్ కిరసనాయిలు కానీ ఇవ్వలేదంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలలు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వస్తుంది.. మిమ్మల్నందర్ని ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. అనంతరం మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాదరావు ఇంటికి వెళ్లి ఆయన్ని పలుకరించి మోకా ఆనందసాగర్తో మాట్లాడారు. కొవ్వొత్తులు, బుడ్డిదీపాలతో ఎదురుచూపులు కోనసీమ అంతా అంధకారం అలముకున్నప్పటికీ తమ గోడు వినేందుకు వస్తున్న జగన్‌ను చూసేందుకు బాధితులు, మహిళలు బుడ్డిదీపాలు, కొవ్వొత్తులతో రోడ్డుపక్కనే నిలబడి ఎదురుచూశారు. జగన్ రాగానే వారి ఆవేదనను వెళ్లగక్కుకొని కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి 10.35 గంటల సమయంలో ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ తనకోసం వందలాదిగా వేచి ఉన్న బాధితులు, మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.