‘సిస్కోసిస్టమ్’లో ఇంజనీర్‌గా హరీశ్చంద్ర
ఏడాదికి రూ 56 లక్షల వేతనం
అమెరికాలో ఉద్యోగం
ఖమ్మం: అమెరికాకు చెందిన సిస్కో సిస్టమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఖమ్మంలోని కవిరాజ్‌నగర్‌కు చెందిన విద్యార్థి ఊట్ల హరీశ్చంద్ర ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. హరీశ్ ఐఐ టీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతుండగానే.. మంగళవారం కాలేజీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఏడాదికి రూ.56 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించాడు. హరీశ్చంద్ర తండ్రి జగన్ మోహన్‌రావు ఖమ్మంలోని జాతీయ బాల కార్మిక విముక్తి పథకంలో ఫీల్డ్ ఆఫీసర్‌గా, తల్లి ప్రమీలారాణి నేలకొండపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తున్నారు. వారి పెద్ద కుమారుడైన హరీశ్ పదో తరగతి వరకు నగర శివారులోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదివి ప్రథమ స్థానంలో నిలిచాడు. హరీశ్ చంద్ర చదువుతోపాటు లాన్ టెన్నిస్‌లో పలు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు కైవసం చేసుకున్నాడు.
మేఘన మనమ్మాయే...
కూసుమంచి: గుగూల్ ప్రపంచంలో సాఫ్ట్వేర్ డెవలపింగ్ ఇం జనీర్‌గా ఎంపికై ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకున్న తోటకూరి శ్రీమేఘన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజుల్‌రావుపేట వాసి కావడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తోటకూరి శ్రీనివాస్ 25 సంవత్సరాల క్రితం వెళ్లి ముంబైలోని ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మేఘన తల్లి వాణి కరీంనగర్ జిల్లా రామగుండం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. మేఘన ఏడాది వేతనం రూ.75 లక్షలు.