CM Convoy Vehicle
-
సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
-
బీహార్ సీఎం నితీష్‌కు బిగ్ షాక్.. తృటిలో పెను ప్రమాదం తప్పింది!
Bihar CM Nitish Kumar.. బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో చేదు అనుభవం తప్పింది. సీఎం కాన్వాయ్‌పై దాడి జరిగిన ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్ మారింది. ఈ ఘటనలో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. బీహార్‌లో ఇటీవలే మహాఘట్ బంధన్ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా, సీఎం నితీష్ కుమార్ సోమవారం గయా పట్టణంలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా నితీష్ కుమార్.. గయాకు హెలీకాప్టర్‌లో వెళ్లగా.. లోకల్‌గా తిరిగేందుకు ఆయన కాన్వాయ్ అక్కడికి బయలుదేరింది. ఈ నేపథ్యంలో పట్నా-గయా హైవేపై సంచలన ఘటన చోటుచేసుకుంది. అక్కడ.. కొందరు వ్యక్తులు నిరసనలు తెలుపుతున్నారు. గౌరీచక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కొద్దిరోజులుగా తప్పిపోవడం ఆ తర్వాత శవమై కనిపించడంతో కలకలం మొదలైంది. ఈ ఘటనలో పోలీసుల వైఖరిని నిరససిస్తూ వారు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం కాన్వాయ్ అటుగా రావడంతో నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, వారి దాడి సందర్భంగా సీఎం కారులో లేకపోవడం, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. Bihar | A total of 13 accused have been arrested in connection with stone-pelting at the convoy of Bihar CM Nitish Kumar yesterday: SSP Patna https://t.co/vPUyPwI32X — ANI (@ANI) August 22, 2022 కాన్వాయ్‌పై దాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టి కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించారు. తాజాగా ఈ ఘటనతో సంబంధం ఉన్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక, సీఎం కాన్వాయ్‌పై దాడి ఘటన బీజేపీ అనుకూలంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు స్పందిస్తూ.. బీహార్‌లో మళ్లీ అక్రమార్కుల రోజులు వచ్చాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. #BreakingNews | #Bihar CM #NitishKumar's convoy attacked by an angry mob in Patna, 13 accused arrested. pic.twitter.com/74XgJsDFnT — Mirror Now (@MirrorNow) August 22, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్ -
కేసీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలానా!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాన్వాయ్‌లోని వాహనానికి ట్రాఫిక్ చలానా పడింది. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఫైన్ తప్పలేదు. అతివేగంగా నాలుగుసార్లు వెళ్లడంతో చలానా విధించినట్టు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. దీంతో చలానా మొత్తం రూ.4,140 ను సీఎంవో అధికారులు బుధవారం చెల్లించారు. (చదవండి: హైదరాబాద్: సిటీ బస్సులకూ ఇక రైట్ రైట్!) -
సీఎంకు ఢిల్లీలో కొత్త కాన్వాయ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు ఢిల్లీలో కొత్త కాన్వాయ్‌ను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్‌కు భద్రతా పరంగా ముప్పు ఉందనే నిఘా వర్గాల తాజా నివేదిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్నట్లుగానే ఢిల్లీలోనూ బుల్లెట్‌ప్రూఫ్ వాహనంతో కొత్త కాన్వాయ్ ఉండాలని అధికారులు నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌కు ప్రస్తుతం ఢిల్లీలో మూడు వాహనాలతో ప్రత్యేక కాన్వాయ్ ఉంది. స్కార్పియో, ఫార్చునర్, సఫారీ వాహనాలున్నాయి. ఢిల్లీలో వాహనాల వినియోగంపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వీవీఐపీలకు, వీఐపీలకు సైతం మూడు వాహనాలతోనే కాన్వాయ్ ఉంటుంది. కొత్త కాన్వాయ్ ఏర్పాటు కోసం అక్కడి గవర్నర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సీఎంకు ఢిల్లీలో కొత్త వాహనాలను సమకూర్చే ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో సీఎం వినియోగిస్తున్నట్లు ఢిల్లీలోనూ బుల్లెట్‌ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ వాహనం అధికారులు సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే సీఎం కాన్వాయ్ కోసం గతంలో కొనుగోలు చేసిన ఫార్చునర్ వాహనాలను అక్కడికి పంపించే యోచన చేసినా.. కొత్త వాటి కొనుగోలుకే నిర్ణయం జరిగినట్లు సమాచారం. సీఎం ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కాన్వాయ్‌లోని ఒక వాహనం మొరాయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనూ కొత్త కాన్వాయ్ అవసరం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. -
సీఎం కాన్వాయ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
లబ్బీపేట (విజయవాడ) : తాత్కాలిక సచివాలయ శంకుస్థాపనకు వెళుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ఒకరిని బలి తీసుకుంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం సైకిల్‌పై వెళ్తున్న పోస్టల్ ఉద్యోగిని ఢీకొనడంతో.. రెండు రోజులపాటు అపస్మారక స్థితిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి శుక్రవారం మృతిచెందారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం సభ్యులు తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యనమలకుదురు గ్రామంలో నివసించే బందా నాగేంద్ర వరప్రసాద్(54) బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసులో పోస్టల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో సైకిల్‌పై డ్యూటీకి వెళ్తూ మహాత్మాగాంధీ రోడ్డు నుంచి రాజగోపాలాచారి రోడ్డులోకి మలుపు తిరుగుతుండగా తాత్కాలిక రాజధాని శంకుస్థాపనకు వెళుతున్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో వరప్రసాద్ అపస్మారకస్థితికి చేరుకోవడంతో సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చించి, ఆస్పత్రి నుంచి అతని వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి వెళ్లిపోయారు. రెండు రోజులుగా అపస్మారక స్థితిలోనే చికిత్స పొందుతున్న నాగేంద్రవరప్రసాద్ శుక్రవారం వేకువజామున మృతి చెందారు. కాగా నాగేంద్రవరప్రసాద్‌కు భార్య లక్ష్మీఅన్నపూర్ణ, కుమారుడు శ్రీరామ్ చక్రవర్తి, కుమార్తె శ్రీముఖి శ్యామల ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన పెద్దదిక్కును కోల్పోవడంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నాగేంద్రవరప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పోస్టల్ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.