ఏడో రోజుకు మాలల నిరాహార దీక్ష
ముకరంపుర : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షలు సోమవారంతో ఏడో రోజుకు చేరాయి. దీక్షలను టీఎంఎం జిల్లా అధ్యక్షుడు నక్క రాజయ్య, మేడి అంజయ్య, జైమాల మహార్ సామాజిక ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి ప్రారంభించారు. ఏఎంఎస్ఏ జిల్లా అధ్యక్షుడు వేముల రమేశ్, దూస తిరుపతి మాట్లాడుతూ దళితులు కలిసి ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమన్నారు. వర్గీకరణకు మద్దతిచ్చే అన్ని పార్టీల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీక్షలో వేముల రమేశ్, బూర తిరుపతి, సావుల శ్రీనివాస్, పండుగ శేఖర్, అశోక్. నవీన్, అజయ్, సావుల శ్రీనివాస్, గొల్ల నరేష్, తాళ్ల అరుణ్, ఇ.అభిలాష్, శ్రావణ్, అనూష, రాజు, కె.నారాయణ, శ్రీనివాస్, కాటిక రాజమౌళి, నాయిని ప్రసాద్, జిల్లా రమేశ్ కూర్చున్నారు. తీట్ల ఈశ్వరి, గంటల రేణుక, ఆశా విజయ్, పుష్పలత, అనిత, అనంతరాజ్, భూషన్రావు, బత్తుల లక్ష్మీనారాయణ, కెమసారం తిరుపతి సంఘీభావం తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనకయ్య, రాష్ట్ర నాయకుడు దామెర సత్యం దీక్షను విరమింపజేశారు.