city scan
-
కాళ్లలో మొత్తం పరాన్నజీవులే
వాషింగ్టన్: కాళ్ల నుంచి నడుము దాకా నొప్పితో బాధపడు తూ ఆస్పత్రిలో చేరిన రోగికి సిటీ స్కాన్ చేసి ఆ రిపోర్ట్ చూశాక అవాక్కవడం వైద్యుల వంతయింది. అమెరికాలో ని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ జాక్సన్విల్లే వైద్యకళా శాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు అంశాలపై ప్రజలకు ఆన్లైన్లో అవగాహన కల్పించే ఒక వైద్యుడి ద్వారా ఈ విషయం వెల్లడైంది. రోగికి తీసిన సీటీ స్కాన్ రిపోర్ట్‌లను చూపిస్తూ పరాన్న జీవులతో ఇబ్బందిపడ్డ ఆ రోగి వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా డాక్టర్ శామ్ ఘలీ వెల్లడించారు. ‘‘అత్యవసర చికిత్స నిమిత్తం ఆగస్ట్ 25వ తేదీన ఆ రోగిని మా ఎమర్జెన్సీ రూమ్‌లో చేర్పించారు. వెంటనే నేను సీటీ స్కాన్ తీ యించా. ఆ సీటీ స్కాన్ రిపోర్ట్చూశాక నాకు నోట మా టరాలేదు. కాళ్లలో ఎక్కడపడితే అక్కడ పరాన్నజీవులు తిష్టవే శాయి. సరిగా ఉడకని పంది మాంసం తినడం వల్ల రోగి శరీరంలోకి పంది నులిపురుగులు ప్రవేశించి రెండు కాళ్ల కండరాలను మొత్తం ఆక్రమించేశాయి. ఈ విషమ పరిస్థితిని టేనియా సోలియం లేదా సిస్టీసెర్కోసిస్గా వ్యవహరిస్తారు. ఏమిటీ సిస్టీసెర్కోసిస్?సరిగా ఉడకని, పచ్చి పంది మాసం తినడం వల్ల ఆ మాంసంలోని నులిపురుగులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాని లార్వాలు మెదడు, కండరాల్లో కి చొరబడితే ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా తయార వుతుంది. చర్మం కింద గడ్డలు, తలనొప్పితోపాటు ఇన్ఫెక్షన్ మెదడు, వెన్నుపూస దాకా చేరితే మూర్ఛ వ్యాధి రావొచ్చు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, అశుభ్రమైన చేతులు, మనిషి మలం ద్వారా కూడా ఈ నులిపురుగులు వ్యాపి స్తాయి. ఉడికీఉడకని పంది మాంసం ద్వారా లార్వాలు మనిషి పేగుల్లోకి, అక్కడి నుంచి రక్తంలో కలుస్తాయి. రక్తంతోపాటు శరీరమంతా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ లార్వాలు తిష్టవేస్తాయి. తొలి దశలోనే సిస్టీ సెర్కోసిస్ను గుర్తిస్తే నివారణ చాలా సులభం. ఆల స్యం చేస్తే మాత్రం మరణం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడుతు న్నారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యాధి ముదిరి ఏటా 50,000 మంది చనిపో తున్నారు. ‘‘యాంటీ–పారాసైట్ థెరపీ, స్టెరాయిడ్ లు, న్యూరోసిస్టీసెర్కోసిస్ కోసం యాంటీ–ఎపిలె ప్టిక్స్, సర్జరీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేసుకోవచ్చు. తొలి దశలో సీటీ స్కాన్ చేయిస్తే స్కానింగ్‌లో తెల్ల బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. దాంతో వీటిని గుర్తించవచ్చు. ఇన్ఫెక్షన్ సోకిన 5–12 వారాల్లోగా అవి నులిపురుగులుగా మారతాయి. అప్పుడు సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి’. -
ఆశలన్నీ హరీష్‌రావుపైనే..
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి కీలక విభాగాల్లో ప్రధానమైన సమస్యలు కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్నాయి. అత్యంత ప్రాధాన్యత గల వైద్యశాఖకు పలువురు మంత్రులు మారిన ‘గాంధీ’ పరిస్థితుల్లో మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో సిద్ధం చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చక బుట్టదాఖల అవుతున్నాయి. నిధులు మంజూరైనా పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. ఆర్థిక, సాంకేతిక పరమైన అడ్డంకులతోపాటు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధి ఫలాలు అందడం లేదని నిరుపేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావుకే వైద్య ఆరోగ్య శాఖ అప్పగించడంతో గాంధీ దవాఖానాలో నెలకొన్న సమస్యలు పరిష్కారమైనట్లేనని ఆస్పత్రి పాలనయంత్రాంగంతోపాటు వైద్యులు, రోగులు భావిస్తున్నారు. వైద్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈనెల 11న హరీష్‌రావు గాంధీ ఆస్పత్రిని సందర్శించి, రేడియాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ మెషిన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం గాంధీ పాలనయంత్రాంగం, అధికారులు, వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమస్యలు ఇవీ.. ►కార్డియాలజీ విభాగంలోని క్యాథ్‌ల్యాబ్ రెండేళ్లుగా పనిచేయడంలేదు. వేలాది మంది హృద్రోగులు అప్పులు చేసి ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. నూతన క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు ప్రతిపాదనల దశలోనే ఉంది. ఆధునిక క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసి గుండె చప్పుడు ఆగి పోకుండా చూడాలని పలువురు హృద్రోగులు కోరుతున్నారు. ►రేడియాలజీ విభాగంలోని ఎమ్మారై స్కానింగ్ మెషిన్ మూలనపడింది. కోట్లాది రూపాయలతో అత్యాధునిక మెషిన్ కొనుగోలు చేశారు. విద్యుత్ సరఫరా చేసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడంతో సదరు ఎమ్మారై మిషన్ గోడౌన్‌కే పరిమితమైంది. ►సీడాక్ సంస్థతో ఒప్పంద కాలపరిమితి ముగియడంతో కంప్యూటర్ వ్యవస్థ పనిచేయడంలేదు. ఓపీ విభాగంలో చేతి రాతతో చిట్టీలు ఇవ్వడంతో రోగులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చునే పరిస్థితి నెలకొంది. ►ఐపీ బ్లాక్‌లోని ఆస్పత్రి 8వ అంతస్తులో అవయవ మార్పిడి కోసం మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం సుమారు రూ.50 కోట్లు కేటాయించినట్లు ప్రకటించగా, నేటికీ టెండరు ప్రక్రియ దాటకపోవడం గమనార్హం. ►రోగులతోపాటు వైద్యులకు ఆహార పదార్థాలు స రఫరా చేసే డైట్ క్యాంటిన్ సెల్లార్‌లోని మురుగునీటిలోనే కొనసాగుతోంది. డైట్ క్యాంటిన్ నిర్మా ణం కోసం స్థల పరిశీలన దశలో ఆగిపోయింది. ►సీసీ కెమెరాలు ఏర్పాటు గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొనసాగుతోంది. వైద్యులపై తరచూ దాడులు జరగడంతోపాటు రోగులకు చెందిన విలువైన వస్తువులు దొంగతనాలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విశేషం. ►20 లక్షల చదరపు అడుగుల వైశ్యాలం గల గాంధీ ప్రాంగణంలో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ టేకర్ సిబ్బంది సరిపడేంత లేరు. వీరి సంఖ్య పెంచాలని లిఖితపూర్వకంగా పలుమార్లు విజ్ఞప్తి చేసిన వైద్య ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆస్పత్రికి చెందిన ఓ కీలక అధికారి వ్యాఖ్యానించడం విశేషం. ►పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గాంధీ వైద్యులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని పెంచకపోవడం గమనార్హం. గ్రామాన్ని తలపించే గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్ కొనసాగుతున్నాడు. దశాబ్ధాలుగా రిక్రూట్మెంట్ లేకపోవడం, ఉన్నవారంతా పదవీవిరమణ పొందడంతో ఆయా రంగాల్లో నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ►సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్కింగ్ టెండర్లు రద్దు చేయడంతో వేలాది వాహనాలు గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. దారి లేకపోవడం ప్రాణాపాయస్థితిలో అంబులెన్స్‌ల్లో వచ్చే బాధితులుకు వైద్యసేవలు అందించడంలో జాప్యం జరుగుతోంది. ►గాంధీ ఆస్పత్రిలో ఫైర్ సేప్టీ లేకపోవడంతో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించి కోట్లాది రూపాయల వైద్య పరికరాలు బూడిత అవుతున్నాయి. ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని కోరుతూ గాంధీ అధికారులు పలుమార్లు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవలే అగ్ని ప్రమాదం సంభవించడంతో వారాల పాటు వైద్యసేవలకు విఘాతం కలిగింది. ►వీటితో పాటు అనేక చిన్నాచితక సమస్యలతో నిరుపేద రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నిరుపేదల రోగులతోపాటు వైద్యులు, వైద్యవిద్యార్థులు, సిబ్బంది సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని వైద్య మంత్రి హరీష్‌రావును కోరుతున్నారు. -
అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’
పరిగి మండలానికి చెందిన నరేష్ కొన్ని వారాల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మూడు రోజుల తర్వాత స్వల్పంగా దగ్గు మొదలైంది. ఎందుకైనా మంచిదని హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నారు. చికిత్స కోసం వచ్చిన అతన్ని కనీసం తలెత్తి కూడా చూడని ఆ డాక్టర్.. నరేష్ చెబుతున్న జబ్బు లక్షణాలు పూర్తి కాకనే ఓ రెఫరల్ ప్రిస్కిప్షన్ చేతిలో పెట్టేశాడు. చెస్ట్ ఎక్స్‌రే, సీటీ స్కాన్, బ్లడ్ చెకప్ చేయించాలని రాసి ఉంది. అదే ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్‌ను కలిసి బ్లడ్ చెకప్‌కు సంబంధించి నమూనాలు ఇచ్చి, రూ.900 బిల్లు చెల్లించాడు. డాక్టర్ సూచించిన ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి ఎక్స్‌రే కోసం రూ.350, సీటీ స్కాన్ కోసం రూ.3వేలు బిల్లు చెల్లించుకున్నాడు. ఈ మొత్తం రిపోర్టులు పరిశీలించిన తర్వాత నరేష్‌కు కరోనా సోకిందంటూ నెమ్మదిగా చెప్పిన డాక్టర్.. తనకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాప్ ద్వారా రూ.800 విలువ చేసే మందులు కొనుగోలు చేయించాడు. దగ్గు కోసం చికిత్సకు వెళితే.. కేవలం రెండు గంటల వ్యవధిలో డాక్టర్ కన్సల్టింగ్ ఫీజుతో కలిపి రూ.4,350 వరకు నరేష్ చెల్లించుకోవాల్సి వచ్చింది. తనలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో ఎందుకైనా మంచిదని అదే రోజు తనకు తెలిసిన ఊపిరితిత్తులకు సంబంధించిన మరో ప్రైవేట్ వైద్యుడిని కలిశాడు. అతన్ని పూర్తిస్థాయిలో పరీక్షించిన అనంతరం కరోనా లేదని, ఇన్ఫెక్షన్ సోకడం వల్ల దగ్గు వస్తోందంటూ తేల్చి ఓ టానిక్, కొన్ని మందులు రాసిచ్చాడు. ఇక్కడ ఆస్పత్రి కన్సల్టెంగ్ ఫీజు, నెబులైజర్, మందులకు 1,300 ఖర్చయింది. ఇంటికెళ్లి ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడడంతో ఓ రెండు రోజుల తర్వాత నరేష్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ పరిస్థితి కేవలం నరేష్ ఒక్కనిదే కాదు. సాధారణ జబ్బులతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుతున్న వారందరూ ఈ తరహా దోపిడీకి గురవుతున్నారు. హిందూపురం టౌన్: ఆస్పత్రికి వచ్చే వారిని కచ్చితంగా సీటీ స్కానింగ్ చేయించుకోవాలని ప్రైవేట్ వైద్యులు జులుం చేస్తున్నారు. ఇలా హిందూపురం ప్రాంతంలోని చాలా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ పేరిట పెద్ద ఎత్తున స్కామ్‌కు తెరలేపారు. కరోనా కష్టకాలంలో రోగుల్లోని భయాన్ని కొందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. స్వల్పంగా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చాలు.. అవసరం లేకున్నా వైద్య పరీక్షలు అంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. రోజుకు సగటున 70కి పైగా.. హిందూపురం జిల్లా ఆస్పత్రితో పాటు మరో మూడు ప్రైవేట్ సీటీ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో జిల్లా ఆస్పత్రిలోని సీటీ స్కానింగ్ యంత్రం పనిచేయడం లేదు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలోనూ ఒకటి పనిచేయడం లేదు. దీంతో పనిచేస్తున్న రెండు స్కానింగ్ సెంటర్లకు కరోనా కష్ట కాలంలో భారీ డిమాండ్ నెలకొంది. గతంలో సీటీ స్కాన్‌కు రోగి అవసరాన్ని బట్టి రూ.4 వేలు నుంచి రూ.5వేల వరకూ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు వసూలు చేసుకునేవారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ తీసుకుంటున్నారు. ఈ లెక్కన హిందూపురంలోని స్కానింగ్ సెంటర్లలో రోజుకు 70 నుంచి 140 వరకు సీటీ స్కాన్లు నిర్వహిస్తుంటారు. జిల్లాస్పత్రిలో సీటీ స్కాన్ పనిచేయకపోవడంతో అవసరాన్ని బట్టి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేస్తుంటారు. రెఫరల్‌కు రూ.800 కమీషన్ హిందూపురం నియోజకవర్గంతో పాటు పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల ప్రజలు అత్యవసర చికిత్సల కోసం హిందూపురంలోని ఆస్పత్రులనే ఆశ్రయిస్తుంటారు. కరోనా భయంతో కుదేలవుతున్న రోగులకు అవసరం లేకున్నా సీటీ స్కాన్లు నిర్వహిస్తూ ఆర్ఎంపీలు, ప్రైవేట్ డాక్టర్లు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. తమ వద్దకు చికిత్స కోసం వచ్చిన రోగులకు అవసరం లేకున్నా.. ముందుగా సీటీ స్కాన్లు, బ్లడ్ చెకప్‌లు, ఎక్స్‌రేలకు డాక్టర్లు రెఫర్ చేస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యకూ సీటీ స్కాన్ తప్పనిసరి చేసేశారు. సీటీ స్కానింగ్‌కు రెఫర్ చేసిన డాక్టర్‌కు ఒక్కో స్కాన్‌కు రూ.800 చొప్పున కమీషన్‌ను స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అందజేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇతర వైద్య పరీక్షల్లోనూ కమీషన్లను డాక్టర్లు దండుకుంటున్నారు. చివరకు మందుల కొనుగోలు విషయంలోనూ కమీషన్లు ఉండడంతో ప్రి్రస్కిప్షన్ చాలా పొడవుగా ఉంటోంది. సీటీ స్కాన్‌తో అన్నీ సమస్యలే.. అవసరం లేకున్నా సీటీ స్కాన్ చేయించడం చాలా ముప్పు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందంటున్నారు. కొంతమంది వైద్యులు ప్రతి మూడు రోజులకు ఒకసారి సీటీ స్కాన్ చేయిస్తుంటారని, దీంతో రోగి శరీరం అధిక రేడియేషన్‌కు గురికావడంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు మాత్రం అదీ వైద్యులు సూచిస్తేనే సీటీ స్కాన్ చేయించుకోవాలని చెబుతున్నారు. సీటీ స్కాన్ కంటే చెస్ట్ ఎక్స్రేకే తొలి ప్రాధాన్యమివ్వాలని.. అప్పటికీ జబ్బు పరిస్థితి తేలకపోతే సీటీ స్కాన్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. ఒక సీటీ స్కాన్ 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్‌రేలతో సమానమని హెచ్చరిస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి సీటీ స్కాన్ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్న వారు, ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగా ఉన్న వారికి సీటీ స్కాన్ అసలు అవసరం లేదని అంటున్నారు. తుంగలోకి కోవిడ్ నిబంధనలు కరోనా నిర్ధారణకు ఆర్ఎంపీలు, ప్రైవేట్ వైద్యులు సీటీ స్కాన్పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ డిమాండ్‌ను అనుకూలంగా మార్చుకున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కేశారు. డాక్టర్లు రాసిచ్చిన రెఫరల్ ప్రి్రస్కిప్షన్ను మళ్లీ రోగి చేతికి ఏ ఒక్క స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఇవ్వడం లేదు. కేవలం రిపోర్టులు మాత్రమే చేతిలో పెట్టేసి డబ్బు గుంజుతున్నారు. దీనికి తోడు ఒకరికి స్కాన్ చేసిన తర్వాత యంత్రాన్ని పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయడం లేదు. దీంతో తొలుత స్కాన్ చేసిన రోగికి కరోనా పాజిటివ్ ఉంటే.. తర్వాత స్కాన్ చేసిన రోగికి లేకపోయినా.. అతను కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు. అయితే నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ రెఫరల్ ప్రిస్కిప్షన్ లేకపోయినా.. సొంత నిర్ణయాలతో సీటీ స్కాన్లు చేసేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్ సిఫారసు లేకుండా చేయరాదు అవసరం లేకున్నా స్కాన్‌కు రెఫర్ చేయడం సరికాదు. క్వాలిఫైడ్ డాక్టర్ల సిఫారసు లేకుండా సీటీ స్కాన్ చేస్తే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. రోగులు సైతం డాక్టర్ల సలహా మేరకే స్కానింగ్ చేయించుకోవాలి. వ్యక్తిగత నిర్ణయాలు చాలా నష్టం కలిగిస్తాయి. – డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ చదవండి: ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’ నిరంతరాయంగా స్టీల్‌ప్లాంట్ ఆక్సిజన్ -
అనంతపురం: సీటీ స్కాన్ల పేరుతో దోపిడీ
-
ప్రైవేట్ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్ల దందా
వైద్య, ఆరోగ్యశాఖకు అందిన ఫిర్యాదులు.. విచారణకు ఆదేశం అతను ఓ జిల్లా కలెక్టర్ సోదరుడు. కరోనా బారినపడి ఇటీవలే కోలుకున్న అతను... ఈమధ్య ఛాతీ నొప్పితో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. మొదటగా ఎక్స్‌రే తీసిన వైద్య సిబ్బంది అందులో తేడా ఉందంటూ సీటీ స్కాన్ తీసి ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉందని తేల్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు... తాను వైద్యం పొందిన డాక్టర్‌కు సీటీ స్కాన్ రిపోర్ట్ పంపాడు. తనకు శ్వాసకోశ ఇబ్బందులేవీ లేవని పేర్కొన్నాడు. చివరకు అతన్ని పరీక్షించిన వైద్యుడు చాలా యాక్టివ్గానే ఉన్నట్లు తేల్చాడు. వాస్తవంగా సీటీ స్కాన్ నివేదిక ప్రకారమైతే ఆ బాధితుడు కనీసం మాట్లాడే పరిస్థితి కాదు కదా.. తక్షణమే ఆక్సిజన్ బెడ్‌పై పడుకోబెట్టాల్సి ఉంటుంది. మరి సీటీ స్కాన్ రిపోర్ట్‌కు, డాక్టర్ తేల్చిన విషయానికి మధ్య అంత అంతరం ఉండటానికి కారణమేంటి? సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారిని సొమ్ము చేసుకొనేందుకు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నాయి. సీటీ స్కాన్ల నివేదికల పేరుతో భారీ దందా నడిపిస్తున్నాయి. బాధితుల్లో రోగ లక్షణాలు లేకున్నా ఉన్నట్లుగా తప్పుడు సీటీ స్కాన్ నివేదికలను తయారు చేస్తున్నాయి. వాటిని చూపి భయపెట్టి రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్స పేరిట రూ. లక్షలు గుంజుతున్నాయి. అనవసరంగా సీటీ స్కాన్లు తీయడమే కాకుండా వాటిని మార్ఫింగ్ చేయడంపై బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఆసుపత్రుల చీటింగ్ స్కాన్లపై దృష్టి సారించిన వైద్య, ఆరోగ్యశాఖ విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటువంటి ఆసుపత్రులను గుర్తించి వాటిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ తరహా ఆసుపత్రులపై శనివారం తమకు కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చినట్లు ఒక వైద్యాధికారి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అనవసరంగా సీటీ స్కాన్లు చేస్తున్న ఆసుపత్రులను గుర్తించాలని కూడా వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాల అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కరోనా నిర్ధారణ కోసం సీటీ స్కాన్లు... రాష్ట్రంలో కరోనా నిర్ధారణకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షతోపాటు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో 23 ఆసుపత్రులు, లేబొరేటరీల్లోనే ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా చికిత్సలు చేసే ఆసుపత్రులు మాత్రం వంద వరకు ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో ఆర్టీ–పీసీఆర్ పరీక్షలతోపాటు యాంటీజెన్ పరీక్షలు చేసేవి మొత్తం 1,100 కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్సీ స్థాయి వరకు యాంటీజెన్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసే అవకాశాలు లేవు. దీంతో తమ వద్దకు వచ్చే బాధితులకు సీటీ స్కాన్లను విరివిగా చేస్తున్నాయి. వాటి ఆధారంగానే కరోనా నిర్ధారణ చేస్తున్నాయి. ఒక్కో సీటీ స్కాన్‌కు రూ. 5–6 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దాంట్లో పీపీఈ కిట్ల ధర కూడా కలిపి వేస్తున్నాయి. అవసరం ఉన్నా, లేకున్నా సీటీ స్కాన్ చేయడం తప్పనిసరి చేసిన యాజమాన్యాలు... వాటిని డబ్బు సమకూర్చే యంత్రాలుగా మార్చేశాయి. ఆర్టీ–పీసీఆర్ కరోనా పరీక్షకు కనీసం 24 గంటల సమయం పడుతుండగా సీటీ స్కాన్ ద్వారానైతే ఐదు నిమిషాల్లోనే ఫలితం తెలుసుకొనే వీలుంది. దీన్ని బాధితులు కూడా తక్షణ నిర్ధారణగా భావిస్తున్నారు. మార్ఫింగ్ జరుగుతోంది ఇలా... కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు బాధితులు చేయించుకొనే సీటీ స్కాన్లలో ఎటువంటి వైరస్ లక్షణాలు కనిపించకపోయినా మార్ఫింగ్ చేయడం మొదలు పెట్టాయి. సీటీ స్కాన్ తీశాక రిపోర్ట్ కాపీని మార్చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా సీటీ స్కాన్ ఫిల్మ్‌ను కూడా మార్ఫింగ్ చేస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా, అటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న రోగి ఫిల్మ్‌లో మరో రోగి పేరు ఉండేలా చేసి మార్ఫింగ్ చేస్తున్నట్లు తేలిందని ఒక వైద్యాధికారి తెలిపారు. పాత ఫిల్మ్‌లలోని తేదీలను కూడా ఆసుపత్రులు మార్చేస్తున్నాయని, ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు చెప్పి బాధితులను ఇన్పేషెంట్లుగా చేర్చుకొని రూ. లక్షలు గుంజుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు మరో వైద్యాధికారి తెలిపారు. ఒక కలెక్టర్ కుటుంబాన్నే మోసం చేశారంటే పరిస్థితి ఎందాక వచ్చిందో అర్థం చేసుకోవచ్చని, దీనిపై నివేదిక తయారు చేశామని ఒక అధికారి తెలిపారు. -
నోటి క్యాన్సర్ అంటున్నారు.. ఏం చేయాలి!
నా వయసు 49 ఏళ్లు. నేను ఇరవై ఏళ్లుగా గుట్కా తింటున్నాను. ఒక నాలుగు నెలల నుంచి నా నోటిలో వాపు కనిపించడంతో పాటు నొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తోంది. గత రెండు నెలల నుంచి ఈ బాధ మరీ ఎక్కువయ్యింది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) కూడా వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ కావచ్చని, దగ్గర్లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లమని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎన్. రామస్వామి, సూళ్లూరుపేట గుట్కాలు/పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. ముందుగా క్యాన్సర్ స్పెషలిస్ట్ మిమ్మల్ని పరీక్షించి, మీ చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చిందో తొలుత పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. మీరు చెబుతున్న లక్షణాలైతే క్యాన్సర్‌కు సంబంధించినవిగానే కనిపిస్తున్నాయి. ►మొదట మీకు సమస్య ఉన్న భాగంతో పాటు, మెడ భాగంలోనూ సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ► ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కూడా కష్టమవుతుంది. మీలోని క్యాన్సర్ ఇతరచోట్లకు వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగించిన భాగాన్ని ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ► సర్జరీ తర్వాత నోరు మునపటిలా తెరచుకోదేమోనని కొందరు ఆందోళన చెంతుటుంటారు. కానీ రోబోటిక్ సర్జరీతో కుట్లూ ఉండవు. నోరు కూడా పూర్తిగా మునపటిలాగే తెచుకుంటుంది. ముందులాగే నోటిద్వారా ఆహారం తీసుకోవచ్చు. ► ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు పూర్తిగా మానిపోయాక, రేడియోథెరపీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మొదట మీరు గుట్కా/పొగాకు నమలడం పూర్తిగా మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు. మీరు వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని క్యాన్సర్ నిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ సచిన్ మార్దా, సీనియర్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
అనంత సర్వజనాస్పత్రికి మహర్దశ!
– బోధనాస్పత్రికి సీటీ స్కాన్ యంత్రం – నెలాఖరులోగా అందుబాటులోకి సేవలు – మరో నాలుగు నెలల్లో ఎంఆర్ఐ – ‘సీటీ స్కాన్’ వెతలపై ‘సాక్షి’ వరుస కథనాలు (సాక్షి ఎఫెక్ట్) అనంతపురం మెడికల్ : స్థానిక సర్వజనాస్పత్రికి ఎట్టకేలకు సీటీ స్కాన్ రాకతో ఏడాదిన్నర నిరీక్షణకు తెరపడింది. ఇదే సమయంలో ఎంఆర్ఐ కూడా వస్తుండడంతో పేద ప్రజలకు ఆర్థిక భారం తప్పనుంది. వివరాల్లోకి వెళితే.. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజనాస్పత్రిలో 2002లో సీటీ స్కాన్ యంత్రాన్ని ఇన్స్టాల్ చేశారు. ఇది మరమ్మతులకు గురి కావడంతో ఏడాదిన్నరగా సేవలు నిలిచిపోయాయి. మరమ్మతుకు రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని సదరు కంపెనీ తెలిపింది. మరమ్మతుల తర్వాత పరికరం ఎంత కాలం పని చేస్తుందో తెలియదు. దీంతో కొత్త యంత్రాన్ని సమకూర్చాలని ఇక్కడి అధికారులతోపాటు కలెక్టర్ కూడా ప్రతిపాదించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు లేఖ రాశారు. గతంలోనే ఇక్కడకు సీటీ స్కాన్ మంజూరైనా రాజకీయ కారణాలతో ఇతర ప్రాంతాలకు తరలించారు. గత ఏడాది మే 18న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ‘ఆస్పత్రి నిద్ర’ చేసిన సమయంలో సీటీ స్కాన్లేక రోగుల కష్టాలను తెలుసుకున్నారు. మూడు నెలల్లోగా పరికరాన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా వీలైనంత త్వరలో యంత్రాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కానీ వీరి హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రోగుల అవస్థలు, సీటీ స్కాన్ యంత్రం ఆవశ్యకత, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. గత ఏడాది మే 2 న ‘వాళ్లకు పట్టదు..వీళ్లకు తప్పదు’.. అక్టోబర్ 13న ‘మూడు..మారిందా’ శీర్షికలతో సమస్య తీవ్రతను తెలియజేసింది. దీనిపై అధికారులు స్పందించారు. పీపీపీ పద్ధతిలో సీటీ స్కాన్ : ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో సీటీ స్కాన్ యంత్రాన్ని సమకూర్చారు. ఎస్ఎల్ డయాగ్నస్టిక్స్ టెండర్‌ను దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఎంఓయూ కూడా ముగిసింది. ఇందులో భాగంగా శనివారం ఆస్పత్రిలో ఉన్న పాత సీటీ స్కాన్ యంత్రాన్ని కండెమ్షన్ చేశారు. నెలాఖరులోగా పరికరాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. కాగా ఆస్పత్రికి ఎంఆర్ఐ కూడా రానున్నట్లు ఆయన చెప్పారు. డీఎంఈ స్థాయిలో బిడ్డింగ్ కూడా అయిపోయిందని, మరో నాలుగు నెలల్లో ఆస్పత్రికి సమకూరుతుందన్నారు. తప్పనున్న ఆర్థిక భారం : సీటీ స్కానింగ్ యంత్రం అందుబాటులోకి రానుండడంతో పేద రోగులకు ఆర్థికభారం తగ్గనుంది. యంత్రం పని చేసే సమయంలో రోజుకు సుమారు పది వరకు స్కానింగ్‌లు చేసేవారు. తలకు గాయం, కడుపు, ఛాతీ, పక్షవాతం ఉన్న వాళ్లకు ఈ యంత్రంతో స్కానింగ్ చేస్తారు. ప్రస్తుతం యంత్రం అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరు రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. -
సిటీ స్కాన్ కు సుస్తీ చేసింది
నాలుగు నెలలుగా మరమ్మతులకు గురైనా నిర్లక్ష్యమే ప్రైవేటుతో ఒప్పందాలేనని అనుమానాలు ప్రతిపాదనలు పంపించామంటూ సన్నాయినొక్కులు ఎక్స్రేదీ అదే పరిస్థితి ∙ఇబ్బందులు పడుతున్న రోగులు కాకినాడ వైద్యం : రోగులూ ఇటు రాకండి ... ఎందుంటే గత నాలుగు నెలలుగా సీటీ స్కాన్ పాడైపోయింది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సాంకేతికత తికమకగా తయారై రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులకు గంట వ్యవధిలో అందించాల్సిన సాం కేతిక వైద్య సేవలు ఒక్కొక్కటి గా తెరమరుగవుతున్నాయి. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైన క్షతగాత్రులకు ఆ గాయాల తీవ్రతను వైద్యులు పరిశీలించేందుకు తీయాల్సిన సిటీ స్కాన్ కాకినాడ జీజీహెచ్‌లో మూలనపడింది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా వైద్య సేవలు నిలిచిపోడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2002లో ఏర్పాటు... కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 2000 సంవత్సరం నుంచి పెరుగుతున్న రోగుల తాకిడికి తగ్గట్టుగా సిటీస్కాన్పరికర అవసరాన్ని అప్పటి అధికార్లు గుర్తించారు. 2002లో అప్పటి కలెక్టర్ సతీష్‌చంద్ర జోక్యంతో ఏఎంజీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధి, సామాజికవేత్త డాక్టర్ మెర్ల బాబ్జి అభ్యర్థన మేరకు జర్మనీ దేశస్థుడు, ఉదారవేత్త డాక్టర్ హెచ్‌హెచ్ డైక్‌మ¯ŒS రూ.50లక్షల వ్యయంతో సిటీ స్కా¯ŒS పరికరాన్ని జీజీహెచ్‌కు సమకూర్చారు. ఈ పరికరం మూడేళ్లపాటు నిర్విరామంగా సేవలందించింది. అనంతరం మరమ్మతులకు గురైనప్పుడల్లా డాక్టర్ డైక్‌మ¯ŒS సమకూర్చిన నిధులతోనే సంబంధిత కంపెనీ మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలో పెట్టేది. కాలక్రమంలో ఆసుపత్రి పరిపాలనాధికారులు పర్యవేక్షణాలోపంతో సేవలు స్తంభించాయి. మొరాయించిన సిటీ స్కాన్ పరికరాన్ని పూర్తిగా తొలగించాలని, తిరిగి కొత్త పరికరాన్ని సమకూర్చాల్సిందిగా గత కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి డాక్టర్ డైక్‌మ¯ŒSకే వినతి చేరడంతో రెండోసారి కూడా రూ.80 లక్షల వ్యయంతో సీమె¯Œ్స కంపెనీకి చెందిన ఆధునాతన సిటీ స్కాన్ పరికరాన్ని జీజీహెచ్‌కు అందజేశారు. అంతేకాకుండా మూడేళ్లపాటు దాని మరమ్మతులు ఆ కంపెనీయే భరించేలా ఒప్పందం కుదిర్చారు. అయితే ఈ పరికరం పనిచేసేందుకు ఖచ్చితంగా మూడు ఏసీ పరికరాలుండాలి. ఆస్పత్రి అధికారుల ఉదాసీనత ఫలితంగా ïసిటీ స్కాన్ గదిలో ఏసీలు çసక్రమంగా పనిచేసిన దాఖలాల్లేవు. రెండు సిటీ స్కాన్లు అవసరం... నిత్యం సుమారు 2,500 నుంచి 3,000 రోగులు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి వైద్య సేవలకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారు. అందులో సుమారు రోజుకి 40 మందికి సిటీ స్కానింగ్ చేయించాల్సిందిగా వైద్యులు సూచిస్తుంటారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 1500–1700 మందిలో రోజుకి సుమారు 60 కేసులకు సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి ఈ పరికరంపై రోజుకి 30కి మించి చేసినటైతే తొందరగా మిష¯ŒS మరమ్మతులకు గురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. పరికర సామరŠాధ్యనికి మించి కేసులు నమోదవుతున్నా అదనంగా మరో పరికరాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆసుపత్రి అధికారులు ప్రస్తుతం ఉన్న పరికరాన్ని కూడా వినియోగంలో పెట్టలేకపోవటం పర్యవేక్షణా లోపాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రైవేటుకు తరలింపులు... సిటీ స్కాన్ మొరాయింపుతో కేసులన్నీ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించేవారికి కాకినాడలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు తరలిస్తుండగా, ఈ పథకం వర్తించని వారి పరిస్థితి అయోమయంగా తయారైంది. ప్రాణాపాయమైనా ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాల్లేవని రోగులు వాపోతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్‡ వైద్య సేవకు సంబంధించిన పత్రాలు, సంతకాలు చేయించేందుకే పుణ్యకాలం గడిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పరిపాలనాధికార్లకు సిటీ స్కా¯ŒS మొరాయింపు కాసుల పంటగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెరవెనుక మధ్యవర్తిత్వం పోషిస్తున్న దళారీలకు నిత్య పంటగా తయారైందంటున్నారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల నుంచి దళారీల ద్వారా ఆసుపత్రి ఉన్నతాధికారులకు కేసుకు కొంత మొత్తం వంతున రోజుకి ఇంత చొప్పున ముడుపులు అందుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలలుగా మరమ్మతులకు గురైనా పట్టించుకోకపోవటం ఈ ఆరోపణలకు బలంచేకూర్చుతోంది. ఈ పరికరం మరమ్మతులకు సుమారు రూ.10 లక్షల వ్యయం అవుతుందని, కలెక్టర్ అనుమతితో మరమ్మతులు చేయించవచ్చంటున్నారు. సూపరింటెండెంట్‌నే అడగండి సిటీ స్కాన్ పరికరం ఈ ఏడాది జులై నుంచి పనిచేయటం లేదని సూపరింటెండెంట్‌కు తెలియజేశాం. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో సూపరింటెండెంట్‌నే అడిగి తెలుసుకోవాలి. – డాక్టర్ రాధారాణి , రేడియాలజీ విభాగాతిపతి ప్రభుత్వానికి తెలియజేశాం కాకినాడ జీజీహెచ్‌లోని సిటీ స్కాన్ పనిచేయటం లేదని ప్రభుత్వానికి తెలియజేశాం. పరికరం పాతదైపోయినందున పలుమార్లు లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించాం. మరొక కొత్త పరికరాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విషయమై ౖ వైద్య,ఆరోగ్య శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అవసరాన్ని బట్టి అత్యవసరమైన కేసులకు ఆరోగ్య సేవలో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు పంపుతున్నాం. – డా.వై.నాగేశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్, కాకినాడ వేలకు వేలిచ్చి బయట చేయించుకుంటున్నాం ఆస్పత్రిలోని సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ ఆస్పత్రి పరీక్షలు చేయించుకుంటున్నాం. సిటీ స్కాన్ చెడిపోయి నాలుగు నెలలైనా మరమ్మతులు చేయకపోవడం దారుణం. ఈ విషయమై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. – పలివెల వీరబాబు, ఇంద్రపాలెం ఎక్స్‌రే కోసం గంటల కొద్దీ నిరీక్షణ... అక్కడ ఏ రోజు చూసినా జనం బారులు తీరి ఉంటారు మహిళలు, చిన్నారుల పరిస్థితి అయితే మరీ ఘోరం. గంటల కొద్దీ వేచి ఉన్నా పని జరగకపోవడంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌రే కేంద్రాల వద్ద అధికారుల పర్యవేక్షణ లోపించడం, మిషన్లు తరచూ మరమ్మతులకు గురవ్డంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రిలో సుమారు ఎనిమిది ఎక్సరే కేంద్రాలున్నా, అయిదు కేంద్రాలే పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని రోగులు తెలిపారు. ఎక్సరే కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.