తిరుపతి/తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: వినాయకుని పూజ లేనిదే ఏ పనిని ప్రారంభిం చం. వినాయక చవితినాడు ప్రతి ఇంటా వినాయక వి గ్రహాన్ని పెట్టి పూజ చేయూల్సిందే. మట్టితో చేసిన విగ్రహాలతో పూజ చేయూలని పురాణాలు చెబుతున్నారు. మట్టితో చేసిన విగ్రహాలు అరుుతేనే నిమజ్జనం సమయంలో నీళ్లలో కరుగుతాయని ప్రకృతి ప్రేమికులు సైతం పిలుపునిస్తున్నారు. మట్టి విగ్రహాలతోనే ఎందు కు పూజ చేయూలనే దాని వెనుక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. పంచభూతాల్లో ఒకటైన భూమాత(మట్టి)ను ఆరాధించడం సంప్రదాయం. ప్రకృతి నుంచి తీసుకున్న మట్టిని తిరిగి ప్రకృతిలో కలిపి ఎలాంటి నష్టాలకు తావులేకుండా భూమాతను సమతుల్యం చేయడం ఆనాదిగా వస్తున్న ఆచారం. అందరూ మట్టి విగ్రహాలనే కొనుగోలుచేసి ప్రకృతిలో లభించే పత్రి(ఆకుల)తో పూజలు చేయడం శ్రేష్టం. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు పుడమి సుందరంగా తయారవుతుంది. సకల జీవరాశుల జీవన మనుగడ సుఖమయమవుతోంది.
ప్లాస్టర్ ఆప్ పారీస్ విగ్రహాలతో పర్యావరణ వినాశనం
కళ్లకు మిరమిట్లు గొలిపే వివిధ రంగులతో త యారుచేసిన ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాల వా డకం ద్వారా పర్యావరణం నాశనమవుతోంది. ఫలితంగా మానవులేకాక సకల జీవుల మనుగడ ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉంది. ఈ విగ్రహాలకు నీటిలో కరిగే గుణంలేదు. నీటి ఊటను దెబ్బతీసే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది.
మార్కెట్‌లో మట్టి విగ్రహాలు
ప్రాస్టర్ ఆఫ్ ప్యారీస్ తయారీ విగ్రహాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన పెరగడంతో మట్టి వినాయక విగ్రహాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో వివిధ రూపాల్లో, వివిధ సైజుల్లో మట్టి వినాయకులు విక్రయూనికి సిద్ధంగా ఉన్నారు. మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పర్యావరణ కాలుష్య నివారణ మండలి చర్యలు చేపట్టింది. తిరుపతి నరసింహతీర్థం రోడ్‌లోని ఆ శాఖ కార్యాలయం వద్ద రూ.25లకే మట్టి వినాయక విగ్రహాలను విక్ర యిస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు,ప్రజాసంఘాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసే విగ్రహాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించారు.
ఉచితంగా వినాయక విగ్రహాలు
వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులకు ఉచితంగా వినాయక విగ్రహాలను సరఫరా చేయనున్నట్లు జాతీయ టూరిజం డెరైక్టర్ తిరుమెర్ల సురేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం మంగళం బొమ్మల క్వార్టర్స్‌లో విగ్రహాల వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీవినాయక ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 16 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివారం విగ్రహాల వితరణ కార్యక్రమానికి టీటీడీ ఈవో గోపాల్,అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబును ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
మట్టి వినాయక విగ్రహాలపై ప్రదర్శన
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: వినాయకచవితి రోజు మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ వినూత్న రీతిలో స్ప్రింగ్‌డేల్ స్కూల్ విద్యార్థులు శనివారం ప్రదర్శన నిర్వహించారు. వినాయక మాస్క్‌లను ధరించి విద్యార్థులు ప్రదర్శనతో ప్రజలకు సందేశాన్ని అందించారు. ఆ పాఠశాల అధినేత కేఎస్ వాసు మాట్లాడుతూ వినాయకచవితి గురించి వి ద్యార్థులకు వివరించారు. వినాయకునికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లు, గుగ్గిళ్లు, పండ్లు నైవేద్యంగా సమర్పిం చి పూజలుచేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ, హెచ్ ఎం ప్రమీల, ఏవో చంద్రశేఖర్, పీఆర్‌వో సాంబశివారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అదే ప్రకృతి ఆరాధన పర్యావరణ పరిరక్షణకు
Published Sun, Sep 8 2013 2:21 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM
Advertisement