Clay Ganesha
-
చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు (ఫొటోలు)
-
చిన్నారుల చేతుల్లో మట్టి గణపతి (ఫొటోలు)
-
తిరుపతిలో చిన్నారులకు మట్టి విగ్రహాల తయారీ సామాగ్రి అందజేత
-
విజయవాడలో మట్టి వినాయకుని కిట్లు అందజేత
-
తెలుగు రాష్ట్రాల్లో మట్టి గణపయ్యల సందడి
-
మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
చేవెళ్ల: మండల కేంద్రంలోని బస్‌స్టేషన్‌లో శనివారం మట్టి వినాయక ప్రతిమలను డీఎస్పీ శృతకీర్తి ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక యువకులు ఈ మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..పర్యావరణ కాలుష్య నివారణకు మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్టించాలని చెప్పారు. ఎంత పెద్ద, ఎన్ని రంగుల వినాయకులను ప్రతిష్టించామన్నది కాదు..ఎంత భక్తితో పూజచేశామన్నదే ముఖ్యమన్నారు. మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని యువతకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక విగ్రహాల మండపాలు, ప్రతిమల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు భీంకుమార్, విజయభాస్కర్, వరప్రసాద్, ఏఎస్ఐ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
మట్టి వినాయకుల నిమజ్జనం
-
మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి
ఇంట్లో పూజకు చిన్న వినాయక విగ్రహాలను ఉచితంగా ఇస్తాం డీజేల సంస్కృతి మనది కాదు జిల్లా కలెక్టర్ జి.కిషన్ హన్మకొండసిటీ : మట్టి వినాయక విగ్రహాల నే ప్రతిష్టించాలని గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీలకు కలెక్టర్ జి.కిషన్ సూచించారు. మట్టి విగ్రహాలపై ప్రచారాన్ని ఉద్యమంగా చేపట్టాలని అన్నారు. శుక్రవారం హన్మకొం డ ఏకశిల పార్కులో కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల వినియో గ ప్రోత్సాహక సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో తయారు చేసే విగ్రహాల్లో విషతుల్యమైన రసాయనాలు వినియోగించటం వల్ల నిమజ్జ నం అనంతరం నీటి కాలుష్యం ఏర్పడుతుం దని చెప్పారు. దీంతో జంతువులకు, జలచరాలకు ప్రాణాంతకంగా మారడమేకాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాల ను వినియోగించి పర్యావరణాన్ని రక్షించాల ని కోరారు. నిమజ్జనం రోజు డీజేల వాడకా న్ని గణపతి మండళ్లు నియంత్రించాలని, అది మనసంస్కృతి, సంప్రదాయం కాదన్నారు. భక్తితో పూజించాలని అన్నారు. నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని సూచించారు. ఇంటిలో పూజించే చిన్న వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయించి ఉచితం గా అందజేయనున్నట్లు చెప్పారు. సేవ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విజయరాం మా ట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 4 అడుగుల 5 ఇంచుల ఎత్తు కలిగిన 360 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి సిద్ధంగా ఉంచామని, ఒక్కో విగ్రహం ధర రూ.4,200 ఉంటుందని అన్నారు. వరంగల్ లో రెండు సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామ ని, మట్టితో విగ్రహాల తయారీపై డిసెంబర్ లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపా రు. విగ్రహాల తయారీని వృత్తిగా స్వీకరించి న వారు శిక్షణ ద్వారా నేర్చుకొని ఉపాధి పొందవచ్చని సూచించారు. శ్రీరామకృష్ణ మఠం ప్రధాన కార్యదర్శి ఆత్మచైతన్య మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలు కావాలనుకునే వారు రూ.వెయ్యి చెల్లించి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని శ్రీరామకృష్ణ మఠంలో బుకింగ్ చేసుకోవాల ని, మిగతా మొత్తాన్ని విగ్రహం తీసుకెళ్లే రోజు చెల్లించాలన్నారు. ఈసందర్భంగా పీసీఆర్ ఫౌండేషన్ చైర్మన్ పూర్ణచందర్రావు మట్టి విగ్రహాల ఆవశ్యకతపై రూపొందించి న పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అంత కు ముందు ఏకశిల పార్కులో తయారు చేసిన మట్టి విగ్రహాలను కలెక్టర్ కిషన్ స్వయం గా పరిశీలించారు. సమావేశంలో కుడా వైస్ చైర్మన్ యాదగిరిరెడ్డి, డీఆర్ఓ సురేంద్రకరణ్, గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ భాస్కర్‌రావు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి, ఇంటాక్ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఆర్డీఓ మాధవరా వు, కుడా పరిపాలన అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు. -
అదే ప్రకృతి ఆరాధన పర్యావరణ పరిరక్షణకు
తిరుపతి/తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: వినాయకుని పూజ లేనిదే ఏ పనిని ప్రారంభిం చం. వినాయక చవితినాడు ప్రతి ఇంటా వినాయక వి గ్రహాన్ని పెట్టి పూజ చేయూల్సిందే. మట్టితో చేసిన విగ్రహాలతో పూజ చేయూలని పురాణాలు చెబుతున్నారు. మట్టితో చేసిన విగ్రహాలు అరుుతేనే నిమజ్జనం సమయంలో నీళ్లలో కరుగుతాయని ప్రకృతి ప్రేమికులు సైతం పిలుపునిస్తున్నారు. మట్టి విగ్రహాలతోనే ఎందు కు పూజ చేయూలనే దాని వెనుక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. పంచభూతాల్లో ఒకటైన భూమాత(మట్టి)ను ఆరాధించడం సంప్రదాయం. ప్రకృతి నుంచి తీసుకున్న మట్టిని తిరిగి ప్రకృతిలో కలిపి ఎలాంటి నష్టాలకు తావులేకుండా భూమాతను సమతుల్యం చేయడం ఆనాదిగా వస్తున్న ఆచారం. అందరూ మట్టి విగ్రహాలనే కొనుగోలుచేసి ప్రకృతిలో లభించే పత్రి(ఆకుల)తో పూజలు చేయడం శ్రేష్టం. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు పుడమి సుందరంగా తయారవుతుంది. సకల జీవరాశుల జీవన మనుగడ సుఖమయమవుతోంది. ప్లాస్టర్ ఆప్ పారీస్ విగ్రహాలతో పర్యావరణ వినాశనం కళ్లకు మిరమిట్లు గొలిపే వివిధ రంగులతో త యారుచేసిన ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాల వా డకం ద్వారా పర్యావరణం నాశనమవుతోంది. ఫలితంగా మానవులేకాక సకల జీవుల మనుగడ ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉంది. ఈ విగ్రహాలకు నీటిలో కరిగే గుణంలేదు. నీటి ఊటను దెబ్బతీసే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. మార్కెట్లో మట్టి విగ్రహాలు ప్రాస్టర్ ఆఫ్ ప్యారీస్ తయారీ విగ్రహాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన పెరగడంతో మట్టి వినాయక విగ్రహాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో వివిధ రూపాల్లో, వివిధ సైజుల్లో మట్టి వినాయకులు విక్రయూనికి సిద్ధంగా ఉన్నారు. మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పర్యావరణ కాలుష్య నివారణ మండలి చర్యలు చేపట్టింది. తిరుపతి నరసింహతీర్థం రోడ్‌లోని ఆ శాఖ కార్యాలయం వద్ద రూ.25లకే మట్టి వినాయక విగ్రహాలను విక్ర యిస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు,ప్రజాసంఘాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసే విగ్రహాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించారు. ఉచితంగా వినాయక విగ్రహాలు వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులకు ఉచితంగా వినాయక విగ్రహాలను సరఫరా చేయనున్నట్లు జాతీయ టూరిజం డెరైక్టర్ తిరుమెర్ల సురేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం మంగళం బొమ్మల క్వార్టర్స్‌లో విగ్రహాల వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీవినాయక ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 16 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివారం విగ్రహాల వితరణ కార్యక్రమానికి టీటీడీ ఈవో గోపాల్,అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబును ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. మట్టి వినాయక విగ్రహాలపై ప్రదర్శన తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: వినాయకచవితి రోజు మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ వినూత్న రీతిలో స్ప్రింగ్‌డేల్ స్కూల్ విద్యార్థులు శనివారం ప్రదర్శన నిర్వహించారు. వినాయక మాస్క్‌లను ధరించి విద్యార్థులు ప్రదర్శనతో ప్రజలకు సందేశాన్ని అందించారు. ఆ పాఠశాల అధినేత కేఎస్ వాసు మాట్లాడుతూ వినాయకచవితి గురించి వి ద్యార్థులకు వివరించారు. వినాయకునికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లు, గుగ్గిళ్లు, పండ్లు నైవేద్యంగా సమర్పిం చి పూజలుచేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ, హెచ్ ఎం ప్రమీల, ఏవో చంద్రశేఖర్, పీఆర్వో సాంబశివారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.