Cilukuru Balaji
-
'కన్యావందనం’
♦ చిలుకూరులో వైభవంగా ఉత్సవం ♦ చిన్నారుల కాళ్లకు పసుపు, పారాణి రాసిన అర్చకులు ‘నారీ సర్వజగన్మయి’ ఉద్యమంలో భాగంగా శుక్రవారం చిలుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ‘కన్యావందనం’ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. - మొయినాబాద్ మొయినాబాద్: ‘‘సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణి.. విద్యారంభం కరి శ్యామి.. సిద్ధిర్భవత్ మేషద’’ అంటూ అర్చకులు సరస్వతీ స్తోత్రం జపిస్తూ.. మహాలక్ష్మి ప్రతిరూపాలైన చిన్నారుల కాళ్లకు పసుపు పారాణి పూశారు. సమాజంలో ఆడపిల్లలను మహాలక్షీ్ష్మదేవిగా పూజించి, గౌరవించాలనే సంకల్పంతో ‘నారీ సర్వజగన్మయి’ ఉద్యమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని చిలుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ‘కన్యావందనం’ కార్యక్రమాన్ని చేపట్టారు. వసంత పంచమి, చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టినరోజైన శుక్రవారం పాఠశాలలో 1,2వ తరగతి చదువుతున్న చిన్నారులను మహాలక్ష్మి దేవి ప్రతిరూపాలుగా అలంకరించారు. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త, చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్, అర్చకుడు సురేష్ పసుపు పారాణి పూశారు. అనంతరం మంగళహారతి ఇచ్చి మహాలక్ష్మీదేవిగా పూజించారు. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న మహాలక్ష్మి దినోత్సవంగా నిర్వహించాలని అర్చకుడు రంగరాజన్ అన్నారు. కన్యావందనం కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లలపట్ల రోజురోజుకూ గౌరవం తగ్గుతోందని, వారిపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇవన్నీ రూపుమాపేందుకు మహాలక్ష్మి ఉత్సవాన్ని చేపట్టామన్నారు. మహాలక్ష్మి ప్రతిరూపమైన ఆడపిల్లలను గౌరవంగా చూడాలని, పూజించాలని చెప్పారు. చిలుకూరులో ప్రారంభించిన ఈ కార్యక్రమం అన్నిచోట్ల చేపట్టాలన్నారు. ప్రస్తుతం వెయ్యిమంది మగపిల్లలు పుడితే 950 మంది ఆడపిల్లలు పుడుతున్నారని, 50 మంది ఆడపిల్లలు గర్భంలోనే నులిమేయబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టిన 950 మంది ఆడపిల్లలను కాపాడుకోవాలన్నారు. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందనే భావన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య, ఈఓపీఆర్డీ సునంద, సర్పంచ్ గున్నాల సంగీత, ఉపసర్పంచ్ నర్సింహగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14న మహాలక్ష్మి దినోత్సవంగా నిర్వహించాలి.. -
నేటి నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
మొయినాబాద్ (రంగారెడ్డి): చిలుకూరులోని బాలాజీ బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సాయంత్రం పుట్టమన్ను తెచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆలయ అర్చకులు పూర్తి చేశారు. శేష, హనుమంత, సూర్యప్రభ, గరుడ, గజ, పల్లకీ, అశ్వ వాహనాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతుడికి పెట్టే నైవేద్యాన్ని సంతానంలేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని.. ప్రసాదం స్వీకరించే మహిళలు ఉదయం 8 గంటలకే చిలుకూరు ఆలయానికి చేరుకోవాలని అర్చకుడు రంగరాజన్ తెలిపారు. -
అమ్మాయిని పూజించండి
చిలుకూరు బాలాజీ ఆలయంలో ఈ ఏడాది నుంచి ప్రతియేటా ఫిబ్రవరి 14న శ్రీమహాలక్ష్మీ దినోత్స వాన్ని జరుపబోతున్నాం. మన దేశంలో స్త్రీల పట్ల జరుగుతున్న దారుణాలకు పరిష్కారం చూపడానికే ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించాం. ఆలయంలో నేడు ఉదయం 10 గంటలకు చిన్న చిన్న అమ్మాయిలను అమ్మవారిలాగా అలంకరించి వారికి పసుపు పారాణి రాసి భక్తులతో కలసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయి స్తాం. ఈ పూజా విధానం ద్వారా స్త్రీకి ఆమె కోల్పో యిన గౌరవ మర్యాదలను తిరిగి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ‘‘ఈ ప్రపంచంలోని ప్రతి వనితా నా శరీ రమే. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, వికారంగా ఆలోచించడం కూడా సహించను’’ అంటున్నారు అమ్మవారు. కాబట్టి ఆడవాళ్లందరినీ అమ్మవారి రూపంగా గౌరవిద్దాం. ఫిబ్రవరి 14ను ఇకనుంచి ప్రేమికుల దినోత్సవంగా కాదు.. ఆడ పిల్లల ప్రతిరూపమైన మహాలక్ష్మీ దినోత్సవంలా జరుపుకుందాం. - చిలుకూరు బాలాజీ ఆలయ కమిటీ -
సినిమాలో బ్రహ్మోత్సవం
చిలుకూరు బాలాజీ ఆలయ స్థల పురాణం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చిలుకూరు బాలాజీ’. అల్లాణి శ్రీధర్ దర్శకుడు. ఇందులో వెంకటేశ్వరస్వామిగా ‘శ్రీభాగవతం’ ఫేమ్ సునీల్‌శర్మ నటించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏకాదశ ప్రదక్షిణాలతో భక్తులకు మహర్దశను కలిగించే మహోన్నత పుణ్యక్షేత్రం చిలుకూరు. ఈ స్థల పురాణంలో ఎన్నో ఆసక్తికరమైన ఘట్టాలున్నాయి. నాలుగొందల ఏళ్ల క్రితం భక్తుని కోరిక మేరకు ఏడుకొండలు దిగివచ్చి చిలుకూరులో వెలిసిన కోనేటి రాయని వృత్తాంతం ప్రేక్షకుల్ని తన్మయానికి లోను చేస్తుంది. ‘కదిలింది పాదం’ అనే పాటలో వైకుంఠం నుంచి శ్రీవారు తిరుమల గిరుల్లో కొలువవ్వడం, తర్వాత స్వయంగా ఆయనే... చిలుకూరు చేరుకోవడం లాంటి సన్నివేశాలు గ్రాఫిక్స్‌లో తీశాం. ఆ పాట సినిమాకే హైలైట్. చిలుకూరులో ప్రధాన ఆర్చకులైన కోవిదుల సౌందర్‌రాజన్ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి రచన జరిగింది. ప్రస్తుతం చిలుకూరులో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను చిత్రీకరిస్తున్నాం. మగధీర, రుద్రమదేవి చిత్రాలకు గ్రాఫిక్స్ అందించిన మైండ్ విజన్ సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తోంది. మే నెలలో పాటలను, జూన్ తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుమన్, సాయికుమార్, ఆమని, భానుశ్రీ మెహ్రా తదితరులు ఇందులో ముఖ్య తారలు.