COG
-
ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ అకౌంట్స్ తెలిపాయి. 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్‌ను కాగ్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం చేసినట్లు పేర్కొంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. అలాగే, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి.2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం రూ.50,882 కోట్లు కేటాయించగా రూ.52,010 కోట్లు వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్లో రూ.21,183 కోట్లు కేటాయించగా రూ.21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో (విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) రూ.1,10,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు, ఆర్థిక సేవలకు రూ.57,344 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. 2023–24 ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 91.97% వ్యయం చేసినట్లు తెలిపింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు రూ.–37,468 కోట్లు ఉండగా ద్రవ్య లోటు రూ.–61,765 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది,గత ఐదేళ్ల బడ్జెట్లో మూల ధన వ్యయం ఇలా..ఆర్థిక ఏడాది మూల ధన వ్యయం (రూ.కోట్లలో) 2019–20 17,601 2020–21 20,690 2021–22 18,511 2022–23 7,581 2023–24 23,589 మొత్తం రూ. 87,972 -
మూలధన వ్యయంలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూలధన వ్యయంపై కాగ్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ తొలి త్రైమాసికంలో ఇంత మేర వ్యయం చేయలేదని కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. పలు రాష్ట్రాలు బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర ఖర్చు చేశాయనే అంశాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కూడా వెల్లడించింది. మూలధన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ చేసినంత వ్యయం దేశంలో మరే రాష్ట్రంలోనూ చేయలేదని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లోనే ఏకంగా 29.70 శాతం వ్యయం చేసిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి కాగ్ గణాంకాలు కూడా మూల«దన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.31,061 కోట్లు కేటాయింపులు చేయగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.12,669 కోట్లు వ్యయం చేసిందని, ఇది కేటాయింపుల్లో 40.79 శాతమని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ తరువాత మూలధన కేటాయింపుల్లో ఎక్కువ వ్యయం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. మూలధన వ్యయం అంటే నేరుగా ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు. -
జమ్మూకశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రెస్ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామా చేయగా, ఆయన్ను నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వికాస్ పురుష్‌గా పేరున్న మనోజ్ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు. -
బాబు ఒక రోజు ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు ఢిల్లీలో ఈనెల 11వ తేదీన చేస్తున్న దీక్షకు ఏకంగా పది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అదనపు నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇంచార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర జీవో జారీ చేశారు. సర్కారు సొమ్ములతో ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ధర్మపోరాట దీక్షల పేరుతో కోట్ల రూపాయలు వ్యయం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ఢిల్లీలో ఒక రోజు దీక్షకు పది కోట్ల రూపాయలను వ్యయం చేయడాన్ని అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. రాజకీయ దీక్షలకు ముఖ్యమంత్రి ప్రభుత్వ సొమ్ములను ఏ విధంగా వ్యయం చేస్తారని ఉన్నతాధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే ధర్మపోరాట దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి ఖజానా నుంచి ప్రచారం కోసం 13.77 కోట్ల రూపాయలు వ్యయం చేయడాన్ని కాగ్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ విధంగా ప్రజాధనాన్ని రాజకీయంగా అధికార పార్టీ ప్రయోజనం కోసం వ్యయం చేయడం సుప్రీం కోర్టు తీర్పు నిబంధనలకు విరుద్ధమని కూడా కాగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయినా సరే ఇవేమీ లెక్క చేయకుండా ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు దీక్ష ఏర్పాట్ల కోసం ప్రాథమికంగా పది కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పది కోట్ల రూపాయల్లో ఏర్పాట్ల కోసం 8 కోట్ల రూపాయలను, రవాణా సౌకర్యం కోసం రెండు కోట్ల రూపాయలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో పక్క ఇది పక్కా రాజకీయ దీక్ష అని అలాంటి దీక్షకు ఖజానా నుంచి నిధులు వినియోగం అంటే దుర్వినియోగం చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతటితో ఆగకుండా రాజకీయ దీక్షకు ఉద్యోగులందరూ తరలి రావాలంటూ ఆదేశాలు జారీ చేయడం అంటే అధికార దుర్వినియోగమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీక్ష ఏర్పాట్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి దీక్షకు హాజరయ్యే వారికి రవాణా సౌకర్యం కల్పించడానికి పది కోట్ల రూపాయలు వ్యయం చేయాలని ఉత్తర్వుల్లో ఆర్థిక శాఖ పేర్కొంది. వివిధ ప్రాంతాల నుంచి దీక్షకు ఉద్యోగులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దీక్షలో రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులను ఢిల్లీకి తరలించేందుకు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేను కోరింది. దీని కోసం దక్షిణ మధ్య రైల్వేకు 1,12,16,465 రూపాయలను చెల్లించేందుకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ జీవో జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి మధ్యాహ్నాం 12 గంటలకు, అనంతపురం జిల్లా నుంచి 8వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలు దేరి ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు చేరుకుంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆఘమేఘాల మీద ఇందుకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఈ నెల 6వ తేదీన సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగా అదే రోజు ఆర్థిక శాఖ పది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. అదే రోజు ప్రత్యేక రైళ్ల ఏర్పాటునకు నిధులను విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో జారీ చేసింది. అసోసియేషన్‌కు రెండు విమాన టికెట్లు ఇదిలా ఉంటే.. ఢిల్లీ ధర్నాలో పాల్గొనాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం.. ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా చిన్నచితకా రాజకీయ పార్టీలతో పాటు అన్ని ఉద్యోగ సంఘాలకు రెండేసి చొప్పున విమాన టికెట్లను పంపుతోంది. మరోవైపు.. శ్రీకాకుళం, అనంతపురం నుంచి బయల్దేరే రైళ్లల్లో ఏఏ స్టేషన్లలో ఎవరెవరు ఎక్కుతారో ఆ వివరాలివ్వాలని సీఎంవో కార్యాలయం ఒత్తిడి చేస్తుండడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాల్సిన తమను ఎన్నికల ప్రయోజనాల కోసం ఇలా వాడుకోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు ప్రచార ఖర్చు ఇలా... ►గత ఏడాది నుంచి ఇప్పటివరకు రంజాన్, ఏరువాక, జలహారతి, యువనేస్తం, పోలవరం తదితర ఈవెంట్ల ప్రచార ప్రకటనల వ్యయం : రూ.60.18 కోట్లు ►బాబుగారి ఒక రోజు నవనిర్మాణ దీక్ష హోర్డింగ్స్‌కు : రూ.13.76 కోట్లు ఖర్చు ►సీఎం నిర్వహించిన ఒక్కరోజు నవ నిర్మాణ దీక్ష ప్రచార ఖర్చు : రూ.8.67 కోట్లు ►బాబు ధర్మపోరాట దీక్ష హోర్డింగ్స్‌కు : రూ.3.99 కోట్లు ►ఇప్పటికే గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఔట్‌డోర్ ప్రచారం పేరుతో చేసిన ఖర్చు : రూ.30.26 కోట్లు ►అంబేద్కర్ ఆశయం–చంద్రన్న ఆచరణ ఈవెంట్ ప్రచార ఖర్చు : రూ.3 కోట్లు ►1500 రోజుల పాలన పూర్తి పేరుతో ప్రచార ఖర్చు : రూ.17.79 కోట్లు ►1500 రోజుల పాలన పూర్తి నేపథ్యంలో హోర్డింగ్స్ ఖర్చు : రూ.12 కోట్లు ►ఇందులో స్వచ్ఛ భారత్, సంక్రాంతి సంబరాలు హోర్డింగ్స్‌కు : రూ.7.67 కోట్లు ►సామూహిక గృహ సముదాయాల ఈవెంట్ల ప్రచారానికి హోర్డింగ్స్ ఖర్చు : రూ.4.59 కోట్లు ►ఇక యువనేస్తం హోర్డింగ్స్ ద్వారా ప్రచారానికి : రూ.6 కోట్లు -
‘చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలి’
-
‘చంద్రబాబుపై సీబీఐ విచారణకు ఆదేశించాలి’
సాక్షి, అమరావతి : కాగ్ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లిస్తున్నారని, తెలుగు తమ్ముళ్లకు ఉపయోగపడే పథకాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బియ్యం సరఫరాలో కుంభకోణం జరిగిందన్న కాగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు, భాగస్వామ్య సదస్సుల పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాల తీసేలా ప్రభుత్వం వ్యవరిస్తోందని, కాగ్ నివేదికల ద్వారా అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు పెంచేసి దుబారా ఖర్చులు చేయడం సరికాదని, రోజువారి ఖర్చులకు అప్పుచేసి వృథా ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలన్నీ కాగ్ రిపోర్ట్‌లో ఉన్నాయని, ఒక్క రూపాయి కూడా వృథా కాలేదంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన మాటలు అవాస్తవాలన్నారు. ప్రజాధనాన్ని సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఉపయోగించాలే తప్ప రోజువారీ ఖర్చులకు కాదని, 2.01 లక్షల కోట్ల రూపాయాల అప్పు రాష్ట్ర ప్రజలపై మోపారని మండిపడ్డారు. బడ్జెట్ మొత్తం అంకెల గారడిగా వర్ణిస్తూ, సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా టీడీపీ మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది విద్యార్ధులు ఉంటే 1.8 లక్షల మందికి మాత్రమే ఫీజు రియెంబర్స్‌మెంట్ ఇస్తుందని, పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ రాష్ట్ర పభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల ఖర్చులో ప్రభుత్వంపై నమ్మకం లేదని... ఖర్చు చేశామని చెప్తున్నారే తప్ప వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా లేవన్న కాగ్ నివేదికను గుర్తుచేశారు. కాగ్ రిపోర్టుపై ఏం సమాధానం చెప్తారని చంద్రబాబును ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. -
తెలంగాణ సర్కార్‌కు కాగ్ అక్షింతలు