Classes Session
-
మళ్లీ కరోనా కలకలం.. ఆఫ్‌లైన్ క్లాస్‌లు నిలిపివేత
A school in Uttar Pradesh’s Ghaziabad suspended offline classes: కరోనా ముప్పు తగ్గలేదని జాగ్రత్తగా ఉండాల్సిందేనంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కి సంబంధించిన మ్యూటెంట్ కేసులు ముంబైలో నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అదీగాక ప్రధాని నరేంద్ర మోదీ సైతం కోవిడ్ ముప్పు ముగిసిపోయిందని అనుకోవడానికి వీల్లేదని జాగ్రత్తగ ఉండాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వైశాలిలో కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా స్కూల్ యజమాన్యం ఆఫ్‌లైన్ క్లాస్‌లను నిలిపేసింది. ఈ మేరకు స్కూల్ యాజమాన్యం రెండు రోజులపాటు ఆఫ్‌లైన్ క్లాస్‌లను నిషేధించడమే కాకుండా ఆన్లైన్ మోడ్‌లోనే క్లాస్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అంతేగాదు విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా తల్లిదండ్రులు కోవిడ్ ప్రోటోకాల్‌ని పాటించాలని పిలుపునిచ్చింది. ఇటీవలే ఘజియాబాద్‌లోని ఒక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి మరువక ముందే కొద్దిరోజుల్లోనే మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తెరవాలని, యథావిధిగా తరగతులకు ప్రారంభించాలని ఆదేశించడం గమనార్హం. (చదవండి: కరోనా ముప్పు తొలగలేదు) -
1 నుంచి 8 తరగతులకు ఆన్లైన్ పాఠాలే..
సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ఉంటుందా? ఉండదా? అంటే ఉండకపోవచ్చుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు.. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే ఎదురయ్యే సవాళ్లు, సమస్యల నేపథ్యంలో వారికి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు వెనుకంజ వేస్తోంది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రారంభించిన ప్రత్యక్ష బోధనను మాత్రమే కొనసాగించే యోచనలో ఉంది. ఇటు మిగతా తరగతుల విద్యార్థులను ప్రస్తుతమున్న ఆన్లైన్/డిజిటల్ (టీవీ పాఠాలు) పాఠాలకే పరిమితం చేసే ఆలోచనల్లోనే విద్యాశాఖ ఉంది. అంతేకాదు వారికి బోర్డు ఎగ్జామ్స్ కాదు కాబట్టి ఎలాంటి పరీక్షల నిర్వహణ లేకుండానే పైతరగతులకు పంపించే దిశగానే అడుగులు వేస్తోంది. ‘భౌతిక దూరం’కష్టమనే.. కరోనా కారణంగా పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారైంది. కార్పొరేట్, బడా ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు తీసుకున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని, చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలు అటు ఆన్లైన్ తరగతులు నిర్వహించలేకపోవడంతో అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. కొన్ని యాజమాన్యాలైతే స్కూళ్లను పూర్తిగా మూసేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు త్వం గత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్/డిజిటల్ (టీవీ పాఠాలను) ప్రారంభించింది. టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా వీడియో పాఠాలను ప్రభుత్వ విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆన్లైన్ బోధన చేపట్టలేని మరికొన్ని సాధారణ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం అందిస్తున్న వీడియో పాఠాలనే చూడా లని తల్లిదండ్రులకు సూచించాయి. మొన్నటివరకు అ లాంటి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వీడియో పాఠాలనే విన్నారు. చివరకు ఈనెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. పాఠశాలల్లో భౌతిక దూరం పాటిస్తూ, బెంచీకి ఒకరు చొప్పున, తరగతి గదిలో 20 మంది మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. గతంలో ఒక్కో తరగతికి చెందిన వారు ఒకే గదిలో 70–80 మంది కూర్చునే విద్యార్థులను మూడు నాలుగు తరగతి గదుల్లో కూర్చోబెట్టారు. వారికి బోధించేందుకు ఉన్నత పాఠశాలల్లోని టీచర్లతో పాటు 5 వేల మంది వరకు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై ఉన్నత పాఠశాలలకు పంపించారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం బెంచీకి ముగ్గురు నలుగురు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. భౌతిక దూరం పాటించడం అనేది లేకుండా పోయింది. 