మాజీ ప్రధాని మన్మోహన్కు ఊరట
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో మన్మోహన్ ప్రమేయం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ సహా మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చాలని మధుకోడా చేసిన వాదనను దాసరి నారాయణరావు సమర్థించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ మన్మోహన్కు క్లీన్ ఇవ్వడం ఆయనకు ఉపశమనం కలిగించే విషయం.