మణిపూర్‌లో గత కొద్దిరోజులుగా అల్లకల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. భారీగా పోలీసులు మోహరించి 144 సెక్షన్ విధించినా.. సాధారణ స్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది. ఈ తరుణంలో జరిగిన హింసాకాండాలో దాదాపు 60 మంది అమాయకులు ప్రాణాలు కోల్పాయరు. ఈ విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్‌బిరెన్ సింగ్ సోమవారం వెల్లడించారు.
మే 3న జరిగిన దురదృష్టకర ఘటనలో దాదాపు 60 మందికి పైగా చనిపోయారని, సుమారు 231 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటనలో దాదాపు 1700 ఇళ్లు కాలిపోయాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు విజ్ఞిప్తి చేసిన కొద్ది గంటల్లోనే ఆ వివరాలను వెల్లడించారు. సుప్రీం కోర్టు సైతం ఈ ఘటనప తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్రం అక్కడ పరిస్థితిని అదుపుచేసేందుకు తీసుకున్న చర్యలను జాబితా చేస్తూ.. గత రెండు రోజులుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.ఇదిలా ఉండగా, షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) హోదా కోసం మైత్రేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా గిరిజనలు నిరసనలు చేయడంతో ఈ హింస చెలరేగింది.
ఈ జాతి ఘర్షణలో దాదాపు 23 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా మణిపూర్‌లో చిక్కుకుపోయిన ప్రజలు సొంత రాష్ట్రాలకు వచ్చేందకు ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఇంఫాల్- గౌహతి మధ్య మూడు అదనపు విమానాలను నడిపారు.
Comments
Please login to add a commentAdd a comment