6, 7, 8 తరగతులు ప్రారంభించాలనుకున్నా.. పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించిన సమయంలోనే 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే ఆలోచన చేశారు. అయితే 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన సమయంలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూసి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే పాఠశాలల్లో కరోనా వ్యాప్తి లేకపోయినా, ప్రైవేటు పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 18 రోజులు దాటింది. అయితే కోవిడ్ నిబంధనల అమలు ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగా సాధ్యం కావడం లేదనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, ఏదైనా అనుకోని సమస్య వస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఒక్క విద్యార్థికి కరోనా ఉన్నా అది ఇతరులకు సులభంగా సోకే ప్రమాదముంది. పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతులను ప్రారంభిస్తే ఇంకా అదనపు టీచర్లు కావాలి.. గత విద్యా సంవత్సరంలో తీసుకున్న 12 వేల మంది విద్యా వలంటీర్లకు మించి ఇంకా అదనంగా తీసుకోవాలి. ఇటు అదనపు తరగతి గదులు అవసరముంటుంది. ఈ నేపథ్యంలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయడమే మంచిదన్న అభిప్రాయంలోనే అధికారులున్నారు. మరోవైపు మార్చి నెలలో 6, 7, 8 తరగతులను ప్రారంభించినా ఈ సమస్యలు వస్తాయని, పైగా మార్చిలో వేసవి ఎండలు ఎలా ఉంటా యో తెలియదు.. ఒంటిపూట బడులనే కొనసాగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధన అవసరమా? తల్లిదండ్రులు పంపిస్తారా? అన్న సందిగ్ధం ఉన్నతాధికారుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఓసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చూద్దామనే ఆలోచన చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రాథమిక పాఠశాలలు) మాత్రం ప్రత్యక్ష బోధన అవసరమే లేదనే అభిప్రాయంలో అధికారులున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న హాజరు శాతం: మంత్రి సబిత రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తుండటంతో 9,10 తరగతుల విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో తరగతుల నిర్వహణపై గురువారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నందున విద్యార్థులు ప్రత్యక్ష తరగతుల హాజరుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 1న విద్యార్థుల హాజరును పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 48%, మోడల్ స్కూళ్లలో 37%, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6%, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 19%, ప్రైవేట్ పాఠశాలల్లో 46% ఉందన్నారు. ఇక ఈ నెల 17న చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 72%, మోడల్ స్కూళ్లలో 69%, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో 71%, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 85%, ప్రైవేట్ పాఠశాలల్లో 69 శాతానికి హాజరు పెరిగిందన్నారు. -
‘కార్పొరేట్’కు దీటు సిద్దిపేట స్కూల్
సాక్షి, సిద్దిపేట: డిజిటల్ తరగతి గదులు.. ‘గూగుల్’బోధన అంతా కార్పొరేట్ పాఠశాలలకే పరిమితం.. అయితే వాటిలో చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయలు చెల్లించాల్సిందే.. కానీ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ‘కార్పొరేట్’కు దీటుగా బోధన సాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఉపాధ్యాయులే తిరిగి బడిలో చేర్పిస్తుంటే.. ఇక్కడ మాత్రం గతేడాది జూన్ రెండో వారంలోనే పాఠశాలల్లో ప్రవేశాలు లేవు.. అన్ని క్లాసుల్లో సీట్లు భర్తీ చేశామని బోర్డులు పెట్టిన సంఘటనలున్నాయి.. నిత్యనూతన ఒరవడిని ప్రవేశపెట్టే ప్రధానోపాధ్యాయుడు, అధునాతన పద్ధతుల్లో బోధించే ఉపాధ్యాయులు.. పాఠశాలకు ఏం కావాలన్నా క్షణాల్లో సమకూర్చే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు.. ఇలా అందరి అంకితభావంతో నడిచే ఆ స్కూల్లో చదవడమే వరంగా విద్యార్థులు భావిస్తారు. ట్యాబ్‌లు సమకూర్చిన మంత్రి హరీశ్‌రావు ఇందిరానగర్ పాఠశాలలో టెన్త్ విద్యార్థులు 187 మంది ఉన్నారు. వీరిలో స్మార్ట్ఫోన్లు లేని దాదాపు 40 మందికిపైగా విద్యార్థులకు మంత్రి హరీశ్‌తో పాటు ఆయన ప్రోద్బలంతో మరికొందరు దాతలు ట్యాబ్‌లను సమకూర్చారు. అలాగే, 12 మంది ఉపాధ్యాయులకు కూడా సెల్ఫోన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ‘గూగుల్’బోధనకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడి వద్ద ‘మాస్టర్ కీ’ఉంటుంది. దీని ద్వారా ప్రత్యేకించి టెన్త్ విద్యార్థులకు ఆన్లైన్ బోధన ఎలా సాగుతుందో.. ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారు.. విద్యార్థుల ప్రగతి ఎలా ఉందో స్వయంగా పర్యవేక్షిస్తారు. మొత్తం బోధన ప్రక్రియ అంతా ఆయన కనుసన్నల్లోనే కొనసాగుతుంది. రోజూ ప్రధానోపాధ్యాయుడు సబ్జెక్టుల్లో వెనుకబడిన, ఆన్లైన్లో ఇబ్బందులు పడుతున్న 10 మంది విద్యార్థులను గుర్తించి.. వారితో పాటు వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తారు. ముందుగా శిక్షణ.. కరోనా విద్యార్థుల విలువైన భవిష్యత్‌ను నాశనం చేసింది. సామాజిక దూరం పేరుతో ఇప్పటివరకు స్కూళ్లు తెరుచుకోలేదు. అయితే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కలసి వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా ఎక్కడ ఏ లోటు రాకుండా బోధన సాగిస్తున్నారు. అయితే ఇందుకోసం ముందుగా 15 రోజులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా విద్యార్థులకు ప్రధానంగా పదో తరగతి విద్యార్థులకు గూగుల్ టూల్స్, వాటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. డాక్యుమెంట్స్ తయారీ, స్లైడ్స్ తయారీ, అస్సెస్మెంట్స్ అండ్ సర్వీస్, లైవ్ ఇంటరాక్షన్, మేనేజ్ స్టూడెంట్స్ వర్క్స్, జూమ్‌లో బోధన, అన్ని సబ్జెక్టుల సిలబస్ డౌన్లోడ్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, నోట్స్, సైన్స్ లేబొరేటరీ వినియోగం, సైన్స్ వీడియోల పరిశీలన, సోషల్ మ్యాప్స్–ముఖ్య పట్టణాల గుర్తింపు, క్విజ్ పోటీల నిర్వహణ, సోషల్ పజిల్స్ మొదలైన వాటిని డౌన్లోడ్ చేసుకోవడం, చదివిన అంశాలను యాప్‌లో పొందుపరిచేలా విద్యార్థులను సంసిద్ధం చేశారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా రీజనింగ్ అండ్ అర్థమేటిక్స్ మొదలైనవి బోధిస్తున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది డిసెంబర్ వరకు పదో తరగతి విద్యార్థుల సిలబస్ పూర్తి చేశారు. ఎప్పుడు పరీక్షలు పెట్టినా పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతిరోజూ తల్లిదండ్రులతో ముఖాముఖి విద్యార్థులు ఏం చదువుతున్నారు? సెల్ఫోన్లో ఏం డౌన్లోడ్ చేసుకున్నారు? నోట్స్ ఎలా సిద్ధం చేస్తున్నారు? వంటి విషయాలు తెలుసుకునేందుకు నిత్యం 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలతో స్కూలుకు వస్తున్నారు. ఫోన్ పరిశీలన, అనుమానాలు, సందేహాలను ఉపాధ్యాయుల సమక్షంలో నివృత్తి చేసుకోవడం చేపడుతున్నారు. ఈ సందర్భంగా ‘గూగుల్’ క్లాసులు ఉపాధ్యాయులకు తీరిక ఉన్నప్పుడు కాకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్లో చదివే వారు ఎక్కువగా కూలీలు, వ్యవసాయం చేసే వారి పిల్లలే. దీంతో వారికి ఫోన్లు అందుబాటులో ఉండే సమయాల్లోనే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా క్లాసులు వింటున్నాం ముందుగా గూగుల్ ఇన్పుట్ టూల్స్‌ను నేర్చుకున్నాం. ఇప్పుడు సులభంగా పాఠాలు వింటున్నాం. ఏరోజు అసైన్మెంట్ ఆ రోజు చేసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి తిరిగి యాప్‌లో పెడుతున్నాం. టీచర్లు వాటిని దిద్ది మార్కులు వేస్తున్నారు. అసైన్‌మెంట్‌లో ఏమైనా తప్పులుంటే వాటికి వివరణ పెడుతున్నారు. – మోహిద్, పాఠశాల విద్యార్థి నెలకోసారి స్కూల్‌కు.. ఆన్లైన్ తరగతుల్లో భాగంగా పిల్లల చేతిలో సెల్‌ఫోన్ ఉంటుంది. పాఠాలెలా చెబుతున్నారు? ఫోన్లో ఏం డౌన్లోడ్ చేసుకుంటున్నారు? మార్కులు ఎలా వస్తున్నాయి? మొదలైన విషయాలు తెలుసుకొనేందుకు నెలకోసారి పిల్లలతో స్కూల్‌కు వెళ్తున్నాం. అక్కడ టీచర్లతో మేం మాట్లాడతాం. పిల్లల ప్రవర్తన, ఇతర విషయాలు చర్చిస్తాం. – రూప, విద్యార్థి తల్లి సమష్టి కృషితోనే బోధన.. పాఠశాలలోని ఉపాధ్యాయులందరి కృషి ఫలితంగానే ‘గూగుల్’బోధన చేపడుతున్నాం. ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. తర్వాత పిల్లలకు శిక్షణ ఇచ్చి టూల్స్‌పై అవగాహన కల్పించాం. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. నిరుపేద విద్యార్థులకు మంత్రి హరీశ్ సహకారంతో ఫోన్లు కొనుగోలు చేసి ఇచ్చాం. మా పాఠశాలకు ఏ అవసరమొచ్చినా అడగ్గానే కాదనకుండా మంత్రి సమకూర్చుతున్నారు. పదో తరగతి సిలబస్ ఇప్పటికే పూర్తి చేశాం. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు.. – రామస్వామి, ప్రధానోపాధ్యాయుడు -
