Church shootings
-
Hamburg shooting: జర్మనీ చర్చిలో నరమేధం!
బెర్లిన్: జర్మనీలో నరమేధం చోటు చేసుకుంది. గురువారం రాత్రి హాంబర్గ్‌లోని ఓ చర్చిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి కారకులు ఎవరు? కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది. ఘటన నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు, స్థానికులను బయటికి రావొద్దని సూచించారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాంబర్గ్ యెహోవా విట్నెస్ సెంటర్ అది. మూడు అంతస్థుల భవనం. మొదటి ఫ్లోర్ నుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందంటూ విపత్తు హెచ్చరిక యాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించారు ఎవరో. ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. లోనికి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే.. కింది ఫ్లోర్లో రక్తపు మడుగుల్లో కొందరు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించారు. వాళ్లలో కొందరు అప్పటికే ప్రాణం కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పైఫ్లోర్‌లో ఓ వ్యక్తి మృతదేహాం పడి ఉండడాన్ని గుర్తించారు. బహుశా ఆ వ్యక్తే కాల్పులకు పాల్పడి ఉంటాడని, ఘాతుకం అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. కాల్పులకు పాల్పడింది అతనేనా? లేదా ఆ దుండగుడు పరారీలో ఉన్నాడా? అసలు కాల్పులకు ఎందుకు పాల్పడ్డారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు జర్మనీ మీడియా సంస్థలు చనిపోయింది ఆరుగురే అని చెప్తుండగా.. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు హైఅలర్ట్ జారీ చేసిన పోలీసులు.. స్థానికులను బయటకు రావొద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందాలని కోరారు. ఇదిలా ఉంటే.. జిహాదీలు, స్థానిక అతివాద గ్రూపుల దాడులతో జర్మనీ గత కొన్నేళ్లుగా దాడులకు గురవుతోంది. ప్రముఖంగా చెప్పుకోవాలంటే.. డిసెంబర్ 2016లో బెర్లిన్‌లోని ఓ క్రిస్మస్ మార్కెట్లో ఐసిస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడగా.. 12 మంది మరణించారు. ఇక ఫిబ్రవరి 2020లో హనౌ నగరంలో అతివాద సంస్థ వ్యక్తి ఒకడు జరిపిన కాల్పుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. -
గుండెను చీల్చుతూ తూటాలు దూసుకెళ్తున్నా..!
టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చర్చిలో ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి కెల్లీ విచక్షణరహిత కాల్పులకు తెగబడి 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ తల్లి తన పిల్లల్ని రక్షించుకునేందుకు వారికి రక్షణ కవచంగా నిలిచి ప్రాణాలు కోల్పోయినా అమ్మగా అందరి హృదయాల్ని గెలిచారు. ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడగా, మరో ఇద్దరు చిన్నారులు దుండగుడి కాల్పులకు బలైపోయారు. సదర్లాండ్ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో సుమారు 50 మంది ప్రార్ధనల్లో ఉండగా నల్ల దుస్తుల్లో వచ్చిన నిందితుడు కెల్లీ విచక్షణా రహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. చర్చిలో తన పిల్లలు బ్రూక్ (5), రైలాండ్ (5), ఎమిలీ, రిహన్నా (9)లతో పాటు జోయాన్ వార్డ్ అనే మహిళ ఉన్నారు. తన పేగుబంధాలను ఎలాగైనా దుండగుడి కాల్పుల నుంచి రక్షించుకోవాలనుకున్నారు వార్డ్. ఉన్మాది తమ వైపునకు రావడాన్ని గమనించిన ఆ తల్లి, ఎమిలీ, రైలాండ్, బ్రూక్‌లకు రక్షణ కవచంగా అడ్డుగా నిలవగా తుపాకీ తూటాలు ఆమె గుండెను చీల్చుకుంటు వెళ్తున్నాయి. తన పిల్లల్ని కాపాడుకోవాలన్న ఆరాటంలో తన ప్రాణాలు పోయిన పరవాలేదని భావించారు ఆ మాతృమూర్తి. కానీ ఈ దారుణఘటనలో తల్లి వార్డ్తో పాటు కూతుళ్లు బ్రూక్, ఎమిలీ మృతిచెందారు. వార్డ్, బ్రూక్‌లు చర్చిలోనే చనిపోగా, తీవ్రగాయాలపాలైన ఎమిలీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. కాల్పులు ప్రారంభం కాగానే తన పెద్ద కూతురు రిహన్నాను ఫ్లోర్ మీదకి నెట్టి అలాగే ఉండాలని తల్లి వార్డ్ చెప్పడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. వార్డ్ కుమారుడు రైలాండ్ కు బుల్లెట్ గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాలను వీరి ఫ్యామిలీ ఫ్రెండ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. -
టెక్సస్ కాల్పుల్లో 27కు చేరిన మృతులు
టెక్సస్: ఇటీవల అగ్రరాజ్యంలో జరిగిన రెండు ఉగ్రదాడులను మరిచిపోకముందే మరో దారుణం సంభవించింది. టెక్సస్‌లోని ఒక చర్చి నెత్తురోడింది. సుదర్లాండ్ స్ప్రింగ్స్ ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిపై ఆదివారం ఉదయం ఒక సాయుధుడు విచక్షణా రహి తంగా కాల్పులు జరిపాడు. దీంతో 27 మంది బలయ్యారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల పైబడిన వయోధికులు కూడా ఉన్నారు. ఒక గర్భిణి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగుడు చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరపగా అతడు తన తుపాకీని చర్చిలోనే వదిలేసి పారిపోయాడు. చర్చికి సమీపాన గల గ్వాడాలుపే కౌంటీలో తన వాహనంలోనే శవమై కనిపించాడు. పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇతణ్ని 26 ఏళ్ల డెవిన్ పి. కెల్లీగా గుర్తించారు. మృతుడు శాన్ అంటానియో సమీపంలోని కోమల్ కౌంటీకి చెందినవాడని అధికారులు తెలిపారు. ఇతడు గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసినట్టు సమాచారం. అయితే ఇది ఉగ్రవాదదాడి కాదని అమెరికా ప్రకటించింది. ఇదో భయంకరమైన దుశ్చర్య: ట్రంప్ టెక్సస్ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇదో భయంకరమైన దుశ్చర్య అని పేర్కొన్నారు. దేవుడి చెంతనే ఇలాంటి ఘోరం జరగడం చాలా బాధకరమని ట్రంప్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికన్లు అంతా ఏకమై.. బాధితులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పరిస్థితిని అక్కడి నుంచే సమీక్షిస్తున్నానని, టెక్సస్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. తుపాకుల నియంత్రణపై విలేకరులు ప్రశ్నించగా, సమస్య అది కాదని, అమెరికాలో మానసిక సమస్యలు అధికమన్నారు. కెల్లీ కూడా మానసిక సమస్యలతో ఇబ్బందిపడేవాడని ట్రంప్ వివరించారు. -
టెక్సాస్ చర్చిలో మారణహోమం
-
టెక్సాస్ చర్చిలో మారణహోమం
టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు విచక్షణరహిత కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారితో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సదర్లాండ్ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో సుమారు 50 మంది ప్రార్ధనల్లో ఉన్నారు. చర్చిలోకి నల్ల దుస్తుల్లో వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఓ స్థానిక వ్యక్తి అతన్ని అడ్డుకోవడంతో కొందరి ప్రాణాలైనా దక్కాయి. కాల్పుల ఘటన అనంతరం పారిపోతున్న ఆగంతుకుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. దుండగుడు గతంలో అమెరికన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన కెల్లీగా అధికారులు గుర్తించారు. 2014లో ఎయిర్‌ఫోర్స్ నుంచి అతన్ని తొలగించినట్లు తెలిసింది. అనంతరం కింగ్స్ విల్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో ‘బైబిల్ స్టడీస్’ను కెల్లీ బోధించినట్లు అతని లింక్డ్ఇన్ అకౌంట్ ద్వారా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకున్న ఉన్మాది.. ఫేస్బుక్లో ఏఆర్-15 స్టైల్ గన్ను పోస్టు చేశాడు. చర్చిపై కెల్లీ కాల్పులు జరిపిన తర్వాత శాన్ ఆంటోనియో పోలీసులు కే9 బాంబు స్వ్కాడ్‌తో ఉన్మాది ఇంట్లో సోదాలు నిర్వహించారు.