CITU office
-
న్యాయంగా పోరాడితే కేసులా?
బొబ్బిలి: చెరుకు బిల్లుల చెల్లింపుల్లో చట్టాలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టకుండా బకాయిల కోసం పోరాడిన వారిపై అక్రమ కేసులు పెట్టడం న్యాయమా అని ఏపీ చెరుకు రైతు సంఘ జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు ప్రశ్నించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెరుకు సరఫరా చేసిన 15 రోజుల్లో చెల్లింపులు చేయాలని చట్టం చెబుతున్నా ఖాతరు చేయని యాజమాన్యంపై ఎన్ని స్టేషన్లలో కేసులు నమోదు చేశారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనల సమయంలో రైతులది న్యాయమైన డిమాండ్ అని చెబుతున్న పోలీసు అధికారులు ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి సమన్లను పంపించడం భావ్యం కాదన్నారు. యాజమాన్యంపై ఆర్ఆర్ యాక్టు కింద కేసులు పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేసులు పెట్టిభయపెడితే ఉద్యమాలు ఆగవని స్పష్టం చేశారు. తక్షణమే రైతులపై కేసులను వెనక్కి తీసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం పార్వతీరం, బొబ్బిలి డివిజన్ కార్యదర్శులు రెడ్డి శ్రీరాంమూర్తి, రె డ్డి వేణు పాల్గొన్నారు. -
‘బాబు’ పాలనపై కామ్రేడ్ల కన్నెర్ర
నెల్లూరు (సెంట్రల్): అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదంటూ కామ్రేడ్లు కన్నెర్ర చేశారు. అధికారం వచ్చినప్పటి నుంచి కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం కూలి పోవాలని కోరుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఐకేపీ యానిమేటర్లను, వారికి మద్దతు పలికిన సీపీఎం నాయకులను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా సోమవారం నగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు మాట్లాడుతూ కొన్ని రోజుల నుంచి యానిమేటర్లు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గర్లోనే ఉన్నందున ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం కాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోవాలన్నారు. అలా కాకుండా కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఐకేపీ యానిమేటర్లు జీతాలు చెల్లించాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తమ గోడును అసెంబ్లీ వరకు వినిపించేందుకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వారిని రాత్రిళ్లు అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇప్పుడే ఈ ప్రభుత్వం తీరు ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో భయంకరంగా తయారవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు గత పాలన మాదిరే ఇప్పుడు అవలంబించి సమస్యలపై ప్రశ్నించేవారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. త్వరలో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. తొలుత సీఐటీయూ కార్యాలయం నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షాహినాబేగం, విజయమ్మ, చాంద్‌బాషా, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘108 సమ్మె తాత్కాలికంగా విరమణ’
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: రాష్ట్రంలో 35 రోజుల నుం చి చేస్తున్న సమ్మెను 108 సిబ్బంది తాత్కాలికంగా విరమించుకుంటున్నారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కఠారి అజయ్‌కుమార్ తెలిపారు. 108 సర్వీస్ కాంట్రాక్ట్ యూనియన్ ఉద్యోగుల సభను నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో 108 యాజమాన్యం జరిపిన చర్చలు పాక్షికంగా సఫలమైనందున తాము తాత్కాలికంగా సమ్మెను విరమించామని వివరించారు. రూ.300 వేతనం పెంచడంతో పాటు, సిబ్బందిపై వేధింపులు ఆపుతామని, అదే విధంగా సస్పెండ్ చేసిన వారిని తి రిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారన్నారు. నెల రోజులకు పై గా సిబ్బంది ఐక్యంగా ఉద్యమం చేశారని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సీఐటీయూ నాయకులు నరమాల సతీష్‌కుమార్, 108 యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.