CM Nitish
-
నితీష్ ఆహారంలో విషం.. అందుకే ఆయన అలా : మాంజీ
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ తినే ఆహారంలో విషం కలుపుతున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్ జితన్ రాం మాంజీ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకే నితీష్ మానసిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని తెలిపారు. అయితే విషం కలిపే వారు సీఎం కుర్చీ కోసమే ఈ పనిచేస్తున్నారని మాంజీ చెప్పారు. పాట్నా అసెంబ్లీ బయట శుక్రవారం మాంజీ ఈ సంచలన విషయాలు వెల్లడించారు. మానసిక ఆరోగ్యం క్షీణించడం వల్లే నితీష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. అంతేగాక పెద్దవాన్ని అని చూడకుండా అసెంబ్లీలో తనను కూడా నితీష్ తిట్టారని మాంజీ తెలిపారు. నితీష్ కుమార్‌కు ఇస్తున ఆహారంపై ఉన్నతస్థాయి విచారణ చేయాల్సిందిగా గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానని మాంజీ చెప్పారు. బీహార్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపైనా వివరిస్తాని తెలిపారు. ఇటీవలే రిజర్వేషన్లు పెంచుతూ బీహార్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుపై డౌట్లు లేవనెత్తినందుకుగాను మాంజీపై అసెంబ్లీలో సీఎం నితీష్ నోరుపారేసుకున్నారు. -
గాంధీ వైపా? గాడ్సే వైపా?
పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గాంధీ భావజాలాన్ని సమర్థిస్తారో, గాంధీని చంపిన గాడ్సేని సమర్థిస్తున్నవారితో చేతులు కలుపుతారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. నితీశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాపై ప్రశ్నల వర్షం కురిపించారు. తన భావజాలాన్ని పక్కనపెట్టి నితీశ్ ప్రభుత్వం బీజేపీతో చేతులుకలపడాన్ని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై తన వ్యతిరేకతను స్పష్టంచేసిన ప్రశాంత్ కిశోర్, గాంధీ, జయప్రకాష్ నారాయణ్, రామ్మనోహర్ లోహియాల సిద్ధాంతాలనూ, ఆదర్శాలనూ ఎన్నటికీ వీడబోనని ఎప్పుడూ చెపుతూ ఉండే నితీశ్ నాథూరాం గాడ్సేని సమర్థించే వారితో ఎలా ఉండగలుగుతారని ప్రశాంత్ కిశోర్ సూటిగా ప్రశ్నించారు. నితీశ్ బీజేపీ వైపు ఉండదల్చుకుంటే మాకేం అభ్యంతరం లేదనీ, అయితే ఇటు గాంధీ ఆదర్శాలను సమర్థిస్తూ, అటు గాడ్సే మద్దతుదారులతో చేతులుకలుపుతానంటే కుదరదన్నారు. ఉత్తమ టాప్ 10 రాష్ట్రాల్లో బిహార్‌ను ఒకటిగా చేసేందుకే 20వ తేదీన ‘‘బాత్ బిహార్‌కీ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో యువనాయకులను తయారుచేసే దిశగా కృషిచేస్తానని తెలిపారు. వంద రోజుల్లో కోటిమంది యువతను కలుస్తానన్నారు. ప్రశాంత్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. నితీశ్‌ను విమర్శించే బదులు తన విలువైన సమయాన్ని ‘వ్యాపారం’కోసం ప్రశాంత్ కేటాయిస్తే మంచిదని పార్టీ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. -
సీఎం నితీశ్‌పై గ్రామస్తుల రాళ్ల దాడి
-
నోట్ బందీ సరే.. నస్ బందీ తెండి: గిరిరాజ్
పట్నా: దేశంలో నోట్‌బందీ (పెద్ద నోట్ల ఉపసంహరణ)జరుగుతోందనీ..ప్రభుత్వం నస్బందీ (జనాభా నియంత్రణ) కోసం కూడా చట్టాలు తీసుకురావాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ సలహా ఇచ్చారు. వేగంగా అభివృద్ధి సాధించటానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తప్పనిసరి చేస్తూ చట్టం తేవాలని ఆయన ఆదివారం అన్నారు. ‘ప్రపంచ జనాభాలో భారత జనాభా 17 శాతం ఉంది. ఆస్ట్రేలియా మొత్తం జనాభా ఎంతో, అంత జనాభా ప్రతి ఏడాది మన దేశంలో పెరుగుతోంది. అధిక జనాభానే మన అభివృద్ధికి అవరోధంగా మారింది. జనాభా నియంత్రణ చట్టాన్ని మన దేశంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని గిరిరాజ్ అన్నారు. ఇదొక దిక్కుమాలిన ఆలోచన అని బిహార్ సీఎం నితీష్ మండిపడ్డారు. -
దళితుల రిజర్వేషన్లపై కన్నేశారు!
నితీశ్, లాలూలపై నిప్పులు చెరిగిన మోదీ రిజర్వేషన్లు లేకపోతే..ఆ బాధేంటో నాకు తెలుసు బక్సర్: బిహార్ ఎన్నికల్లో గెలిస్తే.. దళితుల, బీసీల రిజర్వేషన్లనుంచి 5 శాతం లాగేసుకుని తమ వర్గం వారికి ఇచ్చేందుకు నితీశ్, లాలూ కూటమి ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. సోమవారం బక్సర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మహా‘స్వార్థ’ కూటమి నేతలు అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి తమవారికి లాభం చేసేందుకు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ‘దళితులు, మహాదళితులు, వెనుకబడినవారి రిజర్వేషన్లలో నుంచి 5 శాతాన్ని తీసి వారి వర్గం వారికి ఇవ్వాలనుకుంటున్నారు. ఓ వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన వాడిగా.. ఓ పేద తల్లికి పుట్టిన వాడిగా.. రిజర్వేషన్లు లేకపోతే ఉండే బాధేంటో నాకు తెలుసు. అందుకే వారి కుట్రలు అమలుకాకుండా ఆపుతాను’ అనిఅన్నారు. అవినీతిపై పాఠాలు చెప్పే నితీశ్ తన పార్టీ ఎమ్మెల్యే, మంత్రి లక్షలు తీసుకుంటూ పట్టుబడినా.. వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. యువతకు ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామన్న నితీశ్.. అది నడిచేందుకు కరెంటును ముందు ఇవ్వాలన్నారు. లాలూ వైరస్ సోకిన ఆ ల్యాప్‌టాప్‌లు బిహార్ యువతకు అవసరం లేదన్నారు. తాము గెలిస్తే బిహార్‌లో రెండో హరిత విప్లవాన్ని ప్రవేశపెడతామన్నారు. చర్చకు సిద్ధం: నితీశ్ కోటాపై మోదీ ఆరోపణలను బిహార్ సీఎం నితీశ్ ఖండించారు. దళితుల ఓట్లు పడవనే ఆందోళనతోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అభివృద్ధి విషయంలో గుజరాత్ మోడల్ - బిహార్ మోడల్‌పై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. -
లాలూ, నితీశ్‌ది తిరోగమన ఎజెండా
గెలవలేరని తెలిసే తాంత్రికులను ఆశ్రయిస్తున్నారు ♦ మహాకూటమి నేతలది 18వ శతాబ్దపు ఆలోచన ♦ రిజర్వేషన్లపై భయాందోళనలు అవసరం లేదు ♦ బిహార్ అభివృద్ధికి సిక్స్‌పాయింట్ ఫార్ములా ప్రకటన నలంద/పట్నా: బిహార్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే.. లాలూ, నితీశ్ మాత్రం తిరోగమన దిశలో.. 18వ శతాబ్దపు ఆలోచనా ధోరణిలోనే ముందుకెళ్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మూడో విడత ఎన్నికలు జరిగే నలంద ప్రాంతంలో ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తాంత్రికులను కలుస్తున్నారని.. రాష్ట్రాన్ని 18వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. మహాకూటమి మిత్రుడు లాలూపై పగ తీర్చుకునేందుకే నితీశ్ తాంత్రికుడిని కలిశాడన్నారు. వెనుకబడిన తరగతులనుంచి వచ్చిన తను ప్రధాని మంత్రి కావటాన్ని నితీశ్, లాలూ జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే కుల రాజకీయాలు చేస్తూ.. విభజించు-పాలించు సూత్రం ద్వారా ప్రజల్లో చిచ్చు పెడుతున్నారన్నారన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ మహాకూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవ లేదన్నారు. అంబేద్కర్ రూపొందించిన రిజర్వేషన్ల వ్యవస్థను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు. కోటాను తొలగిస్తారంటూ.. విష ప్రచారం చేయటం.. నితీశ్, లాలూలకే చెల్లిందన్నారు. ‘ఈ పాతకాలం ఆలోచనల నాయకులనుంచి బిహార్ విముక్తి కావాలి. ఇక్కడి యువతకు తంత్రాలు కాదు.. ల్యాప్‌టాప్‌లు కావాలి. బిహారీనా.. బాహరీనా?(బయటి వారా) అని ప్రశ్నించేవారు.. ఇక్కడి యువత బాహరీ (బయటి) రాష్ట్రాల్లోకి వెళ్లి ఉద్యోగాలు చేసుకుని బతకాల్సిన పరిస్థితి కల్పించినపుడు.. ఎందుకు బాహరీ గురించి మాట్లాడలేద’ని మోదీ ప్రశ్నించారు. ప్రపంచంలోనే పెద్ద తాంత్రికుడైన లాలూ తన పార్టీ ఆర్జేడీని రాష్ట్రీయ జాడూ తోనా(తాంత్రిక శక్తుల ప్రయోగ పార్టీ)గా మార్చుకోవాలని సూచించారు. బిహార్‌కు కేంద్రం ఇచ్చిన రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీలో, 125 పక్కన ఎన్ని సున్నాలుంటాయో కూడా లాలూ కొడుకు తేజస్వికి తెలియదని ఎద్దేవా చేశారు. ఒకరినొకరు తిట్టుకున్న లాలూ-నితీశ్‌లు ఇప్పుడు అభివృద్ధికి వ్యతిరేకంగా ఒకటైతే వారికి ఓటేయాలా? అని ప్రశ్నించారు. ‘యాదవులకు వ్యతిరేకంగా నితీశ్ లేఖ రాసినా ఇంకా లాలూ ఆయన వెనక నడుస్తున్నారు. లాలూ ఇంతలా అవమానిస్తున్నా.. యాదవులుగా ఉన్న మీకు రక్తం మరగటం లేదా?’అని యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్న పట్నాలో జరిగిన సభలో మోదీ అన్నారు. నితీశ్ చెప్పిన సాత్నిశ్చయ్ (ఏడు ప్రతిపాదనలు)కు ప్రతిగా బిహార్ అభివృద్ధికి ఆరు పాయింట్ల ఫార్ములాను మోదీ ప్రకటించారు. మోదీ నిరంకుశవాది: నితీశ్ పట్నా: మహాకూటమి నేతలు రాష్ట్రాన్ని 18వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారన్న మోదీ వ్యాఖ్యలపై సీఎం నితీశ్ ఘాటుగా స్పందించారు. ప్రధాని నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని.. బిహారీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని పట్నా సభలో అన్నారు. అసత్యాలను అందంగా అబద్ధాలుగా మార్చి చెప్పటంలో మోదీ ఘనాపాటి అన్నారు. కాగా, గ్రూప్ సీ,డీతోపాటు గ్రూప్-బీ నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను తొలగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించటం.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిచంనట్లేనని జేడీయూ నేత కేసీ త్యాగీ ఆరోపించారు. -
నేడు తొలి దశ పోరు
♦ బిహార్‌లో ఎన్నికలకు సర్వం సిద్ధం ♦ 49 స్థానాలకు పోలింగ్ పట్నా: బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఐదు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి విడతలో 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 583 మంది అభ్యర్థుల తలరాతను 1,35,72,339 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. 10 జిల్లాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు. అయితే ఎక్కువ స్థానాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుందని తెలిపారు. 583 మంది అభ్యర్థుల్లో 50 మంది మహిళలున్నారు. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ, సీఎం నితీశ్ నేతృత్వంలో మహాకూటమి హోరాహోరీగా ప్రచారం సాగించాయి. సమస్తిపూర్, బేగుసరాయ్, భాగల్పూర్, బాంకా, ఖగారియా, ముంగేర్, లఖీసరాయ్, షేక్‌పురా, నవద, జాముయ్ జిల్లాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 13,212 పోలింగ్ స్థానాల్లో పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారి తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో కేంద్ర పారామిలిటరీ బలగాలుంటాయని, అదనంగా ద్రోణ్, హెలికాప్టర్లను వినియోగించనున్నట్లు చెప్పారు. ఈ 49 నియోజకవర్గాలకు 2010లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా జేడీయూ 29 స్థానాల్లో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో జేడీయూతో కలసి పోటీచేసిన బీజేపీ 13 స్థానాలను కైవసం చేసుకోగా, ఆర్జేడీ నాలుగు స్థానాలు దక్కాయి. ‘లాలూను మోసం చేసిన నితీశ్’ భభువా: లాలూ ప్రసాద్ యాదవ్‌ను నితీశ్ కుమార్ నిలువునా మోసం చేశారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం ఆదివారం ఆరోపించారు. బిహార్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన నితీశ్ వలలో లాలూ పడిపోయి ఆయనతో పొత్తు పొట్టుకున్నారన్నారు. దాణా స్కాం కేసుల విచారణలో కోర్టుల వెంటపడి లాలూకు అయిదేళ్ల జైలుశిక్ష పడేలా చేసింది నితీశ్ మనుషులేనని.. అలాంటి నితీశ్‌తో లాలూ ఎలా జతకలిశారో అర్థం కావటం లేదని ములాయం అన్నారు. మోదీ ఎన్నికల సభకు ఈసీ అనుమతి భభువా/పట్నా: బిహార్‌లోని కైమూర్ జిల్లా భభువాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించటానికి ఎన్నికల సంఘం అనుమతించింది. రాష్ట్రంలో సోమవారం తొలి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ సభను నిర్వహించటం కుదరదని జిల్లా కలెక్టర్ శనివారం అనుమతి నిరాకరించటం వివాదాస్పదమైంది. -
నితీశ్ అహంభావి.. నమ్మొద్దు!
అభివృద్ధి ఎజెండాను విశ్వసించి, ఎన్డీయేను గెలిపించండి! బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బాంక(బిహార్) : అభివృద్ధి ఎజెండా, ముఖ్యమంత్రి నితీశ్‌పై విమర్శలు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రచార పర్వం ప్రారంభించారు. బాంకలో శుక్రవారం జరిగిన సభలో మాట్లాడుతూ ‘నితీశ్ కుమార్ అహంభావి. ఆయనను విశ్వసించి పరిపాలనను అప్పగించవద్దు. బీజేపీ అభివృద్ధి ఎజెండాను నమ్మండి. రాష్ట్ర రూపురేఖలను మారుస్తాం. అభివృద్ధితోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని పేదలు, యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తానన్నారు. తాను ప్రకటించిన రూ. 1.65 లక్షల కోట్ల ప్యాకేజీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ‘ఈ ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఇచ్చినా, అది మీ దాకా చేరుతుందా? ఒకవేళ నేను ఆ మొత్తాన్ని ఇచ్చినా.. ఆయన(నితీశ్) ఎంత అహంభావి అంటే.. మోదీ ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని అన్నా అంటాడు. కోసి వరదల సందర్భంగా సహాయ చర్యల కోసం బిహార్‌కు గుజరాత్ సీఎంగా నేను పంపిన రూ. 5 కోట్లను ఆయన వెనక్కుపంపించిన విషయం గుర్తుంది. నేనాయన్ను నమ్మను. మీరూ నమ్మొద్దు’ అంటూ నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. తాను ప్రకటించిన రూ. 1.65 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ బిహారీల హక్కు అన్నారు. భూస్వామ్యవాదం, ప్రత్యేకవాదం, రాచరికవాదం.. ఇలా అన్నిరకాల వాదాలను అనుభవించారని, ఇక అభివృద్ధివాదాన్ని అనుసరించమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం వ్యాపారానికి అనువుగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్‌ది 27వ స్థానం కాగా.. బిహార్ నుంచి విడిపోయిన తరువాత బీజేపీ పాలనలో ఉన్న జార్ఖండ్ 3వ స్థానంలో ఉందని వివరించారు. ‘బిహార్ ప్రగతి నా బాధ్యత. అందుకే మీ ఓట్లు కోరుతూ నేనిక్కడికి వచ్చాను’ అని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్డీయే గెలుపు ఖాయమనే అర్థం వచ్చేలా.. ‘పరిస్థితి చూస్తోంటే బిహార్ ప్రజలు ఈసారి రెండు దీపావళులు జరుపుకుంటారు’ అని అన్నారు. కాగా, ప్రస్తుతమున్న రిజర్వేషన్ విధానంలో మార్పులు చేయాలని బీజేపీ భావించడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్జేడీ నేత లాలూ, నితీశ్‌లను ఔరంగాబాద్‌లో జరిగిన ఎన్నికల సభలో విమర్శించారు. ఎన్డీయే గెలుస్తుందనే భయంతోనే లాలూ-నితీశ్ కూటమిగా ఏర్పడ్డారని, త్వరలోనే వారిలో విభేదాలు ప్రారంభమై, కూటమి ముక్కచెక్కలవుతుందని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్.. మరో సభలో పేర్కొన్నారు.