Chitram
-
చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. అంతటి విశిష్టత గల చైత్ర మాసంలో దాగున్న విశిష్టతలేంటో సవివరంగా తెలుసుకుందామా!. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది. ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లు, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది, ఉగాది అయ్యింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుంచి సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు. మనం సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. చైత్రంలో జరపుకునే పండుగలు.. చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు. చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం, ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామునిగా అవతరించిన రోజు.. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది. చైత్ర శుద్ధ అష్టమి –భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది. చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా, వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం. చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి ఆచరించే యత్నం చేద్దాం. సీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం. ఈ ఏడాది కొత్తగా అయోధ్యలో ఏర్పాటైన రామాలయంలో సీతా రాముల కళ్యాణం వైభవోపతంగా జరగనుండటం విశేషం. (చదవండి: Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ) -
చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకోవాలి?
చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నెలకు ఆ మాసం పేరు వస్తుంది. ఇది అందరికీ తెలిసింది. ఎన్నో పవిత్రమైన నెలలు ఉండగా పనిగట్టుకుని ఈ చైత్రంలోనే ఉగాది పండుగ ఎందుక జరుపుకుంటున్నాం. పైగా ఈ కాలం సూర్యుడి భగభగలతో ఇబ్బంది పడే కాలం కూడా అయినా కూడా ఈ నెలకే ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు. అదీగాక చైత్రమాసాన్ని విశిష్ట మాసం కూడా చెబుతారు. ఎందుకు అంటే.. నిజాని విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో కాబట్టి అంతకు మించి ఉత్క్రుష్టమైన నెల ఇంకొకటి ఉండదు. అలాగే అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. ''మాసానాం మార్గశీర్షోహం'' అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి, కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. పోనీ చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసం..ఇంతటీ పవిత్రమైన నెలలన్నింటిని పక్కన పెట్టి మరీ చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే.. చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసం వచ్చేటప్పటికీ శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మండగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. జీవిత సత్యం.. నిశితంగా చూస్తే..ఇది మనిషి జీవితానికి అర్థం వివరించేలా ఉంటుంది. ఎందుకంటే కష్టాలతో కడగండ్ల పాలై డీలా పడి ఉన్నప్పుడూ ఆగిపోకూడదని, సూచనే ఈ వసంతకాలం. ప్రకృతిలో ఆకురాలు కాలం ఉన్నట్లుగానే మనిషి జీవితంలో పాతాళానికి పడిపోయే ఆటుపోట్లు కూడా ఉంటాయని అర్థం. కాలగమనంతో అవి కూడా కొట్టుకుపోయి మనికి మంచి రోజులు అంటే.. వసంతకాలం చెట్లు చిగురించినట్లుగా జీవితం కూడా వికసిస్తుందని, చీకట్లుతోనే ఉండిపోదని చెప్పేందుకు. చలి అనే సుఖం ఎల్లకాలం ఉడదు, మళ్లీ కష్టం మొదలవుతుంది. ఇది నిరంతర్ర చక్రంలా వస్తునే ఉంటాయి. మనిషి సంయమనంతో భగవంతుడిపై భారం వేసి తాను చేయవలసిని పని చేస్తూ ముందుకు పోవాలన్నదే "కాలం" చెబుతుంది. "కాలం" చాలా గొప్పది. అదే మనిషిని ఉన్నతస్థాయికి తీసుకొస్తుంది. మళ్లీ అదే సడెన్‌గా అగాథంలోకి పడేసి పరిహసిస్తుంటుంది. అంతేగాదు కాలం ఎప్పుడూ మనిషిని చూసి నవ్వుతూ ఉంటుందట. ఎందుకంటే ఎప్పుడూ మనమీద గెలిచేది తానే (కాలమే) అని. ఎందుకంటే బాధ రాగానే అక్కడితో ఆగిపోతుంది మనిసి గమనం. వాటితో నిమిత్తం లేకుండా పయనం సాగిస్తేనే నువ్వు(మనిషి)అని కాలం పదే పదే చెబుతుంది. కనీసం ఈ ఉగాది రోజైన కాలానికి గెలిచే అవకాశం ఇవ్వొద్దు. కష్టానికే కన్నీళ్లు వచ్చేలా మన గమనం ఉండాలే సాగిపోదాం. సంతోషం సంబంరంగా మన వద్దకు వచ్చేలా చేసుకుందాం..! (చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?) -