‘షిఫ్ట్’లో డిగ్రీ క్లాస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తరగతుల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి, జేఎన్టీయూ దృష్టి సారించాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10, ఆపై తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ ప్రత్యక్ష విద్యా బోధనపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మరోవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రత్యక్ష బోధనకు జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తోంది. అందరికీ ఒకేసారి కష్టమే: రాష్ట్రంలో వేయికి పైగా డిగ్రీ కాలేజీల్లో దాదాపు 7 లక్షలమంది చదువుతున్నారు. అందులో ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు 4.65 లక్షల మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు 2.35 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా శానిటైజేషన్ వంటి కోవిడ్ నిబంధనలను పాటించడం, భౌతిక దూరం నిబంధనను అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరినీ ఒకేసారి అనుమతించి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే భౌతిక దూరం పాటించడం కష్టంగా మారనుంది. అందుకే షిఫ్ట్ పద్ధతుల్లో ప్రత్యక్ష బోధన విధానం అమలు చేయాలని భావిస్తోంది. దీని ప్రకారం బీఏ, బీకాం వంటి కోర్సుల విద్యార్థులకు ఉదయం సమయంలో తరగతులను నిర్వహించడం, బీఎస్సీ, బీబీఏ, వొకేషనల్, ఇతర కోర్సుల వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్ష బోధన అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. అందుకు అనుగుణంగా టైం టేబుల్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్‌కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల మేరకు యూనివర్సిటీలు, హాస్టళ్ల ప్రారంభంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. బీటెక్ ఫస్టియర్‌కు ఫిబ్రవరి 15 నుంచి.. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తరగతుల నిర్వహణపై జేఎన్టీయూ కసరత్తు ప్రారంభించింది. అయితే దశల వారీగా ఇంజనీరింగ్‌లో (బీటెక్), బీ ఫార్మసీ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముందుగా బీటెక్ తృతీయ, నాలుగో సంవత్సరాల తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఇక ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వారికి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని భావిస్తోంది. బీటెక్‌లోనూ షిఫ్ట్ పద్ధతిలో బోధనపైనా జేఎన్టీయూ ఆలోచనలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తే, తృతీయ, నాలుగో సంవత్సరం వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులను నిర్వహిస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. వీటిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. తద్వారా మే నెలాఖరు నాటికి అన్ని సంవత్సరాల వారి బోధనను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒక్కో సంవత్సరంలో రెండు సెమిస్టర్ల పరీక్షల్లో ఒక సెమిస్టర్ పరీక్షలను మార్చి నెలలో, తదుపరి సెమిస్టర్ పరీక్షలను జూన్‌లో నిర్వíßహించేలా కసరత్తు చేస్తోంది. ఇక ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే సమయంలో విద్యార్థులకు ల్యాబ్ సంబంధిత బోధన చేపట్టనుంది. మిగతా థియరీని ఆన్లైన్లో వినేలా ఏర్పాట్లు చేస్తోంది. వేసవి ఎండలు మొదలవుతాయి కనుక పరిస్థితిని బట్టి మార్చి ఒకటో తేదీ నుంచి మాత్రం అన్ని తరగతుల వారికి ప్రత్యక్ష బోధనను కొనసాగించేలా కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇక ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తరగతులకు సంబంధించి నిర్ణయం తీసుకునే బాధ్యతలను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకే అప్పగించింది. నేడు రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి భేటీ.. డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహణపై వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటించడం, షిఫ్ట్ పద్ధతిని అమలు చేయడం, ఇతరత్రా అంశాలపై మరింత లోతుగా చర్చించేందుకు సోమవారం (18న) ఉదయం యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌లో రెండు విధానాలు.. ఇంజనీరింగ్, ఫార్మసీలో ఆన్లైన్/ఆఫ్‌లైన్ రెండు విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులను వింటారని, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో తరగతులు వినేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుందని వివరించారు. -
