cognizent
-
కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి!
సాక్షి,ముంబై: భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ కొత్త సీఈవోగా,ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్‌ను ఎంపికయ్యారు. నాలుగేళ్ల పాటు కంపెనీకి సేవలందించిన మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో రవి కుమార్ నియమితులయ్యారు. గ్రోత్‌కు సంబంధించి మంజి పొజిషన్లో ఉన్న కాగ్నిజెంట్ సీవోగాఎంపిగాకవడం సంతోషంగా ఉందని అని కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ బోర్డులో కూడా స్థానం దక్కించుకున్న కుమార్ కాగ్నిజెంట్‌లో ఆన్-డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్ ,అంతర్జాతీయ విస్తరణను పర్యవేక్షిస్తారు. అయితే దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సొంతం చేసుకున్న రవికుమార్ వార్షికవేతనం ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. 2020లో అంబానీ జీతం కంటే నాలుగు రెట్ల అధికం రవి కుమార్ జీతం 2020లో ముఖేశ్ అంబానీ జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువట. రవి కుమార్ మొత్తం జీతం సంవత్సరానికి రూ. 57 కోట్లు (7 మిలియన్ డాలర్లు). దీంతోపాటు దాదాపు రూ. 6 కోట్లు( 7,50,000 డాలర్ల )జాయినింగ్ బోనస్‌ను కూడా అందు కోనున్నారు. యాన్యువల్ బేసిక్ సాలరీగా ఒక మిలియిన్‌డాలర్లు చెల్లింస్తుంది కంపెనీ. అలాగే 2 మిలియన్ డాలర్ల నగదు ప్రోత్సాహకం, వన్ టైమ్ హైర్ అవార్డుగా 5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్‌లను పొందనున్నారు. .కాగా గత రెండేళ్లుగా అంబానీ కేవలం రూ. 1 మాత్రమే జీతంగా తీసుకున్నారని గమనించాలి. 2019-20లో ముఖేశ్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు. కాగా 2016 నుంచి 2022 మధ్య కాలంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రవి కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.మొత్తం రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీలోనే కొనసాగారు. కుమార్ ట్రాన్స్‌యూనియన్ , డిజిమార్క్ కార్ప్ బోర్డులలో కూడా పనిచేశారు. హంఫ్రీస్ రాజీనామా చేయడంతోరవికుమార్ను ఎంపిక చేసింది కాగ్నిజెంట్. ప్రత్యేక సలహాదారుగా మార్చి 15 వరకు కంపెనీలోనే ఉంటారు హంఫ్రీస్ . -
కాగ్నిజెంట్ క్యూ1 ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ1(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 38 శాతం జంప్‌చేసి 50.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,737 కోట్లు)ను తాకింది. గతేడాది(2020) తొలి త్రైమాసికంలో 36.7 కోట్ల డాలర్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 4.2 శాతం పెరిగి 440 కోట్ల డాలర్ల(రూ. 32,560 కోట్లు)కు చేరింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. డిసెంబర్‌తో ముగిసే పూర్తి ఏడాదికి ఆదాయంలో 7–9 శాతం పురోగతిని అంచనా వేస్తోంది. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కంపెనీకి దేశీయంగా 2 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న సంగతి తెలిసిందే. క్యూ1లో డిజిటల్ విభాగంలో అభివృద్ధి, అంతర్జాతీయంగా విస్తరణ, కాగ్నిజెంట్ బ్రాండుకు ప్రాచుర్యం వంటి అంశాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ 2,96,500 మంది ఉద్యోగులున్నారు. 2021పై కంపెనీ ఆశావహ అంచనాల్లో ఉంది. -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బోనస్‌లు, ప్రమోషన్లతో వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. 2019తో పోలిస్తే ఎక్కువగా తాజా బోనస్‌ను ప్రకటించింది. అలాగే 24,000 మందికి పైగా ఉద్యోగులను భారీగా ప్రమోట్ చేయనుంది. సంస్థ అట్రిషన్ (కంపెనీల మార్పు) తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా. దేశీయంగా 24వేల మందికి ప్రమోషన్లతో పాటు ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ ప్రకటించారు. అలాగే సీనియర్ అసోసియేట్స్, అంతకంటే కింది స్థాయి ఉద్యోగులకు ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. 2021 జూన్ త్రైమాసికంనుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షా అరవై వేల మంది ఉద్యోగులకు బోనస్‌లను ఇవ్వనున్నామని నంబియార్ చెప్పారు. (కాగ్నిజెంట్ తీపికబురు : భారీ ఉద్యోగావకాశాలు) కాగా కాగ్నిజెంట్ డిసెంబర్ 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 4,184 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కరెన్సీపరంగా ఇది వార్షిక ప్రాతిపదికన 3 శాతం క్షీణించింది. భారతదేశంలో 2.9 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. 2020 క్యూ 3 ముగింపు నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,89,500. సంస్థ మొత్తం అట్రిషన్ 19 శాతంగా ఉంది. -
కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజీనామా
కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్ట్ రామ్‌కుమార్ రామ్మూర్తి తన పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయం సీఈవో బ్రియాన్ హంప్రీస్ శుక్రవారం వెల్లడించారు. కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో రామ్మూర్తి సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. ఈయన 2019లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి వందలాది మంది సీనియర్ ఉద్యోగులు కాగ్నిజెంట్ నుంచి వైదొలిగారు. ఇదే కంపెనీలో 24ఏళ్ల పాటు సేవలు అందించిన కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబర్ 30న వైదొలగనున్నారు. ఆయన స్థానంలో యాక్సెంచర్ ఎగ్జిక్యూటివ్ ఆండీ స్టాఫోర్డ్‌ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ సమయంలో మీరు క్లయింట్ లకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచదేశాలకు మరిన్ని సేవలు అందిచాల్సిన బాధ్యత కాగ్నిజెంట్‌పై ఉంది. ఇప్పటికే సంస్థ అనేక దేశాల్లో సేవలందిస్తున్నది. ప్రపంచంలో తమ కంపెనీ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగింది’’ అని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో సీఈవో బ్రియాన్ పేర్కొన్నారు. ఇదే విధంగా రామ్మూర్తి కంపెనీకి అందించిన సేవలు మరువలేనివని, సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని బ్రియాన్ కొనియాడారు. -
ఐటీ కంపెనీలకు ఆ చట్టం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: ఐటీ పాలసీ ప్రకారం నెలకొల్పే కంపెనీలు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట పరిధిలోకి రావని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఐటీ కంపెనీ ఉద్యోగుల తొలగింపు వ్యవహారాలపై కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం తమకు లేదని పేర్కొంది. ఐటీ కంపెనీలకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం 2002లోనే ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కేసులో ఇటీవల కోర్టు తీర్పు వెలువరించింది. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ కాగ్నిజెంట్‌లో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేసిన పి.అప్పలనాయుడు వికారాబాద్‌లోని కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 2011లో ఉద్యోగంలో చేరితే 2013లో ఆ కంపెనీ తన వివరణ కోరకుండా తొలగించిందంటూ 48 (1) కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన కార్మిక శాఖ.. అప్పలనాయుడుకు 2017 ఏప్రిల్ వరకు జీతం చెల్లించాలని ఆ కంపెనీని ఆదేశించింది. దీంతో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సదరు కంపెనీ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. -
ఐటీ కంపెనీలపై సంచలన కేసు
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీల్లో టెక్కీల కష్టాలు, పని ఒత్తిడి తదితర అంశాలపై చాలా కథనాలు ఇప్పటివరకూ విన్నాం. చదివాం. అయితే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీలపై ఉద్యోగులు ఏకంగా కోర్టుకెక్కడం సంచలనం రేపుతోంది. యాక్సెంచర్, కాగ్నిజెంట్, కాస్పెక్స్ కార్పొరేషన్ కంపెనీలపై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఐటి ఉద్యోగులు కేసు నమోదు చేశారు. ఫోరమ్ ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్తల బృందంతో కలిసి వీరు తెలంగాణ పిల్ హైకోర్టులో దాఖలు చేశారు. భారతదేశ ఐటి పరిశ్రమ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. "ఉపాధి పేరిట రాష్ట్రంలో వైట్ కాలర్డ్ బానిసత్వం" అని టెక్కీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎక్కువ పని గంటలు, ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం, చెత్త లీవ్ విధానం లాంటి వివిధ ఆరోపణలతో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా ఐటీ సంస్థలను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులిచ్చింది. ఐటి ఉద్యోగుల జీవితాలను మెరుగుపర్చడానికి, సంస్థల పని సంబంధిత దోపిడీని నిలువరించడానికి ఈ పిల్ దాఖలు చేశామని ఫోరం ఎగైనెస్ట్ అవినీతి అధ్యక్షుడు విజయ్ గోపాల్ వెల్లడించారు. అదనపు వేతనం లేకుండా దాదాపు పది గంటల విధులు, కార్యాలయ క్యాబ్‌ల ద్వారా రోజువారీ ప్రయాణంలో 4-5 గంటలు గడపవల్సి రావడం, సెలవులను సమయానికి కేటాయించకపోవడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయన్నారు. చట్టం ఏమి చెబుతుంది? 2002 లో ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, హైదరాబాద్, ఇతర ఐటి హబ్‌లలో వర్తించే చట్టాలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నాయి. ఉద్యోగులను వారానికి 48 గంటలు/ లేదా రోజుకు 8 గంటలు పని ఓవర్ టైం వారానికి 6 గంటలు, సంవత్సరానికి 24 గంటలు మాత్రమే ప్రతి ఉద్యోగికి సంవత్సరంలో 15 రోజుల పెయిడ్ లీవ్, 12 రోజుల క్యాజువల్ లీవ్, 12 రోజుల సిక్ లీవ్ ఇవ్వాలి మరోవైపు రాష్ట్రంలో (అప్పటి ఆంధ్రప్రదేశ్) తమ కార్యాలయాలను స్థాపించడానికి మరిన్ని ఐటి సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్మిక చట్టాలను దాటవేయడానికి వీలు కల్పించింది. మొత్తం 6 విభాగాలను బైపాస్ చేయడానికి అనుమతించారు. వీటిలో ప్రారంభ, ముగింపు గంటలు, రోజువారీ, వారపు పని గంటలు, సెలవులతోపాటు ఉద్యోగం నుంచి తొలిగించిన సందర్భంలో ఉద్యోగిని రక్షించడానికి నిబంధనలున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమింటే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆయా కంపెనీలకు కేవలం 100 రూపాయల జరిమానా మాత్రమే ప్రభుత్వం విధించవచ్చు. ఈ చట్టాన్నిమరో రెండేళ్లపాటు పొడిగిస్తూ 2019లో తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఈవీలకు ఐటీ పరిశ్రమ తోడు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో సరైన ప్రోత్సాహం లేక ఎదగలేకపోతున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) పరిశ్రమకు 15,400 కోట్ల డాలర్ల ఐటీ పరిశ్రమ తోడుగా నిలిచింది. ఈవీలను ప్రోత్సహించేందుకు తామున్నామంటూ ముందుకు వస్తోంది. టాటా మోటార్స్ కంపెనీ కూడా హైదరాబాద్‌లోని ‘కాగ్నిజెంట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’కి కనీసం పది ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేస్తున్నట్లు ఇటీవలనే ప్రకటించింది. అలాగే ఈవీలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ నగరంలో రెండు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంతకుముందు భారత్‌లో మూడవ అతిపెద్ద ఐటీ ఔట్ సోర్సింగ్ కంపెనీ అయిన విప్రో, 2030 నాటికి ప్రపంచంలోని తన అన్ని క్యాంపస్‌లు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగిస్తాయని తెలిపింది. మరో మూడేళ్లలో తాము 500 వాహనాలను, 2023 నాటికి వెయ్యి ఈవీలను కొనుగోలు చేస్తామని విప్రో ప్రకటించింది. అంటే దేశంలో ప్రస్తుతం ఏడాదికి అమ్ముడుపోతున్న ఈవీలలో సగం వాహనాలను విప్రోనే కొనుగోలు చేస్తుందన్నమాట. ఇప్పటికే దేశంలోని అనేక ఐటీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నాయి. అయితే ప్రాథమిక మోడళ్లను మాత్రమే కొనుగోలు చేసి క్యాంపస్‌లలోనే నడుపుతున్నాయి. ఉద్యోగులను క్యాంపస్‌లో ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లేందుకు వీటిని వినియోగిస్తున్నాయి. ఆ వాహనాలు రోడ్ల మీదకు రావాలంటే మరి కొంత సమయం పడుతున్నాయి. చార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాక రోడ్లపైకి వాటిని తీసుకొస్తామని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. ‘మా ఉద్యోగులకు కాలుష్య రహిత పర్యావరణ హిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం కోసం ఇటీవలనే కొన్ని ఈవీలను కొనుగోలు చేశామ’ని కాగ్నిజెంట్ కంపెనీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ రామ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులలోని క్యాంపస్‌లలో వీటిని వినియోగిస్తున్నామని కొంతకాలంలో దేశంలోని అన్ని క్యాంపస్‌లలో వీటిని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. విప్రో సంస్థ కూడా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణె క్యాంపస్‌లలో ఈవీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్యాంపస్‌లన్నింటిలో కలిపి విప్రోకు రెండు వేల వాహనాలు అవసరమని అభిప్రాయపడింది. ఇప్పటికే హైదరాబాద్ క్యాంపస్ కోసం ఇప్పటికే 50 వాహనాలను లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. పెన్సిల్వేనియా ప్రధాన కార్యాలయంగా ఐటీ కంపెనీ యునిసిస్‌లో భాగమైన యునిసిస్ ఇండియా 2015 సంవత్సరం నుంచే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తోంది. తమ ఈవీలన్నీ లిథియమ్ ఐయాన్ బ్యాటరీలపై నడుస్తున్నాయని, నెలకు నాలుగు లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘ఐటీ క్యాంపస్సుల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నలుగురికి దారిచూపే టార్చిలైట్లు పట్టుకోవడానికి ఐటీ కంపెనీ ఇష్టపడతాయి. అందుకని వాటికి ఈవీలు ఎంతో అనువైనవి’ అని ఆటో ఇండస్ట్రీ కన్సల్టెన్సీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఆటోమోటివ్ అడ్వైజర్స్ డైరెక్టర్ దీపక్ రాథోర్ తెలిపారు. -
కాగ్నిజెంట్: 400 మంది టెకీలకు ఉద్వాసన
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. ఇటీవల కంపెనీ ప్రకటించిన తొమ్మిది నెలల వేతనంతో కూడిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఎస్పీ) పథకానికి వీరు అంగీకారం తెలిపారని కాగ్నిజెంట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది ఉద్యోగులు కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నారు. వీఎస్‌పీకి ఆమోదం తెలిపిన 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఎక్కువ మంది భారత ఉద్యోగులేనని భావిస్తున్నారు. ఈ ఆఫర్‌ను అంగీకరించిన వారిలో భారత ఎగ్జిక్యూటివ్‌లు ఎంత మంది ఉన్నారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలుగుతుండటంతో కంపెనీకి ఏటా 60 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని కాగ్నిజెంట్ సీఎఫ్ఓ కరెన్ మెక్లీన్ పేర్కొనడం గమనార్హం. ఉద్యోగులపై వేటుతో కంపెనీ లాభాలు మెరుగుపడతాయని వ్యాఖ్యానించారు. సామర్థ్య మదింపు, వీఎస్పీ కారణంగా తమ సంస్థలో ఉద్యోగుల నిష్ర్కమణ రేటు అత్యధికంగా ఉందని చెప్పారు.