ముఖచిత్రం మూవీ టీం తో " స్పెషల్ చిట్ చాట్ "
-
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’
టాలీవుడ్లో యువ నటుడు ఉదయ్ కిరణ్ది ఒక ప్రత్యేకమైన శకం. కెరీర్లో తొలి మూడు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించి.. ‘హ్యాట్రిక్ హీరో’ ట్యాగ్‌ను తన ముందర చేర్చుకున్నాడు. యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే తర్వాతి రోజుల్లో కెరీర్ డౌన్ ఫాలోతోనే కొనసాగి.. చివరికి ఉదయ్ కిరణ్ జీవితం విషాదంగా ముగిసింది. అయితే ఏ హీరోకైనా కెరీర్లో ఫస్ట్ మూవీ ప్రత్యేకం. అలాగే ఉదయ్‌కు కూడా ‘చిత్రం’ ఉంది. ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... వెబ్‌డెస్క్: ‘చిత్రం.. ది పిక్చర్’ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. కొత్త-పాత ఆర్టిస్టులు, కొత్త టెక్నిషియన్ల కలయికతో రూపుదిద్దుకుంది చిత్రం. కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆర్పీ పట్నాయక్ అందించిన ఆడియో సాంగ్స్‌తో సగం హిట్ సాధించగా, తేజ యూత్‌ఫుల్ సబ్జెక్ట్ ప్రజంటేషన్‌తో సెన్సేషన్ హిట్ అయ్యింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్, చిత్రం శీను&కో.. ఇలా ఎందరో ఆర్టిస్టుల కెరీర్‌కు ఈ మూవీ ఒక పాథ్‌ను ఏర్పరిచింది. ఫ్రెండ్ నుంచి.. నిజానికి ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కంటే ముందే వేరే కుర్రాడిని హీరోగా అనుకున్నాడట డైరెక్టర్ తేజ. ఈ విషయాన్ని స్వయంగా తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉదయ్ కిరణ్ ముందుగా ఫ్రెండ్స్‌లో ఓ క్యారెక్టర్. హీరోగా చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గడంతో.. ఉదయ్‌ను హీరోగా ముందుకు తెచ్చాడు తేజ. అయితే మళ్లీ ఆ కుర్రాడు ముందుకు రావడంతో.. ఉదయ్‌ను మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్‌కే సెట్ చేశారు. అయితే షూటింగ్‌కి సరిగ్గా ముందురోజే మళ్లీ ఆ వ్యక్తిని వద్దనుకుని.. తేజ ఉదయ్ కిరణ్‌నే హీరోగా ఫైనలైజ్ చేశాడు తేజ. ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్ కిరణ్ తడబడడంతో.. పక్కకు తీసుకెళ్లి తన స్టైల్లో క్లాస్ పీకాడట తేజ. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తనకు(తేజ) కావాల్సినట్లుగా యాక్ట్ చేయడం, ‘చిత్రం’ సూపర్ హిట్ కావడం జరిగిపోయానని తేజ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. సబ్జెక్ట్ కొత్తదే, అయినా.. మిడిల్ క్లాస్ కుర్రాడు రమణ(ఉదయ్ కిరణ్), ఫారిన్ రిటర్ని జానకీ(రీమాసేన్).. ఈ ఇద్దరి టీనేజర్ల ప్రణయగాథే ‘చిత్రం’ థీమ్. టీనేజీ వయసులో ఇన్ఫాక్చుయేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది తనదైన ట్రీట్మెంట్తో ఇందులో చూపించాడు తేజ. పనిలో పనిగా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, అందమైన పాటలు అందించాడు. అయితే కొద్దిపాటి అడల్ట్ థీమ్ ఉండడం, టీనేజీలో గర్భం, పైగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ఈ మూవీ రావడంతో క్రిటిక్స్ కొద్దిపాటి విమర్శలు చేశారు. కానీ, యూత్ థియేటర్లకు పోటెత్తడంతో 42 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బంపర్ సక్సెస్ సాధించింది. అప్పటికి ఇరవై ఏళ్ల వయసున్న ఉదయ్ కిరణ్.. ఫ్లస్ టూ స్టూడెంట్ రమణ క్యారెక్టర్‌తో అలరించి చాక్లెట్ బాయ్ ట్యాగ్‌కు తొలి బీజం వేసుకున్నాడు. కన్నడలో 125రోజులు చిత్రం సినిమాను రీమా సేన్‌కు కోలీవుడ్‌లో దక్కిన కొద్దిపాటి గుర్తింపు కారణంగా డబ్ చేశారు. అయితే కోలీవుడ్ వెర్షన్ కోసం మణివణ్ణన్, సెంథిల్, ఛార్లీ, మనోరమా, కల్పనలతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు. ఇక 2001లో తెలుగు చిత్రం మూవీ కన్నడలో ‘చిత్ర’ పేరుతో రీమేక్ అయ్యింది. నాగేంద్ర ప్రసాద్, రేఖ వేదవ్యాస(ఆనందం ఫేమ్) లీడ్ రోల్లో నటించిన ఈమూవీ బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుని.. థియేటర్లలో 125 రోజులు ఆడింది. చదవండి: ఇరవై ఏళ్ల తర్వాత చిత్రం.. రిపీట్ -
కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్ తేజ
‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌కిరణ్, రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ మూవీ ఘన విజయంతో ఇద్దరూ స్టార్స్‌గా ఎదిగారు. ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి నిర్మాతలకు కాసులు కురిపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా `చిత్రం 1.1` సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో తేజ తన కొడుకు అమితవ్ తేజని హీరోగా పరిచయం చేయనున్నాడు. ఇందుకోసం విదేశాల్లో శిక్షణ కూడా ఇప్పించినట్లు సమాచారం. మరి అమితవ్ తేజకి ఈ సినిమా ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈనెల 18న ఈ చిత్రం షూటింగ్ పప్రారంభం కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. చదవండి: నిహారిక పోస్ట్‌పై భర్త షాకింగ్ కామెంట్స్ ! పుట్టిన రోజు నాడు భోరున ఏడుస్తున్న ఆర్జీవీ! -
45 మంది కొత్త వారితో 'చిత్రం' సీక్వెల్
డైరెక్టర్ తేజ గతేడాది రెండు సినిమాలు ప్రకటించాడు. ఒకటి గోపీచంద్‌తో 'అలిమేలుమంగ వేంకటరమణ' కాగా మరొకటి దగ్గుబాటి రానాతో 'రాక్షసరాజు రావణాసురుడు'. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్‌కు నోచుకోనేలేదు, అప్పుడే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. తొలి ప్రయత్నంలోనే తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన చిత్రం మూవీకి సీక్వెల్ "చిత్రం 1.1" తీస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో షురూ కానున్నట్లు పేర్కొన్నాడు. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా తేజ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపాడు. అంతే కాదు, ఇందులో 45 మంది కొత్త వాళ్లు నటించనున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా 2000 సంవత్సరంలో వచ్చిన 'చిత్రం' సినిమాతో తేజ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆర్పీ పట్నాయక్ కూడా ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నాడు తేజ. తన సినిమాల ద్వారా ఎందరో నటీనటులకు లైఫ్ ఇచ్చిన తేజ ఈసారి ఇండస్ట్రీకి ఎవర్ని పరిచయం చేస్తారనేది టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీక్వెల్ మరోసారి 'చిత్రం' మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. Will start shoot this Year! pic.twitter.com/VHVIJEJ2PT — Teja (@tejagaru) February 22, 2021 చదవండి: తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే బన్నీని పోలీసులు అలా వాడేసుకున్నారన్నమాట! -
అన్ని హర్రర్ సినిమాల కన్నా భిన్నంగా..
రాజ్‌బాల, మానస హీరోహీరోయిన్లుగా రమేష్ వీభూది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రం x’. శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ బ్యానర్లో, బేబీ రాజశ్రీ సమర్పణలో పొలం గోవిందయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. కొత్త దర్శకులైనా, మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి కంటెంట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. (ప్రభాస్ షూటింగ్ ఆగేది లేదు) నిర్మాత పొలం గోవిందయ్య మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరిగారికి ధన్యవాదాలు. డైరెక్టర్ చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. ఖచ్చితంగా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు రమేష్ వీభూది మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు ప్రేక్షకులు అన్ని భాషల్లో వచ్చిన ఎన్నో హర్రర్ ఫిలిమ్స్ చూసి ఉంటారు. మా సినిమా వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అవసరమైనచోట గ్రాఫిక్స్ కూడా వాడాము. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు. (భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న ‘అంగుళీక’) హీరో రాజ్ బాల మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాలో నాకు హీరోగా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. భయంకరమైన అడవిలో నెల రోజుల పాటు ఈ సినిమా కోసం పని చేశాము. చిత్రీకరణ పూర్తయింది. నటీనటులందరం ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించాము. సినిమా సూపర్‌గా వచ్చింది. పాటలు, ఫైట్స్ అదిరిపోతాయి’’ అన్నారు. ఈ చిత్రంలో పలాస శ్రీను, బాచి, సునీల్ రావినూతల, శ్యాం పిల్లలమర్రి తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె కావలి, మ్యూజిక్: శివ ప్రణయ్, డాన్స్: కపిల్ మాస్టర్, ఫైట్స్: అంజి మాస్టర్. -
ప్రతి వాకిలీ ఓ కేన్వాస్..ప్రతి గృహిణీ ఓ చిత్రకారిణి..
నఖచిత్ర ప్రదర్శనలో సామవేదం రవి పరసకు ప్రముఖుల అభినందనలు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘తెల్లవారితే భారతీయ గృహిణి తనింటి ప్రాంగణాన్ని కేన్వాస్‌గా చేసుకుని,అపురూపమైన ముగ్గులను తీర్చి దిద్దుతుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ కళాహృదయం ఉంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. బుధవారం నఖచిత్రకళాతపస్వి రవి పరస రూపొందించిన 999 నఖచిత్రాల ప్రదర్శన రివర్‌బే హోటల్ ఆహ్వానం సమావేశమందిరంలో జరిగింది. ముఖ్య అతిథిగా సామవేదం మాట్లాడుతూ యుగయుగాలుగా దివ్యత్వంతో ముడిపడిన కళలే కాలానికి ఎదురొడ్డి నిలిచాయన్నారు. భారతీయ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అన్నీ దైవత్వంతో ముడిపడినవేనన్నారు. తీసిపారేసే గోటితో కలకాలం నిలిచిపోయే చిత్రాలను సృష్టించిన రవి పరస అభినందనీయుడన్నారు. కళలు, సైన్సు, తత్త్వశాస్త్రం.. ఈ మూడూ కలిస్తేనే భారతీయ సంస్కృతి అని వివరించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ రవి పరస అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలని ఆకాంక్షించారు. డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ అరిపిరాల నారాయణరావు తదితరులు రవి పరస కృషిని అభినందించారు. స్వాగతవచనాలు పలికిన వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్ మాట్లాడుతూ నన్నయ విశ్వ విద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రవి పరస మాట్లాడుతూ నఖచిత్రకళ అతిప్రాచీనమైనదని, ఈ కళ అంతరించిపోకూడదని అన్నారు. తాను నఖచిత్రాలను చివరి వరకూ గీస్తూనే ఉంటానని ప్రకటించారు. ముఖ్య అతిథులు రవి పరసను సత్కరించారు. -
బతుకుచిత్రం 16th january 2016
-
సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య
సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని చనిపోయారు. గత రెండేళ్లుగా ఆయన అదే అపార్టుమెంటులోని 402 ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. ఉరేసుకునే సమయంలో ఆయన భార్య విషిత ఇంట్లో లేరు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరి వేసుకుని.. చనిపోయే ముందు ఉదయ్‌కిరణ్ ఇంట్లో వాళ్లకి కాకుండా.. తన స్నేహితులకు ఫోన్లు చేశారు. వాళ్లు మళ్లీ కాల్‌బ్యాక్ చేస్తే ఎంతకూ లిఫ్ట్ చేయలేదు. అనుమానించిన స్నేహితులు ఆయన ఇంటికి వెళ్లి చూడగా ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఉన్నట్టు తెలిపారు. వెంటనే ఉదయ్ కిరణ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కాగాస్నేహితులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉదయ్ కిరణ్ తెలిపినట్టు తెలిసింది. ఉదయ్ కిరణ్ ఫోన్ కు స్నేహితులు కాల్ బ్యాక్ చేయగా లిఫ్ట్ చేయలేదని.. వెంటనే ఆయన నివాసానికి వెళ్లి చూడగా ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఉన్నట్టు స్నేహితులు తెలిపారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సమాచారాన్ని అందుకున్న సినీ నటులు శ్రీకాంత్, ఆర్యన్ రాజేశ్, తరుణ్, ఇతర సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 తేదిన జన్మించారు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో ఎంగేజ్ మెంట్ జరిగినా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. నువ్వు నేను చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. -
తేజ ప్రేమకథ
ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘జయం’ లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో సాయిరామ్‌శంకర్ హీరోగా ‘1000 అబద్ధాలు’ నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ, తేజ దర్శకత్వంలోనే మరో సినిమా చేయబోతోంది. ఆ విశేషాలను నిర్మాత సునీత ప్రభాకర్ పాలడుగు తెలియజేస్తూ -‘‘ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ తేజ ఈ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. పాత, కొత్త తారాగణమంతా ఇందులో నటిస్తారు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి, 30 రోజుల్లో సినిమా పూర్తి చేయడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు.