chittem rammohan reddy
-
మక్తల్ నియోజకవర్గంలో అధికారం వహించేది ఎవరు?
మక్తల్ నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి మూడోసారి విజయం సాదించారు. గతంలో ఆయన ఒక ఉప ఎన్నికతో సహా రెండు సార్లు కాంగ్రెస్ఐ పక్షాన పోటీచేసి గెలిచారు. 2014లో కాంగ్రెస్ ఐ తరపున గెలిచి, తదుపరి పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ అభ్యర్దిగా తన సమీప ప్రత్యర్ది, ఇండిపెండెంట్ అభ్యర్ధి జలంధర్ రెడ్డిపై 48315 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. రామ్మోహన్ రెడ్డికి 78686 ఓట్లు రాగా, జలందర్ రడ్డికి 30371 ఓట్లు వచ్చాయి. మహకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకరరెడ్డికి దాదాపు 25,800 ఓట్లు వచ్చాయి. రామ్మోహన్ రెడ్డి మూడుసార్లు గెలిస్తే ఆయన తండ్రి నర్సిరెడ్డి గతంలో మూడుసార్లు గెలిచారు. రామ్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి డికె.అరుణ సోదరి అవుతారు. 2009 ఎన్నికలలో టిడిపి నేత దయాకరరెడ్డి, ఆయన భార్య సీత ఇద్దరూ గెలుపొంది చట్టసభకు వెళితే 2014లో ఇద్దరూ ఓటమి చెందారు. నారాయణ పేట నుంచి 2014లో మక్తల్‌కు మారిన మాజీ మంత్రి ఎల్లారెడ్డి కూడా ఓటమి చెందారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా రంగంలో దిగి వీరిద్దరిని ఓడిరచడం విశేషం. ఎల్లారెడ్డి గతంలో టిడిపిలో ఉండి 2014లో టిఆర్ఎస్లోకి మారినా ఓడిపోవలసి వచ్చింది. మక్తల్‌లో ఏడుసార్లు రెడ్డి సామాజికవర్గం, ఆరుసార్లు బిసి సామాజికవర్గాలు మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. రెండు సార్లు ఎస్.సి.నేతలు గెలిచారు. మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిసి పదిసార్లు టిడిపి మూడుసార్లు జనతా, జనతాదళ్, టిఆర్ఎస్ ఒక్కొక్కసారి గెలుపొందాయి. 1952, 57లలో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడ నుంచి కళ్యాణి రామచంద్రరావు మూడుసార్లు, సి. నర్శిరెడ్డి మూడుసార్లు గెలవగా, వై.ఎల్లారెడ్డి ఇక్కడ రెండుసార్లు, కొత్తగా ఏర్పడిన నారాయణపేటలో ఒకసారి గెలుపొందారు. నర్సిరెడ్డి 2009లో గెలిచాక నక్సల్స్ తూటాలకు బలెపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు రామ్మోహనరెడ్డి గెలిచారు. కాని 2009లో గెలవలేకపోయారు. తిరిగి 2014, 2018లలో గెలవగలిగారు. నర్శిరెడ్డి కుమార్తె డి.కె. అరుణ గద్వాల నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2014లో సోదరి, సోదరులైన అరుణ, రామ్మోహన్ రెడ్డిలు శాసనసభలో ఉన్నారు. ఇక్కడ గెలిచిన వారిలో ఇద్దరు మంత్రులు అయ్యారు. కళ్యాణి రామచంద్రరావు గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో ఉంటే, ఎల్లారెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 1952లో ఇక్కడ గెలిచిన శాంతాబాయి, కల్వకుర్తిలో రెండుసార్లు, హైదరాబాదులోని గగన్‌మహల్ ఒకసారి మొత్తంమీద నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. మక్తల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మక్తల్‌ను దత్తత తీసుకుంటా...
సాక్షి, మాగనూర్ (మక్తల్): మక్తల్ నియోజకవర్గాన్ని ద త్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని.. ఇది నా బాధ్యతగా తీసుకుంటానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే మండలం లోని పునరావాస గ్రామాలైన నేరడగం, ఉజ్జెల్లిల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించా రు. మక్తల్ టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం రాత్రి మాగనూరు మండల కేంద్రంలో గురువారం రా త్రి నిర్వహించిన రోడ్డు షోలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి, అవకాశవాదానికి నడుమ జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు ప్రజలు అభివృద్ధి వైపు నిలిచి రాంమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మండల సరిహద్దులో ఉన్న కృష్ణా నదీ జలాలను సమగ్రంగా ఉపయోగించుకుని రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చేది కారు.. కేసీఆరే ఊట్కూర్ (మక్తల్) : రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కారు.. వచ్చేది కేసీఆరేనని ప్రజలు అంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఊ ట్కూర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడా రు. మక్తల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. తెలం గాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత వి ద్యుత్ అందిస్తోందని చెప్పారు. అయితే, గత కాం గ్రెస్ ప్రభుత్వం మూడు గంటల కరెంటు ఇచ్చేవారని.. ఈసారి మహాకూటమి గెలిస్తే ఆరు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తారని తెలిపారు. ఇక తాము రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలకు పెంచనున్నట్లు తెలిపారు. అదే మహాకూటమి అధికారంలోకి వస్తే సమన్వయ సమితి సంఘాలు, రైతు పెట్టుబడి సాయం ఎత్తివేస్తామని చెబుతున్నందున ప్రజలు విజ్ఞతతతో ఆలోచించి ఓటు వేయాలని హరీశ్‌రావు కోరారు. ఊట్కూర్ పెద్ద చెరువుకు నీరు ఊట్కూర్ పెద్దచెరువుకు లిఫ్ట్ ద్వారా నీరు అందించి మండలంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ఊట్కూర్‌లో రైతు బజార్ ఏర్పాటు, బస్టాండ్ మరమత్తులు చేపడుతామని, అంబేద్కర్ భవన్‌కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం మోహన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ శంకర్‌రెడ్డి, స్టేట్ ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జెడ్పీటీసీలు సరిత మధుసూదన్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, చిట్టెం సుచరిత, విఠల్‌రావు ఆర్యతో పాటు ఎల్లారెడ్డి, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, సురేందర్, ఉజ్జెల్లి సూరి, అరవింద్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గోవిందప్ప పాల్గొన్నారు. -
దొరలపాలన అంతమవ్వాలి.. ప్రజాస్వామ్యం బతకాలి..
సాక్షి, అమరచింత : తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలనలో విసిగివేసారిన జనం దొరలపాలనకు చరమగీతం పలికి బహుజనులకే రాజ్యాధికారం అందించడానికి ముందుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం అమరచింతలో బీఎల్ఎఫ్ మక్తల్ నియోజకవర్గ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ అమరచింతలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు,నిధులు, నియామకాలు అంటూ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లను మింగాడని, నిధులను దోచుకున్నాడని నియామకాలను వదిలేశారని ఆరోపించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు ఇస్తానని, అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూంలను నిర్మించి ఇస్తానని ప్రగల్భాలు పలికి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్ర జాసంక్షేమాన్ని విస్మరించిన ఆయారాజకీయ పార్టీలు మరోమారు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి బీఎల్ఎఫ్ బలపర్చిన అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు. మక్తల్ నియోజకవర్గాన్ని పరిపాలించిన చిట్టెంరాంమోహన్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి వారిసొంత ఆస్తులను పెంచుకున్నారే తప్పా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదన్నారు. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం శోచనీయం అన్నారు. కొత్తమండలాలతో పాటు కొన్నిచోట్ల పాతమండలాల్లో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఏర్పాటు చేయలేని పాలకులను సాగనంపాలన్నారు. నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెంకట్రాంరెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి జీఎస్.గోపి, సీపీఎం సీనియర్ నాయకులు మహిమూద్, శ్యాంసుందర్, బుచ్చన్న, రమేష్, తిమ్మోతి, వెంకటేష్ పలువురు పాల్గొన్నారు. -
భర్త గెలుపు ‘పాట్లు’
సాక్షి, ఆత్మకూర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్దికోసం మక్తల్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెంరాంమోహన్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని చిట్టెంసుచరిత అన్నారు. ఆదివారం ఆత్మకూర్ పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసంధర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం రాంమోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారన్నారు. అభివృద్దికోసం మరోసారి కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. గుంటిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు చిట్టెం సుచరిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ.డాక్టర్ శ్రీధర్‌గౌడ్, సింగిల్‌విండో అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఎంపీటీసీ. గాయత్రి, నాయకులు మశ్చెందర్‌గౌడ్, రామక్రిష్ణ, రియాజ్, జమాల్, శ్రీను పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతే టీఆర్ఎస్ ధ్యేయం
సాక్షి, మక్తల్: పేదల అభ్యున్నతే టీఆర్ఎస్ ధ్యేయమని ఇచ్చిన మాట నెరవేరుస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం గ్రామాల్లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంకేన్‌పల్లిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరారు. మక్తల్, నర్వ, ఊట్కూర్, మాగనూర్ మండాలాల్లోప్రజలు టిఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఎస్‌ఎస్‌టీసీ చైర్మన్ దేవరి మల్లప్ప, మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఎంపీటీసీలు రవిశంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి,గ్రామ రైతు సంఘం కోఆర్డినేటర్ సంయుక్తరెడ్డి, నర్సిరెడ్డి, రాంలింగం, మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మారుతిగౌడ్, ఆంజనేయులుగౌడ్, కె.శ్రీహరి పాల్గొన్నారు. కృష్ణా(మాగనూర్): మండల పరిధిలోని గుడెబల్లూర్‌లో ఆదివారం తాజామాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారనే అభివృద్ది సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు 200 మంది టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్సింహాగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు విజప్పగౌడ్, మక్తల్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆంబ్రేష్, విజయగౌడ్, శంక్రప్ప,తిమ్మప్ప పాల్గొన్నారు. మాగనూర్: మండల కేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సతీమణి చిట్టెం సుచరిత ప్రచారం చేశారు. సరిత మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పూలవతి, పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, సూగిరెడ్డి, శ్రీనివాసులు, సూరి.సురేందర్, సుదర్శన్‌గౌడ్, డిజిల్ సాబణ్ణ, తదితరులు పాల్గొన్నారు. నర్వ: నియోజకవర్గంలో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జరగబోవు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చిట్టెం చాణిక్యారెడ్డి అన్నారు. ఆదివారం ఉందేకోడ్, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో జంగంరెడ్డిపల్లిలో 50 మంది యువకులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శేఖర్‌యాదవ్, విజయ్‌కుమార్, జనార్దన్‌రెడ్డి, రామన్‌గౌడ్, మాజీ సర్పంచు భగవంతు, మల్లేష్‌యాదవ్, మహేష్‌గౌడ్, నందు, రంగారెడ్డి, పాండు, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ లో చేరిన డీకే అరుణ సోదరుడు
హైదరాబాద్: మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం ఆయన సీఎం క్యాంపు ఆఫీస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును కలసి,,,ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్లోకి చేరేందుకు తననెవరూ ఒత్తిడి చేయలేదన్నారు. తన సోదరి డీకే అరుణ రాజకీయం వేరు, తన రాజకీయం వేరని చెప్పారు. డీకే అరుణ టీఆర్ఎస్ లో చేరారని.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారన్నారు. రామ్మోహన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. -
రారా.. తేల్చుకుందాం!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ప్రజాసమస్యలను చర్చించి పరిష్కారం చూపాల్సిన రచ్చబండ కార్యక్రమం నాయకుల కొట్లాటకు వేదికగా మారింది. తాము ప్రజలకు జవాబుదారిగా ఉండాలనే విషయాన్నే మరిచిపోయి బూతుపురాణం మొదలుపెట్టారు. ‘నీవెంత అంటే నీవెంత’ అంటూ ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. ‘రారా.. తేల్చుకుందాం!’ అని తొడగొడుతూ ఫ్యాక్షన్ సినిమా సీన్‌ను తలపించారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్నవారంతా నిశ్చేష్టులై వెనుదిరిగారు. సభావేదిక అరుపులు కేకలతో దద్దరిల్లింది. వెరసి ప్రజాప్రయోజన కార్యక్రమం రణరంగంగా మారింది. సోమవారం మండల కేంద్రమైన నర్వలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బాహాబాహీకి దిగారు. పత్రికల్లో రాయలేని భాష వాడుతూ ‘రారా తేల్చుకుందాం’ అంటూ ఒకరిపై మరొకరు గట్టిగా కేకలు వేయడంతో ప్రజలు అక్కడినుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ విడత రచ్చబండ కార్యక్రమంలో అధికారపార్టీ ఆమోదముద్రతో ముగ్గురు సభ్యులను ఎంపికచేసి వారు మాత్రమే వేదికపై కూర్చొనే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. నర్వలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నియమించిన సభ్యులతో మాట్లాడించే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డిపై తిరగబడ్డారు. అంతటితో ఆగకుండా నర్వలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు సమాచారం ఇవ్వడంతో ఆయన తన అనుచరులతో వేదిక వద్దకు వచ్చి నానా బీభత్సం సృష్టించారు. దీంతో అక్కడ కొద్దిసేపు యుద్ధవాతావరణ ఏర్పడింది. సభ వద్ద ఏర్పాటు చేసిన టెంట్, కుర్చీలు, చెప్పులు గాల్లో లేచాయి. దాదాపు గంటన్నర పాటు ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు దూషించుకుంటూ దాడులకు తెగబడ్డారు. చేయిదాటే పరిస్థితి కనిపించడంతో ఆత్మకూరు సీఐ గోవర్దన్గిరి, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ ఇద్దరు నేతలు రాజకీయం చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంతో ప్రజలు అసహనం వ్యక్తంచేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆత్మకూరులో అదేతీరు! అంతకుముందు ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సభకు హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు పరస్పరం గొడవపడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. తోపులాటలో సాక్షాత్తు మక్తల్ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్రిసభ్య కమిటీ పేరుతో కాంగ్రెస్ తరఫున ఆపార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన పేర్లనే కమిటీ సభ్యులుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ సభ్యులను వేదికపైకి పిలవాలని మాజీ ఎమ్మెల్యే తన వర్గీయులతో కలిసి పట్టుబట్టడంతో ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి ససేమిరా అన్నారు. తాను ప్రతిపాదించిన వారిపేర్లు ఏమయ్యాయని అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నేతలు సూచించిన వారిని వేదికపైకి పిలిచేది లేదంటూ ఎమ్మెల్యే తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ వర్గీయులు ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాలవారు ఘర్షణకు దిగారు. - అలాగే మాడ్గులలో త్రిసభ్య కమిటీ సభ్యులను మాత్రమే వేదికపైకి ఆహ్వానించి మిగిలిన సర్పంచ్‌లను పట్టించుకోకపోవడంతో పలువురు సర్పంచ్‌లు ఆగ్రహంతో ఊగిపోయారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను వేదికపైకి ఆహ్వానించాలంటూ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లుగౌడ్తో మిగిలిన వారు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీని రద్దుచేయాలని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వేదికపైకి దూసుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసంచేశారు. అప్పటికే వేదికపై ఉన్న టీడీపీ ఎమ్మెల్యే జి. జైపాల్‌యాదవ్‌తో మిగిలిన ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఉన్నా పరిస్థితిని అదుపుచేయలేకపోయారు.