ప్రజలు బండకేసి కొడతారు.. జాగ్రత్త! | CM KCR Speaks in GHMC Corporators Classes Session | Sakshi
Sakshi News home page

ప్రజలు బండకేసి కొడతారు.. జాగ్రత్త!

Published Mon, Apr 11 2016 1:36 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ప్రజలు బండకేసి కొడతారు.. జాగ్రత్త! - Sakshi

ప్రజలు బండకేసి కొడతారు.. జాగ్రత్త!

హైదరాబాద్: రాజకీయ నాయకులకు పదవులు రావడం గొప్ప కాదని.. వాటిని కాపాడుకోవడం గొప్పని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు.

సోమవారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నాయకులను నమ్మితే భుజానెత్తుకుంటారని...లేకపోతే బండకేసి కొడతారని ఆయన హెచ్చరించారు. గతంలో గ్రేటర్ ఎన్నికలు ఉండాలా.. వద్దా? అని సర్వే చేస్తే మెజారిటీ ప్రజలు వద్దన్నారని చెప్పారు. గతంలో పనిచేసిన కార్పొరేటర్లకు చెడ్డపేరు ఉండటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అలాంటి విధానాల నుంచి బయటకు రావాలన్నారు.

అమలుకాని హామీలను ఇవ్వకూడదని, మనం చేయగలిగింది మాత్రమే ప్రజలకు చెప్పాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని కేసీఆర్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాలు గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎవరూ లంచాలు ఇవ్వొద్దని..దళారులను ఆశ్రయించొద్దని కేసీఆర్ ప్రజలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement