టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు విచక్షణరహిత కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారితో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సదర్‌లాండ్ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో సుమారు 50 మంది ప్రార్ధనల్లో ఉన్నారు. చర్చిలోకి నల్ల దుస్తుల్లో వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
ఓ స్థానిక వ్యక్తి అతన్ని అడ్డుకోవడంతో కొందరి ప్రాణాలైనా దక్కాయి. కాల్పుల ఘటన అనంతరం పారిపోతున్న ఆగంతుకుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. దుండగుడు గతంలో అమెరికన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన కెల్లీగా అధికారులు గుర్తించారు. 2014లో ఎయిర్‌ఫోర్స్ నుంచి అతన్ని తొలగించినట్లు తెలిసింది. అనంతరం కింగ్స్ విల్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో ‘బైబిల్ స్టడీస్’ను కెల్లీ బోధించినట్లు అతని లింక్డ్‌ఇన్ అకౌంట్ ద్వారా తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకున్న ఉన్మాది.. ఫేస్‌బుక్‌లో ఏఆర్-15 స్టైల్ గన్‌ను పోస్టు చేశాడు. చర్చిపై కెల్లీ కాల్పులు జరిపిన తర్వాత శాన్ ఆంటోనియో పోలీసులు కే9 బాంబు స్వ్కాడ్‌తో ఉన్మాది ఇంట్లో సోదాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment