civil court judge
-
ఇవేం టాయిలెట్లు... మీ ఇళ్లలో ఇలాగే ఉంటాయా
హుస్నాబాద్: టాయిలెట్లు కంపుకొడుతున్నాయి.. మీ ఇళ్లలో ఇలాగే ఉంటాయా అని కళాశాల అధ్యాపకులపై హుస్నాబాద్ సివిల్ కోర్టు జూనియర్ జడ్జి శివరంజని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లోని టాయిలెట్ల నిర్వహణపై శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని కళాశాలల్లో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నింటికి తాళాలు వేసి ఉండటం చూసి విస్మయం వ్యక్తం చేశారు. అధ్యాపకుల టాయిలెట్లు శుభ్రంగా ఉండి, విద్యార్థులవి అధ్వానంగా ఉండటంపై మండిపడ్డారు. కళాశాలకు ఇంకా విద్యార్థులు రావడం లేదని, అందుకే టాయిలెట్లు శుభ్రం చేయలేదని అధ్యాపకులు తెలిపారు. పిల్లలు వస్తేనే టాయిలెట్లు శుభ్రం చేస్తారా అని జడ్జి మందలించారు. కళాశాలలకు విద్యార్థులు వస్తేనే మీకు ఉద్యోగాలు ఉంటాయన్న విషమయం గుర్తుంచుకోవాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ వస్తా, పరిస్థితి ఇలాగే ఉంటే హైకోర్టుకు రిపోర్టును పంపుతానని హెచ్చరించారు. ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ కళాశాలలో.. సిద్దిపేటఅర్బన్: మండలంలోని ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను సిద్దిపేట కోర్టు సీనియర్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్లను ఆమె పరిశీలించారు. వీటి పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు. -
పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ..!!
ఇస్లామాబాద్ : సుమన్ కుమారి అనే మహిళ పాకిస్తాన్‌లోని ఓ కోర్టుకు సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా దాయాది దేశంలో జడ్జిగా నియమితులైన తొలి హిందూ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఖంబర్-షాదాద్కోట్ జిల్లాకు చెందిన కుమారి అదే జిల్లాకు జడ్జిగా నియమితులవడం విశేషం. అక్కడి హైదరాబాద్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన కుమారి కరాచీలోని సాజ్బిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పేదలకు ఉచిత న్యాయ సేవలందిచడమంటే కుమారికి ఎంతో ఇష్టమని ఆమె తండ్రి పవన్‌కుమార్ బొదాని వెల్లడించారు. తన కూతురు చాలెంజింగ్ ప్రొఫెషన్‌ను ఎంచుకుందని అన్నారు. పవన్‌కుమార్ డాక్టర్ కాగా, ఆయన మిగతా ఇద్దరు కూతుళ్లలో ఒకరు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకరు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పాకిస్తాన్లో జడ్జిగా పనిచేసిన తొలి హిందువుగా జస్టిస్ రానా భగవాన్‌దాస్ నిలిచారు. 2005 నుంచి 2007 వరకు సుప్రీం కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన సేవలందించారు. కాగా, సివిల్ జడ్జి/జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ నియమాలకు జరిగిన పరీక్షలో కుమారి 54 స్థానంలో నిలిచారు. Suman Pawan Bodani becomes Pakistan’s 1st female judge belonging to the Hindu community. Via Pakistan Hindu Youth Council. Daughter of Dr. Pawan Podani, Suman belongs to Shahdadkot. She stood 54th in merit list for the appointment of Civil Judge/Judicial Magistrate. pic.twitter.com/ofqgwSA6Kt — Danyal Gilani (@DanyalGilani) January 27, 2019 -
మానవత్వాన్ని చాటుకున్న న్యాయమూర్తి
► గుండెనొప్పితో కిందపడిన నిందితుడు ► జైలుకు కాకుండా ఆస్పత్రికి తరలించాలని ఆదేశం హైదరాబాద్: కోర్టులో ముద్దాయిలకు శిక్ష వేసే న్యాయమూర్తులకు గుండె కటువుగా ఉంటుందంటారు. వారు న్యాయన్యాయల గురించి మాత్రమే ఆలోచిస్తారని చాలా మంది నమ్మకం. కానీ వారిలో కూడా సున్నిత మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వారికి ఏదైనా జరిగితే చలించే గుణం ఉంటుంది. సరిగ్గా అలాంటి సంఘటన హైదరాబాద్నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో జరిగింది. కేసు విచారణలో ఉన్న సమయంలో గుండెనొప్పితో కిందపడిపోయిన ఓ నిందితుడిని ఆస్పత్రికి తరలించాలని ఆదేశించి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళ్తే నాంపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ అష్రఫ్(70)కు మోజంజాహీ మార్కెట్లో షాలిమార్ వీడియో క్యాసెట్ దుకాణం ఉంది. ఈ దుకాణంలో వాటాల కోసం అతని తమ్ముడి భార్య షమీనా భాను ఈ ఏడాది ఫిబ్రవరి 24న బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అష్రఫ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి శుక్రవారం 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి. శ్రీనివాస్‌రావు ఎదుట హాజరుపరిచారు. దీంతో అతడిని రిమాండ్‌కు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అకస్మాత్తుగా నిందితుడు గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాలని మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు పోయేవని వైద్యులు చెప్పారు. సకాలంలో స్పందించిన న్యాయమూర్తికి అష్రఫ్ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయమూర్తి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా చలించిపోయారు.