సెంట్రల్ లాకింగ్ సిస్టమ్.. జర జాగ్రత్త..
పటాన్ః సీఎన్జీ కిట్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉన్న కారు వాడుతున్నారా? అయితే జర జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్తోంది గుజరాత్ లో జరిగిన తాజా ఘటన. ఉన్నట్లుండి కారులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కు తోడు... సెంట్రల్ లాకింగ్ సిస్టం.. ఇద్దరు వ్యక్తుల సజీవ దహనానికి కారణమైంది. పటాన్ జిల్లా హైవేలో జరిగిన ఘటన.. అందర్నీ షాకింగ్ కు గురిచేసింది.
గుజరాత్ పటాన్ జిల్లాలో జరిగిన ఘటన చూపరులను విస్మయానికి గురి చేసింది. ఇద్దరు దంపతులు హైవేలో వెడుతుండగా కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిరువురూ ముఖ్యంగా అందులోని సెంట్రల్ లాకింగ్ సిస్టం వల్ల బయటకు రాలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. పటాన్ జిల్లాలోని హైవేలో జరిగిన కారు ప్రమాదంలో దంపతులిద్దరూ అగ్నికి ఆహుతైపోయారు. కారులో సీఎన్జీ కిట్ తో పాటు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో.. వారు ప్రాణాలు కాపాడుకోలేక పోయినట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.