CNG kit
-
సెంట్రల్ లాకింగ్ సిస్టమ్.. జర జాగ్రత్త..
పటాన్ః సీఎన్జీ కిట్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉన్న కారు వాడుతున్నారా? అయితే జర జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్తోంది గుజరాత్ లో జరిగిన తాజా ఘటన. ఉన్నట్లుండి కారులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కు తోడు... సెంట్రల్ లాకింగ్ సిస్టం.. ఇద్దరు వ్యక్తుల సజీవ దహనానికి కారణమైంది. పటాన్ జిల్లా హైవేలో జరిగిన ఘటన.. అందర్నీ షాకింగ్ కు గురిచేసింది. గుజరాత్ పటాన్ జిల్లాలో జరిగిన ఘటన చూపరులను విస్మయానికి గురి చేసింది. ఇద్దరు దంపతులు హైవేలో వెడుతుండగా కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిరువురూ ముఖ్యంగా అందులోని సెంట్రల్ లాకింగ్ సిస్టం వల్ల బయటకు రాలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. పటాన్ జిల్లాలోని హైవేలో జరిగిన కారు ప్రమాదంలో దంపతులిద్దరూ అగ్నికి ఆహుతైపోయారు. కారులో సీఎన్జీ కిట్ తో పాటు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో.. వారు ప్రాణాలు కాపాడుకోలేక పోయినట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. -
అంబులెన్స్‌లో పేలుడు: నవజాత శిశువు మృతి
థానే : మహారాష్ట్ర థానేలో విషాదం చోటుచేసుకుంది. మెరుగైన వైద్యం కోసం నవజాత శిశువును తరలిస్తుండగా సీఎన్జీ గ్యాస్ రూపంలో మృత్యువు కాటేసింది. అంబులెన్స్ లోని సీఎన్జీ గ్యాస్ సిలిండర్ పేలి రెండురోజుల పసిగుడ్డు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి...థానే నగరంలో ఓ మహిళ.. శిశువుకి బుధవారం జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో, స్థానిక వేదాంత ఆసుపత్రికి తరలించాలని ఆస్పత్రి వైద్యులు సూచించారు. దీంతో చిన్నారిని అక్కడకు తరలించారు. కానీ వేదాంత వైద్యులు కూడా శిశువు పరిస్థితి విషమంగా ఉన్నందున... ముంబైలోని స్పెషాలిటి కేర్ సెంటర్‌కి తరలించాలని సూచించారు. గురువారం ఆర్థరాత్రి అంబులెన్స్‌ను సిద్ధం చేసి అందులో శిశువును తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తూ సీఎన్జీ గ్యాస్ సిలిండర్ పేలింది. అంబులెన్స్‌లోని పేలుడు సంభవించింది. అగ్నికీలలు ఎగసిపెడ్డాయి. ఇంతలో నవజాత శిశువు అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌లోని శిశువు తల్లితో పాటు మరొకరిని రక్షించారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... శిశువు తల్లితోపాటు మరొకరికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎన్జీ కిట్‌లో పేలుడు సంభవించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.