నగర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు
బడ్జెట్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు ఎలా వస్తాయి?
పాలకమండలిపై ధ్వజమెత్తిన ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం నగర అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ పాలక మండలికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వస్తున్నట్టు ప్రకటించడం సరికాదన్నారు. బడ్జెట్ సమావేశం వాయిదా పడిన తర్వాత పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్‌రావు, కార్పొరేటర్లు పిల్లి నిర్మల, బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, బొంతా శ్రీహరిలతో కలసి శుక్రవారం ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. పురపాలక పరిపాలన చట్టం ప్రకారం మార్చి 31 నాటికి బడ్జెట్‌ను ఆమోదించి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని షర్మిలారెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా బడ్జెట్ ఆమోదించకపోవడం పాలకమండలి, మేయర్, అధికార యత్రాంగం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కనీసం 50 రోజుల ముందుగానే బడ్జెట్ పుస్తకాలను కార్పొరేటర్లందరికీ పంపిణీ చేయాలి. కానీ కేవలం ఐదు రోజుల ముందు, అదీ ప్రతిపక్ష కార్పొరేటర్లు విలేకర్ల సమావేశం పెట్టి అడిగితే ఇచ్చారు అని షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. సకాలంలో బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి మూడేళ్లుగా నిధులు రావడం లేదని ఆమె ఆరోపించారు.
కార్ల కొనుగోలుకు రూ. 45 లక్షలా?
మేయర్, కమిషనర్లకు నూతన వాహనాల కోసం రూ. 45 లక్షలు కేటాయించాడంపై మేడపాటి ధ్వజమెత్తారు. మాస్టర్‌ప్లా¯ŒS ఆమోదించిన తర్వాత దానిపై త్రీడీ ప్రజెంటేష¯ŒS కోసం రూ. 35 లక్షలు కేటాయించాలని ప్రతిపాదించడం విడ్డూరంగా ఉందన్నారు. పుష్కరాల నిధులు ఇంకా రూ. 120 కోట్లు రావాల్సి ఉందని, కానీ రూ. 40 కోట్లకే ప్రతిపాదనలు పెట్టడం వెనక రహస్యమేమిటని ఆమె ప్రశ్నించారు.
12వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా ఖర్చు కాలేదా?
మేయర్, కమిషనర్ వాహనాల కోసం కేటాయించిన రూ. 45 లక్షలు 12వ ఆర్థిక సంఘం నిధులని, ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం అమలులో ఉందని డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12వ ఆర్థిక సంఘం నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు మేడపాటి అనిల్‌రెడ్డి, మజ్జి అప్పారావు, కోడికోట తదితరులు పాల్గొన్నారు.