1 నుంచి ‘మెడికల్’ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతుల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలో మొదటి ఏడాది తరగతులు ప్రారంభిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తున్నందున కాలేజీలను తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని మెడికల్ కాలేజీలను విశ్వవిద్యాలయం ఆదేశించింది. అయితే రెండో ఏడాది నుంచి చివరి ఏడాది వరకు వైద్య విద్య తరగతుల ప్రారంభం ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా నిర్ణయం జరగలేదు. వాస్తవానికి డిసెంబర్ 1 నుంచే తరగతులు నిర్వహించాలని ఎన్ఎంసీ రాష్ట్రాలను ఆదేశించింది. దాదాపు 12 రాష్ట్రాల్లో ఆ మేరకు తరగతులు ప్రారంభమయ్యాయి. చదవండి: విక్రమ్‌కు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వండి కానీ రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆసక్తి కనబరచకపోవడం, కరోనా నేపథ్యంలో సర్కారు వెనకడుగు వేయడంతో ఇప్పటివరకు రెండో ఏడాది ఆపై విద్యార్థుల తరగతులను ప్రారంభించలేదు. అయితే 9వ తరగతి నుంచి జూనియర్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యకు సంబంధించి కాలేజీలు ఒకటో తేదీ నుంచి తెరుచుకోవడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ రెండో ఏడాది, ఆపై వైద్య విద్య తరగతుల విషయంపై రాష్ట్ర సర్కారు ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే మెడికల్ కాలేజీలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సర్కారుకు ప్రతిపాదనలు పంపించామని కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నాయి. ఆయా తరగతులు కూడా మొదటి ఏడాది వైద్య విద్య తరగతులతోనే ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాళోజీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే.. మొత్తం 55 వేల మంది విద్యార్థులు... కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ సహా ఇతర అన్ని రకాల కాలేజీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపు 55 వేల మంది ఉంటారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. 33 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు విద్యార్థుల సంఖ్య 20 వేల మంది వరకు ఉంటారు. మరో 20 వేల మంది నర్సింగ్ విద్యార్థులు, 6 వేల మంది డెంటల్ విద్యార్థులు, 5 వేల మంది పిజియోథెరపీ విద్యార్థులు, మిగిలినవారు ఆయుష్ సహా ఇతరత్రా కోర్సులకు చెందినవారు ఉంటారని తెలిపింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 5,040 మంది ఉంటారని విశ్వవిద్యాలయం పేర్కొంది. కరోనా టెస్టులు చేశాకే అనుమతి... మెడికల్ కాలేజీల పునఃప్రారంభం నేపథ్యంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కాలేజీలు తెరిచాక పాటించాల్సిన నిబంధనలు, దానికి ముందు చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీచేసింది. కరోనాతో గతేడాది మార్చి నుంచి మెడికల్ కాలేజీలన్నీ మూతబడ్డాయి. అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అకడమిక్ షెడ్యూల్ ప్రకారం అన్ని థియరీ క్లాసులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రాక్టికల్, క్లినికల్ క్లాసులు నిర్వహించడానికి, చివరి సంవత్సరం విద్యార్థుల కోసం కాలేజీలను ప్రధానంగా తెరవాల్సి ఉంది. మార్గదర్శకాలు ఇవి... ► కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని నెగెటివ్ రిపోర్ట్ ఉన్న వారినే కాలేజీల్లోకి అనుమతించాలి. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష తప్పనిసరి. ► జలుబు, దగ్గు, శ్వాస సంబంధ లక్షణాలుంటే కాలేజీలోకి అనుమతించొద్దు. ► తమ అనుమతితోనే పిల్లలను పంపిస్తున్నట్లు తల్లిదండ్రులు లిఖితపూర్వక లేఖ ఇవ్వాలి. ► విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. ఉమ్మివేయడం నిషేధం. ► కచ్చితంగా మాస్క్ ధరించాలి. ఆరోగ్యసేతు యాప్‌ను విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో ఉపయోగించాలి. ► ప్రతి కాలేజీలో టాస్క్‌ఫోర్స్ లేదా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ టీంను ఏర్పాటు చేసుకోవాలి. ► రెండు షిఫ్టులుగా లేదా రొటేషన్ పద్ధతిలో ప్రాక్టికల్స్, థియరీ తరగతులు నిర్వహించాలి. ► థియరీ క్లాసులను ఆన్లైన్ ద్వారా నడిపించడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కరోనా వ్యాప్తి తగ్గే వరకు దీన్ని కొనసాగించాలి. విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించాలి. ► హాస్టల్ గదుల్లో ఒకరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► మెస్‌లో టైం స్లాట్ ప్రకారం విద్యార్థులకు భోజన, అల్పాహారం ఏర్పాట్లు చేయాలి. ► విద్యార్థులు ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి. -
సాలీడు.. గూడు ఎలా కడుతుంది?
‘‘అమ్మా! ఆకుకూరలు ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?’’ ‘‘నాన్నా! గడ్డి పచ్చగా ఉంటుంది ఎందుకు?’’ ‘‘నానమ్మా! చంద్రుడు గుండ్రంగా ఉంటాడెందుకు?’’ బాల్యం అంటేనే సందేహాల సమాహారం. బుర్రకో సందేహం. ఆ సందేహాన్ని తీర్చేలోపు మరో సందేహం... ప్రశ్నోత్తర పరంపర సీరియల్‌గా సాగుతూనే ఉంటుంది. మెదడు వికసించే దశలో ఉదయించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కొంచెం కష్టమే. పిల్లల ప్రతి ప్రశ్నకూ సమాధానాలుంటాయి. కానీ సమాధానాలన్నీ తెలిసిన తల్లిదండ్రులు దాదాపుగా ఉండరు. తమకు తెలిసిన సబ్జెక్టులో ప్రశ్న అయితే ఠక్కున వివరించగలుగుతారు. తెలియని విషయమైతే గూగుల్‌లో సెర్చ్ చేసి చెప్పగలుగుతున్నారు ఈ తరం పేరెంట్స్ కొందరు. పిల్లల పెట్టే రొటీన్ పరీక్షలకు తోడు ఈ ఏడాది కరోనా కొత్త పరీక్ష పెట్టింది. కరోనా కోరల నుంచి పిల్లలను రక్షించుకోవడానికి కళ్లలో వత్తులు వేసుకుని కాపాడుకుంటున్నారు. టీవీ పెడితే కరోనా వార్తలే. సోషల్ మీడియాలోనూ కరోనా కలకలమే. కరోనా పాజిటివ్ కేసులు, క్వారంటైన్, కరోనా నెగిటివ్ కేసులు, కరోనా మరణాల వార్తల మధ్య పిల్లల మెదళ్లు కొత్తగా ఆలోచించడం మానేశాయి. ఎంతసేపూ ఏదో తెలియని ఆందోళన. తల్లిదండ్రుల భయం తెలుస్తుంటుంది. పిల్లల పట్ల అమ్మానాన్నలు తీసుకుంటున్న శ్రద్ధ... పిల్లలకు భయం తీవ్రతను అర్థం చేయిస్తుంటుంది. విజ్ఞానంతో వికసించాల్సిన చిన్న మెదళ్లలో ఆందోళన పురుడు పోసుకోవడం ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే మొదలైంది. ఈ పరిస్థితిని గమనించిన కరిష్మా కౌశిక్, స్నేహాల్ కాదమ్ అనే సైంటిస్టులు పిల్లల కోసం మార్చిలో ‘టాక్ టు ఎ సెంటిస్ట్’ పేరుతో ఉచిత ఇంటరాక్టివ్ వెబినార్ ప్రయోగం చేశారు. అది విజయవంతమైంది. పిల్లలు సోమవారం సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నారు. టాక్ టు ఎ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కరిష్మా కౌశిక్, స్నేహాల్ కాదమ్ ఇద్దరూ పుణే యూనివర్సిటీలో సైంటిస్టులు. తన పదేళ్ల కొడుకు అడిగే ప్రశ్నల నుంచి వచ్చిన ఆలోచనే ‘టాక్ టు ఎ సైంటిస్ట్’ అని చెప్పింది కరిష్మ. ఆరేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు పిల్లలను దృష్టిలో పెట్టుకుని విషయాల రూపకల్పన చేసినట్లు చెప్పిందామె. ప్రతి సోమవారం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు గంట సేపు సాగే టాక్ టు ఎ సైంటిస్ట్ ప్రోగ్రామ్ పట్ల పిల్లలు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పింది స్నేహాల్. ఈ ఇద్దరు సైంటిస్టులు స్వయంగా కొన్ని విషయాలను వివరిస్తారు. జూమ్‌లో సాగే ఈ ‘టాక్ టు ఎ సైంటిస్ట్’ కార్యక్రమానికి ఇతర సైంటిస్టులను అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. క్లాసు పుస్తకంలో సైన్సు పాఠం చదవాలంటే ముఖం చిట్లించుకునే పిల్లలు కూడా ఈ వెబినార్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సాలెపురుగు గూడు ఎలా కట్టుకుంటుందనే ఆసక్తి లేనిదెవరికి? పిల్లలందరూ కళ్లింత చేసుకుని చూశారు. మరోవారం కణ నిర్మాణం గురించి ప్రెజెంటేషన్‌ను కూడా ఆసక్తిగా ఆస్వాదించారు. గెస్ట్ సైంటిస్ట్ ఒకరు అరటికాయ నుంచి డిఎన్ఎను సేకరించడం ఎలాగో చూపించారు. ఇందులో తెలుసుకున్నవన్నీ పిల్లల మెదళ్ల మీద అలా నాటుకుపోతాయని తప్పకుండా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవేవీ ఆ చిన్న మెదళ్లకు పరీక్షలు పెట్టవు. మార్కుల ఒత్తిడి ఉండదు. పాఠం అర్థం చేసుకుని అడిగిన ప్రశ్నకు వెంటనే బదులివ్వాలని, జవాబు చెప్పలేకపోతే టీచర్ ముఖం అప్రసన్నంగా మారుతుందేమోననే భయం కూడా ఉండదు. పిల్లలకు అంతకంటే పెద్ద సాంత్వన మరేం ఉంటుంది? ఈ వెబినార్‌లో పిల్లలు సందేహాలను ధైర్యంగా అడుగుతున్నారు. తమకు తెలిసిన విషయాలను సంతోషంగా పంచుకుంటున్నారు. అందుకే సోమవారం సాయంత్రం కోసం అంతటి ఎదురు చూపు. -
ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారా?
ఇటీవల కరోనా విస్తరించిన నాటి నుంచి చిన్నక్లాసుల వారినుంచి మొదలుకొని... ఇంటర్మీడియట్ వరకూ పిల్లల్లో చాలామంది ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు. వీళ్లలో కొందరు తమ మొబైల్స్‌లో క్లాసులు చూస్తుంటే... మరికొందరు ఇళ్లలోని కంప్యూటర్ ముందు కూర్చుని క్లాసులు అటెండ్ అవుతుంటారు. అది మొబైల్ అయినా... కంప్యూటర్ అయినా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పిల్లల్లో వచ్చే మెడనొప్పులు, నడుం నొప్పులు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం. సాధారణంగా చిన్నపిల్లలోనూ, టీనేజ్ పిల్లల్లోనూ ఒళ్లునొప్పులు, మెడనొప్పి, నడుంనొప్పి వంటి సమస్యలు రావడం అరుదు లేదా ఒకింత తక్కువే అని చెప్పవచ్చు. అయితే ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యే క్రమంలో అదేపనిగా ఒకే భంగిమలో (పోష్చర్‌లో) కూర్చోవడం వల్ల కొందరిలో ఒళ్లునొప్పులు, నడుం నొప్పులు రావచ్చు. అందుకే ఎలాగూ క్లాసులకు అటెండ్ కావడం ఇంటిలోనే జరుగుతుంది కాబట్టి... ప్రతి అరగంటకూ, లేదా 45 నిమిషాలకొకసారి కాస్తంత లేచి కూర్చోవడం, కూర్చున్న పోష్చర్ మార్చుకుంటూ ఉండటం అవసరం. పిల్లలు వీలైనంతవరకు వెనక ఆను ఉన్న కుర్చీలో... వెనక్కు ఆనుకుని నిటారుగా కూర్చోవడం మంచిది. వెనక ఆనుకునే సౌకర్యం లేకుండా ఒకవేళ మంచం, సోఫా, ఈజీ చెయిర్లో కూర్చున్నప్పుడు వీపుకి సరైన ఆధారం లేకుండా అదేపనిగా కూర్చోవడమో లేదా గంటకు మించి కూర్చోవడమో చేయకూడదు. క్లాసులకోసం ఆనుకునే సౌకర్యం ఉన్న కుర్చీ అందునా నిలువుగా కూర్చోగలిగేదే ఎంచుకోండి. నోట్స్ రాసేటప్పుడు రైటింగ్ ప్యాడ్లను వాడండి. ఇలా రాసే సమయంలో పూర్తిగా ముందుకు ఒంగిపోకండి. రాశాక లేదా రాసే క్రమంలో మాటిమాటికీ మెడలు పైకి లేపుతూ నిటారుగా మారుతూ ఉండండి. కంప్యూటర్‌కూ లేదా మొబైల్ పెట్టుకోడానికి తగినంత సౌకర్యంగానూ, సరైన ఎత్తులో ఉండే టేబుల్‌పైన వాటిని అమర్చుకోండి. మీకు బాగా కంఫర్టబుల్‌గా ఉన్న పోష్చర్‌ను ఎంచుకున్న తర్వాత దాన్ని పదే