cm biren singh
-
ఆ హింసాకాండలో 60 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి!
మణిపూర్‌లో గత కొద్దిరోజులుగా అల్లకల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. భారీగా పోలీసులు మోహరించి 144 సెక్షన్ విధించినా.. సాధారణ స్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది. ఈ తరుణంలో జరిగిన హింసాకాండాలో దాదాపు 60 మంది అమాయకులు ప్రాణాలు కోల్పాయరు. ఈ విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్బిరెన్ సింగ్ సోమవారం వెల్లడించారు. మే 3న జరిగిన దురదృష్టకర ఘటనలో దాదాపు 60 మందికి పైగా చనిపోయారని, సుమారు 231 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటనలో దాదాపు 1700 ఇళ్లు కాలిపోయాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు విజ్ఞిప్తి చేసిన కొద్ది గంటల్లోనే ఆ వివరాలను వెల్లడించారు. సుప్రీం కోర్టు సైతం ఈ ఘటనప తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం అక్కడ పరిస్థితిని అదుపుచేసేందుకు తీసుకున్న చర్యలను జాబితా చేస్తూ.. గత రెండు రోజులుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.ఇదిలా ఉండగా, షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) హోదా కోసం మైత్రేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా గిరిజనలు నిరసనలు చేయడంతో ఈ హింస చెలరేగింది. ఈ జాతి ఘర్షణలో దాదాపు 23 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా మణిపూర్‌లో చిక్కుకుపోయిన ప్రజలు సొంత రాష్ట్రాలకు వచ్చేందకు ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఇంఫాల్- గౌహతి మధ్య మూడు అదనపు విమానాలను నడిపారు. -
అత్యాచారం కేసులో నిర్దోషికి బంపర్ ఆఫర్
ఇంఫాల్ : అత్యాచారం, హత్య కేసులో 8ఏళ్ల జైలు శిక్ష అనంతరం నిర్దోషిగా బయటకొచ్చిన వ్యక్తికి సీఎం శుభవార్త చెప్పారు. వివరాల ప్రకారం..2013లో మణిపూర్‌లోని రిమ్స్‌లో పాథాలజీ విభాగానికి చెందిన ఓ విద్యార్ధిని హత్యాచారానికి గురయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సహచర విద్యార్ధి తౌడమ్ జిబల్ సింగ్‌ను చేరుస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే అనూహ్యంగా ఎనిమిదేళ్ల అనంతరం జిబల్ సింగ్ నిర్దోషి అని తేలింది. దీంతో అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. (ఘరానా మహిళ.. వలవేసి దోచేసింది) 'ఈ కేసులో అమాయకుడైన జిబల్ సింగ్ జైలు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడు. అంతేకాకుండా ప్రజలు అతని ఇంటిని సైతం దహనం చేశారు. ఈ నేపథ్యంలో అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా నిర్ణయించాం' అని సీఎంపేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో సంతోషంలో మునిగిన జిబల్ సింగ్ జైలు నుంచి విడుదల కాగానే సీఎం బీరెన్ సింగ్‌ను కలిశారు. (లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి ) -
కారులో వెంటాడి.. కిరాతకంగా చంపేశాడు
- హత్యకేసులో దోషిగా తేలిన మణిపూర్ సీఎం కుమారుడు - ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విచారణ కోర్డు ఇంఫాల్: దర్పం తలకెక్కిన మత్తులో ఓ యువకుడిని కిరాతకంగా హత్యచేసిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారుడికి కోర్టు షాకిచ్చింది. ఐదేళ్లనాటి హత్యకేసులో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తనయుడు అజయ్ మీటేయికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విచారణ కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్.. గతంలో కాంగ్రెస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2011లో బీరేన్ పదవిలో ఉన్నప్పుడే.. ఆయన కుమారుడు అజయ్ మీటెయి ఘాతుకానికి పాల్పడ్డాడు. కారుకు దారివ్వలేదన్న కారణంగా ఇరోమ్ రోజర్(21) అనే యువకుడిని కాల్చిచంపారు. అప్పట్లో ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, సాక్ష్యాధారణ సేకరణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విచారణలో జాప్యం జరిగింది. దీంతో బాధితుడి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి కేసు ఓ కొలిక్కి వచ్చింది. కానీ ఉరిశిక్ష పడాల్సిన అజయ్.. కేవలం 5 సంవత్సరాల జైలు విక్షతో తప్పించుకున్నాడు. కాగా, మంత్రి తనయుణ్ని కఠినంగా శిక్షించాలని, విచారణ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని బాధితుల తరఫు న్యాయవాదులు చెప్పారు.