అమ్మాయిని పూజించండి | Pujincandi girl | Sakshi
Sakshi News home page

అమ్మాయిని పూజించండి

Published Sat, Feb 14 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

Pujincandi girl

చిలుకూరు బాలాజీ ఆలయంలో ఈ ఏడాది నుంచి ప్రతియేటా ఫిబ్రవరి 14న శ్రీమహాలక్ష్మీ దినోత్స వాన్ని జరుపబోతున్నాం. మన దేశంలో స్త్రీల పట్ల జరుగుతున్న దారుణాలకు పరిష్కారం చూపడానికే ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించాం. ఆలయంలో నేడు ఉదయం 10 గంటలకు చిన్న చిన్న అమ్మాయిలను అమ్మవారిలాగా అలంకరించి వారికి పసుపు పారాణి రాసి భక్తులతో కలసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయి స్తాం. ఈ పూజా విధానం ద్వారా స్త్రీకి ఆమె కోల్పో యిన గౌరవ మర్యాదలను తిరిగి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ‘‘ఈ ప్రపంచంలోని ప్రతి వనితా నా శరీ రమే. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, వికారంగా ఆలోచించడం కూడా సహించను’’ అంటున్నారు అమ్మవారు. కాబట్టి ఆడవాళ్లందరినీ అమ్మవారి రూపంగా గౌరవిద్దాం. ఫిబ్రవరి 14ను ఇకనుంచి ప్రేమికుల దినోత్సవంగా కాదు.. ఆడ పిల్లల ప్రతిరూపమైన మహాలక్ష్మీ దినోత్సవంలా జరుపుకుందాం.

-  చిలుకూరు బాలాజీ ఆలయ కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement