బాబు మెప్పు కోసం వైఎస్ జగన్‌పై విమర్శలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దీక్ష చేపడతారని ఆ పార్టీ నేత పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు మెప్పు పొందేందుకే టీడీపీ నేతలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు 8 నెలల పాలనలో ప్రజలు మోసపోతున్నారని పార్థసారథి చెప్పారు.
టీడీపీ నేతలకు వ్యవసాయ, పంట రుణాలకు తేడా తెలియదన్నారు. హైదరాబాద్‌లో ఆధార్ కార్డున్న చంద్రబాబు... ఏపీకి సీఎం అవ్వొచ్చు కానీ, మరో రాష్ట్రంలో ఆధార్ కార్డున్న రైతులకు రుణమాఫీ ఎందుకు చేయరని పార్థసారథి ప్రశ్నించారు.