పదే మార్చకండి. మెడ, నడుము ఇలా ఎక్కడైనా నొప్పి వస్తే మీరు కూర్చునే భంగిమ మార్చి మార్చి ప్రయత్నించండి. ఒకవేళ ఎప్పుడైనా మెడ లేదా నడుము లేదా ఒళ్లునొప్పులు వస్తే నేరుగా నొప్పి నివారణ మందులు వాడకండి. నొప్పి వచ్చిన చోట వేడి నీటి కాపడాన్ని పెట్టుకోండి. రోజులో రెండు సార్లు పెట్టుకుంటూ ఉంటే చాలావరకు ఉపశమనం ఉంటుంది. అప్పటికీ నొప్పి తగ్గక పోతే ఫిజిషియన్‌కు చూపించండి. క్లాసెస్ అటెండ్ అవుతూ వ్యాయామాన్ని విస్మరించకండి. ఈ కరోనా సీజన్లో బయటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోతే ఇంట్లోనే తేలికపాటి శారీరక శ్రమ, తేలికపాటి వ్యాయామాలు చేయండి. -డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ మెడిసిన్ స్పెషలిస్ట్ -
ఆన్లైన్ క్లాసుల పై హైకోర్టు విచారణ
-
కరువు సీమకు కల్పతరువు..
సాక్షి, అనంతపురం : ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్శిటీ జిల్లాలో ప్రారంభం కానుంది. యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని, ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాశ్వత భవనాలను నిర్మించేంత వరకు తరగతులను తాత్కాలికంగా ఎస్కేయూ, జెఎన్‌టియూ క్యాంపస్‌లో నిర్వహిస్తామని తెలిపారు. గత విద్యాసంవత్సరం నుంచే సెంట్రల్ యూనివర్శిటీ తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తరగతుల నిర్వహణకు సరైన స్థలాన్ని గుర్తించాలని కమీషనర్ పాండాదాస్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఉన్నతాధికారులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా యూనివర్శిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సాంకేతిక విద్యను అందిస్తున్న జెఎన్‌టియూ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుతో జిల్లాలో మూడు యూనివర్శిటీలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయనున్నాయి. కురువు సీమను విద్యా సీమగా చూడాలన్నదే మా లక్ష్యమని మంత్రి తెలిపారు. -
ప్రజలు బండకేసి కొడతారు.. జాగ్రత్త!
హైదరాబాద్: రాజకీయ నాయకులకు పదవులు రావడం గొప్ప కాదని.. వాటిని కాపాడుకోవడం గొప్పని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నాయకులను నమ్మితే భుజానెత్తుకుంటారని...లేకపోతే బండకేసి కొడతారని ఆయన హెచ్చరించారు. గతంలో గ్రేటర్ ఎన్నికలు ఉండాలా.. వద్దా? అని సర్వే చేస్తే మెజారిటీ ప్రజలు వద్దన్నారని చెప్పారు. గతంలో పనిచేసిన కార్పొరేటర్లకు చెడ్డపేరు ఉండటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అలాంటి విధానాల నుంచి బయటకు రావాలన్నారు. అమలుకాని హామీలను ఇవ్వకూడదని, మనం చేయగలిగింది మాత్రమే ప్రజలకు చెప్పాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని కేసీఆర్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాలు గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎవరూ లంచాలు ఇవ్వొద్దని..దళారులను ఆశ్రయించొద్దని కేసీఆర్ ప్రజలకు సూచించారు.